జెనీవాలో బైడెన్, పుతిన్‌ల మధ్య చర్చలు-మానవహక్కుల ప్రస్తావన తెచ్చిన అమెరికా- Newsreel

ఫొటో సోర్స్, Reuters
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జెనీవాలో మొదలైన సమావేశపు తొలి విడత చర్చలు ముగిసి రెండో దశ చర్చలు మొదలయ్యాయి.
బైడెన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇరు దేశాల నేతల మధ్య జరుగుతున్న తొలి సమావేశం ఇది. దీంతో, ఈ సమావేశం పట్ల అందరికీ ఆసక్తి నెలకొంది.
ఈ తొలి విడత సమావేశంలో బైడెన్, పుతిన్‌లతో పాటు అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశం మొదలైన వెంటనే బ్లింకెన్ మానవ హక్కుల గురించి ట్వీట్ చేశారు. ఈ అంశం జెనీవా సమావేశాల్లో ప్రస్తావనకు వస్తుందని ముందుగానే ఊహించారు. దాంతో, అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఈ అంశాన్ని ఈ సమావేశాల్లో ముఖ్యమైన చర్చనీయాంశంగా ఉంచారు.
ఈ సమావేశానికి ముందు బైడెన్ రష్యా అధ్యక్షుడిని "అర్హులైన విరోధి" అని వ్యాఖ్యానించారు.
సమావేశానికి ముందు చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొంది. సమావేశానికి ముందు ఇద్దరు నాయకులు నవ్వుతూ, కరచాలనం చేసుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, ఉద్రిక్తతలతో కూడిన సమావేశం ముందుందని ఇద్దరికీ తెలుసు.
ఈ సమావేశం జరిగేందుకు చొరవ తీసుకున్నందుకు పుతిన్ బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖాముఖిగా జరిగే ఈ భేటీ ప్రయోజనకరంగా ఉంటుందని బైడెన్ అన్నారు.
అయితే, ఇరు దేశాల మధ్యనున్న సంబంధాలు ప్రస్తుతం సంక్లిష్టంగా ఉండటంతో ఈ సమావేశం నుంచి చారిత్రక మార్పులేవీ చోటు చేసుకుంటాయని ఊహించడానికి లేదని ఇంతకు ముందే క్రెమ్లిన్ స్పష్టం చేసింది.
ఇటీవల కాలంలో అమెరికా రష్యా సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయని పుతిన్ అన్నారు.
సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నానికి ముందు నుంచీ కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనంగా ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఇరు దేశాల నాయకులూ ఈ చర్చల్లో అంగీకరించే విషయంగా కనిపిస్తోంది.
అయితే, ప్రస్తుతం బైడెన్ స్థిరత్వం నెలకొంటుందనే హామీని ఇస్తున్నారు.
ఈ చర్చల్లో వాతావరణ మార్పులు, అణ్వాయుధ నియంత్రణ, కోవిడ్ 19 మహమ్మారి అంశాల్లో ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది.
అమెరికా, రష్యా అద్యక్షుల మధ్య సమావేశాలు చోటు చేసుకోవడం అంత సాధారణం కాకపోవడంతో ఇరు దేశాల్లో విలేఖరులు ఈ సమావేశాల పట్ల ఉత్సుకతతో ఉన్నారు.
"ఈ సమావేశం గురించి రిపోర్టు చేయడానికి రష్యా విలేఖరులకు ఉన్న ఆసక్తితో వారు అమెరికా ప్రెస్ ఆడియో వ్యక్తిని సమయానికి సమావేశం జరిగే గదిలోకి కూడా రానివ్వలేదు" అని సీబీఎస్ విలేఖరి ట్వీట్ చేశారు.
ఈ చర్చల తర్వాత ఇరు దేశాల నాయకులు వేర్వేరుగా పత్రికా సమావేశాలు నిర్వహించనున్నారు.

యూరో 2020: కోకాకోలాను తిరస్కరించిన ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో... పడిపోయిన కంపెనీ షేర్ ధర
పోర్చుగీసు ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో యూరో 2020 ప్రెస్ మీట్‌లో కోకో కోలాను తాగనంటూ పక్కకు నెట్టేయడం చర్చనీయాంశంగా మారింది.
ప్రెస్ మీట్‌లో కూర్చున్న ఆయన, ఎదురుగా కనిపించిన రెండు కోకో కోలా బాటిళ్లను పక్కనబెట్టి, మంచి నీరు తాగుతానంటూ సంజ్ఞలు ద్వారా సూచించారు.
ఈ సంఘటన జరిగిన కాసేపటికే కోకో కోలా షేర్ విలువ కూడా నాలుగు కోట్ల బిలియన్ డాలర్లు నష్టపోయింది.
బుడాపెస్ట్ జట్టు హంగరీతో తలపడనున్న గ్రూప్ ఎఫ్ గేమ్ కు ముందు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ సమావేశంలో ఆయనకు రెండు సార్లు కోకో కోలాను ఇచ్చినప్పటికీ ఆయన వాటిని కాదని, మంచి నీటి సీసానే తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
క్రిస్టియానో రొనాల్డో ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించే వ్యక్తి. కోకో కోలా కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ అని ఆయన చర్యల ద్వారా స్పష్టం చేసినట్లు గార్డియన్ పత్రిక పేర్కొంది.
ఆయన సమావేశానికి ముందు మంచి నీటి సీసాను పట్టుకుని పోర్చుగీసు భాషలో "అగువా" అని అన్నారు. ఈ సందేశం ద్వారా మంచినీరు తాగడానికి ప్రాధాన్యత ఇమ్మని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
రొనాల్డో చర్య వల్ల కోకో కోలా షేర్ ధర 56.10 డాలర్ల నుంచి 55.22 డాలర్లకు పడిపోయిందని గార్డియన్ పత్రిక పేర్కొంది.
కోకో కోలా యూరో 2020కు అధికారిక స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది." ప్రతీ ఒక్కరికి వారి సొంత అభిరుచులు, అవసరాలు ఉండే హక్కు ఉంది" అని కోకో కోలా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నట్లు గార్డియన్ రాసిన సమాచారం తెలుపుతోంది.
క్రీడాకారులకు కోకో కోలా, జీరో షుగర్ కోకో కోలా లాంటి పానీయాలతో పాటు మంచి నీరు కూడా ఇస్తామని యూరో అధికారిక ప్రతినిధి చెప్పినట్లు గార్డియన్ పేర్కొంది.
రొనాల్డోకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 30కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.

విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు గ్రేహౌండ్స్ దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
మంప పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుఘామున ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు విశాఖ జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. మృతుల్లో మహిళ కూడా ఉన్నారని వెల్లడించింది.
గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని విశాఖ ఎస్పీ కార్యాలయం తెలిపింది.
"మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో మంప పీఎస్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. ఘటనాస్థలికి అదనపు బలగాలు వస్తున్నాయి" అని కొయ్యూరు పీఎస్ సీఐ వెంకట రమణ చెప్పారు.
కాల్పులు జరిగిన ప్రాంతంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్, తపాంచ, మూడు 303 రైఫిల్స్ లభ్యమయ్యాయని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ పార్లమెంటులో తిట్టుకుని, పుస్తకాలతో కొట్టుకున్న ఎంపీలు
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మంగళవారం అధికార, విపక్షాల మధ్య బూతులు తిట్టుకోవడంతో మొదలైన గొడవ, పుస్తకాలతో కొట్టుకోవడం వరకూ వెళ్లింది.
మంగళవారం నేషనల్ అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో విపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడ్డానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య గొడవ మొదలైంది.
పాకిస్తాన్ పార్లమెంటులో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతోంది.
ఆ వీడియోలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన అధికార పార్టీ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎంపీ అల్వీ అవాన్ విపక్ష ఎంపీలను తిడుతూ కనిపిస్తున్నారు. ఎంపీలు ఒకరిపై ఒకరు పుస్తకాలు విసురుకోవడం కూడా ఇందులో కనిపిస్తోంది. బడ్జెట్ పుస్తకాలతో సభ్యులు ఒకరినొకరు కొట్టుకోవడం కనిపించింది.
పార్లమెంటులో గొడవ పెద్దదవడంతో నేషనల్ అసెంబ్లీ సెక్రటరీ అదనపు బలగాలను పిలిపించారు. కానీ అదనపు బలగాలు వచ్చిన తర్వాత కూడా సభలో పరిస్థితి అదుపులోకి రాలేదు.
అధికార, విపక్షాలు పార్లమెంట్ హాల్లో ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటూనే ఉండిపోయారు.
విపక్ష నేత షాబాజ్ షరీఫ్ పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈ మొత్తం గొడవ గురించి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"అధికార పార్టీ ఎలా గూండాయిజం చెలాయిస్తోందో ఈరోజు టీవీలో దేశమంతా చూస్తోంది. నీచమైన తిట్లు కూడా తిట్టారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ నైతికంగా ఎంత దిగజారిందో, పీటీఐ నియంతృత్వ ధోరణులున్న పార్టీగా మారిందనేది ఇది చూపిస్తోంది" అన్నారు.
ఇదంతా జరగడానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణం అని ముస్లిం లీగ్-నవాజ్ ఎంపీ మరియం ఔరంగజేబ్ ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"ఇమ్రాన్ ఖాన్ సృష్టించిన నూతన పాకిస్తాన్‌లోని పరిస్థితి ఇది. ఆయన నియంతృత్వ ధోరణిని ఇది ప్రతిబింబిస్తోంది. పార్లమెంటును స్తంభింపజేయడానికి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి ఇమ్రాన్ ఖాన్ దేన్నీ వదలడం లేదు. విపక్షాలపై పుస్తకాలు విసిరారు" అని ట్వీట్ చేశారు.
అయితే అధికార పార్టీ ఎంపీలు మాత్రం దీనికంతా విపక్ష ఎంపీలే కారణమని ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"నేను తిడుతున్న వీడియో వైరల్ అయినప్పటికీ, అంతకు ముందు నుంచే విపక్షాలు హద్దు మీరాయి. పీఎంఎల్-ఎన్ ఎంపీలు మొదట మమ్మల్ని తిట్టారు, ఆ తర్వాత మేం కూడా వారిని తిట్టాం" అని పీటీఐ ఎంపీ ఆవాన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- సంచయిత, అశోక్ గజపతి రాజు: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి విషయంలో ఇన్ని వివాదాలు ఎందుకు?
- గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ఎందుకు కుప్పకూలాయి.. కంపెనీ ఏం చెబుతోంది..
- ‘వేధింపులు భరించలేకపోతున్నాం, ఈ ఇల్లు అమ్మేస్తాం’ అని ఒక కులం వాళ్లు ఎందుకు పోస్టర్లు అంటించారు?
- ద గేట్స్ ఆఫ్ హెల్: ఎడారిలో అగ్ని బిలం.. దశాబ్దాలుగా మండుతూనే ఉంది
- బెంజమిన్ నెతన్యాహు: ఈ ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడు ప్రపంచానికి ఎలా గుర్తుండి పోతారు
- మిజోరాం: 38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్ద’ ఇకలేరు
- పాకిస్తాన్లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం?
- ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నాఫ్తాలి బెన్నెట్
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








