డిగో మారడోనా: సాకర్‌ స్టార్‌ కెరీర్‌లో మరపురాని ఘట్టాలు

మారడోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1986 వరల్డ్‌ కప్‌ను ప్రదర్శిస్తున్న డిగో మారడోనా. ట్రైనింగ్ సెషన్‌లో, మాజీ భార్య క్లాడియా, కూతుర్లు దల్మా, గియానియాలతో మారడోనా

డిగో మారడోనా సాకర్‌ ప్రపంచపు మేధావి మాత్రమే కాదు, అనేక వివాదాలకు కేంద్ర బిందువు కూడా.

సొంత దేశం అర్జెంటీనా నుంచి ఇటలీ వరకు అతని విజయాలు విస్తరించాయి. ప్రపంచకప్‌ గెలిచిన సంబరంలోనే కాదు, డ్రగ్స్‌తో అతని పతనాన్ని కూడా ప్రపంచం చూసింది. ఆయన జీవితం నుంచి కొన్ని ఛాయా చిత్రాలు..

మారడోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొలినాళ్లలో: 1982 వరల్డ్‌ కప్‌ సాకర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడారు మారడోనా. కానీ నాలుగు సంవత్సరాల తర్వాతే అతని అసలు ఆటను ప్రపంచం చూసింది.
మారడోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుపాను ముందు ప్రశాంతత: 1986 వరల్డ్‌ కప్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ గోల్‌ కీపర్‌ పీటర్‌ షిల్టన్‌తో మారడోనా షేక్‌హ్యాండ్‌
ఇంగ్లాండ్‌ మీద 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' గోల్‌ ఆపై 'గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ'

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లాండ్‌ మీద 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' గోల్‌ ఆపై 'గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ'
మారడోనా

ఫొటో సోర్స్, Rex Features

ఫొటో క్యాప్షన్, వరల్డ్‌ క్లాస్‌: 1986 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో గెలిచాక మారడోనాను ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా ప్రకటించారు. చాలా సంవత్సరాల తర్వాత తన జట్టు ఫైనల్‌ చేరడంలో ఆయన కృషి ఉంది.
మారడోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కప్‌ కింగ్‌: మారడోనా ఇటలీ క్లబ్‌ 'నాపోలి'కి ఐకాన్‌గా మారారు. 1989లో ఈఫా కప్‌తోపాటు రెండు లీగ్‌ టైటిళ్లను ఆయన గెలిచారు. ఆయన గౌరవార్థం పదో నెంబర్‌ జెర్సీకి రిటైర్‌మెంట్ ఇచ్చారు.
మారడోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బరువైన బాధ్యతలు: 2001లో మారడోనా డ్రగ్స్‌, అధిక బరువు సమస్యలతో ఇబ్బంది పడ్డారు.
మారడోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అర్జెంటీనా ఎ-టీమ్‌: 2010 వరల్డ్‌ సమయంలో అర్జెంటీన జాతీయ జట్టు టీమ్‌ మేనేజర్‌గా ఉన్న మారడోనా తన వ్యూహాలన్నింటినీ మెస్సీకి నూరిపోశారు. కానీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో జర్మనీ చేతిలో అర్జెంటీనా 4-0 తేడాతో ఓడిపోయింది.
మారడోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోస్టర్‌ బాయ్‌: రష్యాలో జరిగిన 2018 వరల్డ్ కప్‌ అర్జెంటీనా వర్సెస్‌ నైజీరియా మ్యాచ్‌ సందర్భంగా తన ఫొటో ఉన్న బ్యానర్‌తో మారడోనా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)