#FIFA2018: కల్లలైన మెస్సీ కలలు

ఫొటో సోర్స్, Reuters
వరల్డ్ కప్ ఫుట్ బాల్ మొదటి నాకౌట్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ అర్జెంటీనాను 4-3 గోల్స్ తేడాతో ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రెండు జట్ల ఆటగాళ్లు ఏడు గోల్స్ చేశారు.
హాఫ్ టైమ్ వరకూ రెండు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.
కానీ సెకండ్ హాఫ్‌లో ఫ్రాన్స్ దూకుడు పెంచి మూడు గోల్స్ వేసింది. వాటిలో రెండు గోల్స్ కలియన్ బప్పే వేశాడు.
ఇంజూరీ టైమ్‌లో అర్జెంటీనా తరఫున ఎగ్యురో ఒక గోల్ చేసినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది.

ఫొటో సోర్స్, Reuters
పెనాల్డీతో మొదటి గోల్
మ్యాచ్ ప్రారంభంలోనే ఫ్రాన్స్ అర్జెంటీనాపై ఆధిక్యత సాధించింది. ఆట తొమ్మిదో నిమిషంలోనే తన ఫార్వర్డ్ ఆటగాడు ఆంటోనీ గ్రీజ్‌మేన్ షాట్ గోల్‌పోస్ట్‌ను తగిలి వెనక్కు వచ్చింది.
11వ నిమిషంలో మార్క్ రోజో అర్జెంటీనా బాక్సులో ఫ్రాన్స్ మిడ్ ఫీల్డర్ కలియన్ బప్పేకు ఫౌల్ చేశాడు. ఫలితంగా ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. ఆటలో 13వ నిమిషంలో ఆంటోనీ గ్రీజ్‌మెన్ పెనాల్టీని గోల్‌గా మలచి తన టీమ్‌కు ఆధిక్యత సాధించిపెట్టాడు.
ఆ తర్వాత మ్యాచ్‌పై అర్జెంటీనా పట్టు బిగించడం మొదలెట్టింది. ఆటలో 41వ నిమిషంలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ ఏంజెల్ డి మారియా 30 గజాల దూరం నుంచి ఒక అద్భుతమైన గోల్ వేశాడు. టీమ్‌ను సమంగా తెచ్చాడు.
డి మారియా ఈ టోర్నమెంటులో తన రెండో గోల్ వేశాడు.మొదటి హాఫ్‌లో మ్యాచ్ 1-1తో సమానం అయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
అర్జెంటీనాకు 8వ నిమిషంలో ఆధిక్యం
రెండో హాఫ్‌లో 48వ నిమిషంలో మెస్సీ ఇచ్చిన పాస్‌తో మార్కడో గోల్ వేసి అర్జెంటీనాకు 2-1 ఆధిక్యం తెచ్చిపెట్టాడు. కానీ కేవలం 8 నిమిషాల తర్వాత ఫ్రాన్స్ కూడా మరో గోల్ వేసింది. గోల్స్ సమం చేసింది.
ఆటలో 57వ నిమిషంలో డిఫెండర్ బెంజమిన్ పావర్డ్ ఫ్రాన్స్ తరఫున మరో గోల్ వేశాడు. వరల్డ్ కప్‌లో పావర్డ్‌కు ఇది మొదటి గోల్.
ఈ ఓటమితో ఈ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా కథ ముగిసింది. ఈ విజయంతో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








