ప్రధాని మోదీ కోవిడ్ నియంత్రణ కన్నా విమర్శలను అణచివేయడం పైనే దృష్టి పెట్టారు -'లాన్సెట్' మెడికల్ జర్నల్ విమర్శ -Newsreel

ప్రధాని మోదీపై లాన్సెట్ జర్నల్ విమర్శలు

ఫొటో సోర్స్, Sonali Pal Chaudhury/NurPhoto via Getty Images

భారత్‌లో కోవిడ్-19ను నియంత్రించడం కంటే, ట్విటర్లో వచ్చే విమర్శలను అణచివేయడంపైనే ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ది లాన్సెట్ తన ఎడిటోరియల్‌లో విమర్శించింది.

"ఇలాంటి క్లిష్ట సమయంలో తనపై వచ్చే విమర్శలను, బహిరంగ చర్చను అణచివేయాలనే మోదీ ప్రయత్నాలు క్షమార్హం కాదు" అని ఆ జర్నల్‌లో రాశారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా ప్రకారం భారత్‌లో ఆగస్టు 1 నాటికి కరోనా వల్ల సంభవించే మరణాల సంఖ్య 10 లక్షలకు చేరవచ్చని జర్నల్ తన రిపోర్టులో చెప్పింది.

కరోనాపై మొదటి విజయం సాధించిన తర్వాత, దానిపై ఏర్పాటైన ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఏప్రిల్ వరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని లాన్సెట్ చెప్పింది.

"దాని ఫలితం ఇప్పుడు మన ముందుంది. ఇప్పుడు మహమ్మారి పెరుగుతోంది. భారత్‌లో కొత్తగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం తన తప్పులను ఒప్పుకుని, పారదర్శకతతో నేతృత్వం వహిస్తుందా లేదా అనేదానిపై ఆ చర్యలు విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది" అని జర్నల్ తెలిపింది.

"కేసుల సంఖ్య పెరిగేకొద్దీ, ప్రభుత్వం నిర్ణీత సమయానికి కచ్చితమైన గణాంకాలు అందుబాటులో ఉంచాలి, ప్రతి 15 రోజులకు ఒకసారి దేశంలో ఏం జరుగుతోంది, మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి ప్రజలు ఏం చేయాలో చెప్పాలి. అందులో, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశాల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది".

టీకా

ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images

కరోనా వ్యాప్తి గురించి మరింత తెలుసుకునేలా, మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేలా జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ప్రోత్సహించాలి.

ప్రాంతీయ స్థాయిలో ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి చర్యలు ప్రారంభించాయి. కానీ మాస్క్ వేసుకునేలా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా, జనం గుమిగూడకుండా, క్వారంటీన్, టెస్టింగ్ జరిగేలా చూసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్రం పాత్ర కీలకం.

వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని లాన్సెట్ జర్నల్ అభిప్రాయపడింది.

"ప్రస్తుతం దేశం ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. వ్యాక్సీన్ సరఫరాను పెంచడం. అవి గ్రామీణ ప్రాంతాలకు, పేదల వరకూ చేరేలా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం. ఎందుకంటే దేశంలో 65 శాతం జనాభాకు ఆరోగ్య సేవలు అందడం లేదు" అని చెప్పింది.

భారత ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితి, భారత్‌లో మహమ్మారి అంతం దిశగా సాగుతోందని ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటనను కూడా లాన్సెట్ ప్రస్తావించింది.

"కొన్ని నెలలకు కేసులు తగ్గిన తర్వాత భారత్‌ కరోనాను ఓడించిందని చూపించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, సెకండ్ వేవ్ ప్రమాదం, కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేసింది" అని జర్నల్ చెప్పింది.

"హెచ్చరికలు చేసినా ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాలను అనుమతించింది. అందులో లక్షలమంది గుమిగూడారు. దానితోపాటూ ఎన్నికల ర్యాలీలుకూడా జరిగాయి" అని జర్నల్ తన ఎడిటోరియల్‌లో చెప్పింది.

క్యూలో జనం

ఫొటో సోర్స్, Pratik Chorge/Hindustan Times via Getty Images

దేశంలో వ్యాక్సినేషన్ తీరుపై కూడా లాన్సెట్ విమర్శలు గుప్పించింది.

"కేంద్రం స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఫెయిల్ అయ్యింది. టీకా డోసులు పెంచడం, 18 ఏళ్లకు పైబడిన అందరికీ వ్యాక్సీన్ వేయడం గురించి కేంద్రం రాష్ట్రాల సలహాలు తీసుకోలేదు. హఠాత్తుగా తన పాలసీ మార్చింది. దాంతో వ్యాక్సీన్ల సరఫరాలో కొరత ఏర్పడి, గందరగోళం వ్యాపించింది" అని చెప్పింది.

మహమ్మారితో పోరాడ్డానికి కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాలు సన్నద్ధంగా ఉన్నాయని జర్నల్ చెప్పింది. అవి ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి మిగతా రాష్ట్రాలకు కూడా అందిస్తున్నాయని తెలిపింది.

అటు మహారాష్ట్ర సెకండ్ వేవ్ ఎదుర్కోడానిక సిద్ధంగా లేదని, అది ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకలు, మిగతా అవసరమైన మెడికల్ సౌకర్యాలతోపాటూ, దహనాలకు స్థలం సమస్య కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది.

పడకలు, ఆక్సిజన్ డిమాండ్ చేస్తున్న వారిపై కొన్ని రాష్ట్రాలు భద్రతకు సంబంధించిన చట్టాలను కూడా ప్రయోగించాయని లాన్సెట్ చెప్పింది.

లాన్సెట్ ఈ రిపోర్టుతో విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం ట్విటర్‌లో లాన్సెట్ ఎడిటోరియల్ చూసిన తర్వాత ప్రభుత్వానికి సిగ్గుంటే, దేశాన్ని క్షమాపణలు అడగాలి అన్నారు.

ఆయన ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ రాజీనామాకు కూడా డిమాండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ప్రభుత్వం బాకాలు ఊదేవారు, లాన్సెట్ గతంలో ప్రచురించిన ఎడిటోరియల్‌ను ఉపయోగించి తమ గొప్పలు చెప్పుకున్నారు" అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ట్వీట్ చేశారు.

line

దిల్లీలో మరో వారంలాక్‌డౌన్... మెట్రో సేవలు కూడా బంద్

దిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో లాక్‌డౌన్ మరో వారం పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈసారి లాక్‌డౌన్ చాలా కఠినంగా ఉంటుందని తెలిపారు.

లాక్‌డౌన్‌కు ముందు కరోనా వ్యాప్తి రేటు 35 శాతం అంటే, 100 మందికి టెస్ట్ చేస్తే 35 మందికి వ్యాపించేదని గుర్తించినట్లు కేజ్రీవాల్ చెప్పారు

ఇప్పుడు లాక్‌డౌన్ తర్వాత ఈ వ్యాప్తి రేటు 23 శాతానికి తగ్గిందని ముఖ్యమంత్రి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

విధిలేని పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఇది కఠినంగా ఉంటుందని తెలిపారు.

రేపటి నుంచి మెట్రో సేవలు కూడా నిలిపివేయనున్నారు.

శనివారం దిల్లీలో కొత్తగా 17,364 కరోనా కేసులు నమోదుకాగా, కోవిడ్‌తో 332 మంది చనిపోయారు.

భారత్‌లో మళ్లీ 4 లక్షలకు పైగా కేసులు

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,03,738 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల మొత్తం 4,092 మంది చనిపోయారు. శనివారం దేశంలో 3,86,444 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కి చేరగా, దేశంలో మొత్తం మరణాలు 2,42,362కు పెరిగింది.

ఇప్పటివరకూ దేశంలో 16,94,39,663 డోసుల వ్యాక్సీన్ వేశారు.

భారత్‌లో ప్రస్తుతం 37,36,648 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో వరుసగా గత నాలుగు రోజుల నుంచీ 4 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)