కోవిడ్: ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న కరోనా బాధితులు.. సహాయం కోసం అర్థిస్తున్న కుటుంబీకులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
ఆక్సిజన్, ఆక్సిజన్, నాకు కొంచెం ఆక్సిజన్ దొరుకుతుందా?
పొద్దునే వేదనతో కూడిన గొంతుతో ఒక స్కూల్ టీచర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఈ రోజు నిద్ర లేచాను. ఆమె 46 ఏళ్ల భర్తకు కోవిడ్ సోకడంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో మృత్యువుతో పోరాడుతున్నారు.
శ్వాస తీసుకోవడం కూడా ఒక విలాసంగా మారిపోయిన ఈ నగరంలో ఇది ఇంకో రోజు అని నాకు నేనే చెప్పుకున్నాను.
వెంటనే రకరకాల వాళ్లకి ఆక్సిజన్ కోసం ఫోన్లు చేయాల్సి వచ్చింది.
ఇంతలో ఆసుపత్రిలో మానిటర్ బీప్ శబ్దాలు వినిపిస్తుండగా ఆమె తిరిగి ఫోన్ చేసి తన భర్త ఆక్సిజన్ స్థాయి 58కి పడిపోయిందని చెప్పారు. కొంత సేపటికి 62కి పెరిగిందని ఆమె ఆనందంగా చెప్పారు.
ఆక్సిజన్ స్థాయి 92 కంటే తక్కువ పడిపోతే డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.
ఆమె భర్త స్పృహలోనే ఉన్నారని.. మాట్లాడుతున్నారని చెప్పారు. క్రిటికల్ కేర్‌లో పనిచేస్తున్న నా డాక్టర్ స్నేహితునికి ఈ విషయం చెబుతూ సందేశం పంపాను.
కొంత మంది ఆక్సిజన్ స్థాయి 40కి పడిపోయినా మాట్లాడుతారని డాక్టర్ సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
నేను వార్తాపత్రిక తెరిచేసరికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 25 మంది తీవ్ర అస్వస్థతతో మరణించారనే వార్త ఫ్రంట్ పేజీలో కనిపించింది. క్రిటికల్ కేర్‌లో ఇచ్చే ఆక్సిజన్ ప్రెషర్ తగ్గించి చాలా మందికి మాన్యువల్‌గా ఆక్సిజన్ ఇస్తున్నట్లు ఆసుపత్రి చెప్పింది.
మొదటి పేజీలో ముగ్గురు వ్యక్తులు ఒకే ఆక్సిజన్ సిలిండర్‌ను పంచుకుంటున్న చిత్రం కనిపించింది. ప్రజల పట్ల వహించిన అశ్రద్ధ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముగ్గురు అపరిచితులు ఈ విషాదంలో చిక్కుకుపోయారు.
అందులో ఉన్న ఒక వ్యక్తి 40 సంవత్సరాల కొడుకు అదే ఆసుపత్రిలో బెడ్ కోసం ఎదురు చూస్తూ కొన్ని రోజుల క్రితమే ఆసుపత్రి బయట మరణించారు. ఈయనకు కనీసం స్ట్రెచర్ అయినా దొరికింది అని ఆ రిపోర్టులో ఉంది.
దీనికే భారతీయులు చాలా కృతజ్ఞతగా భావించాలేమో. మీరు మా ఆప్తుల కోసం పడకలు, ఆక్సిజన్, మందులు ఇవ్వలేకపోతే కనీసం వారి మృత దేహాలను మోసుకుని వెళ్ళడానికి ఒక స్ట్రెచర్ అయినా ఇవ్వండి అని ఆక్రోశిస్తున్నారు.
రోజు గడుస్తున్న కొలదీ పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదని అర్థమైంది.
ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలా మంది రోగులు చనిపోతున్నారు. చాలా మందులు దొరకటం లేదు. కొన్ని బ్లాక్ మార్కెట్ లో పెట్టి అమ్ముతున్నారు.
యుద్ధ సమయంలో ఉన్నట్లు ప్రజలు భయంతో ఇష్టం వచ్చినట్లు మందులను కొంటున్నారు.

ఫొటో సోర్స్, EPA
చాలా విధాలుగా మనం అలాంటి స్థితిలోనే ఉన్నాం.
ఇంతలో ఆ టీచర్ మళ్లీ కాల్ చేశారు. ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఫ్లో మీటర్ లేకపోవడం వల్ల ఆమె సొంతంగా ఒకటి తెచ్చుకోవాలని చెప్పారు.
ఫోన్లు చేయడం, ట్విటర్‌లో అభ్యర్ధనలు పెట్టడం మళ్లీ మొదలైంది. ఆక్సిజన్ సిలిండర్ నుంచి రోగికి పంపించే ఆక్సిజన్‌ను నియంత్రించే పరికరాన్ని ఒకరు సంపాదించగలిగారు.
ప్రభుత్వం చెప్పే విషయాలు ఎలా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. రోగులను బతికించడానికి ఆక్సిజన్ సిలిండర్లు నగరానికి సరైన సమయానికి రావడం లేదు. ఆసుపత్రుల్లో పడకలు లేవు. కొన్ని మందులు మాత్రమే ఉన్నాయి.
దేశంలో ఉన్నత వర్గాల వారికి కూడా ఏమి ప్రాధాన్యాలు లేవు. ఈ మధ్యాహ్నం ఒక పత్రిక ఎడిటర్ ఫోను చేసి ఆయనకు తెలిసిన ఒక రోగికి ఆక్సిజన్ సిలిండర్ లభిస్తుందేమోనని అడుగుతున్నారు.

నేను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ సముదాయంలో ఎవరికైనా అవసరం అవుతుందేమోననే ఉద్దేశంతో కొంత మంది సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. మా సముదాయంలో ఇప్పటికే 57 మందికి ఇన్ఫెక్షన్ సోకి వారి వారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉన్నారు.
రోగులు వారి తిండి గురించి వారే చూసుకోవాల్సి వస్తోంది. చాలా మందికి ఇది నెమ్మదిగా మృత్యువు వైపు తీసుకుని వెళ్లే మార్గంలా ఉంది.
కోవిడ్-19 చాలా రకాలుగా ఆకస్మికంగా దాడి చేసే ఒక రోగం.
"నేను చనిపోతున్నా కూడా నేను నిజంగా చనిపోయే వరకు బతికి ఉన్నట్లే అర్ధం" అని పాల్ కళానిధి అనే న్యూరో సర్జన్ తన స్వీయ చరిత్ర 'వెన్ బ్రీత్ బికమ్స్ ఎయిర్'లో రాశారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










