మన్‌దీప్ పునియా: రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ అరెస్ట్.. శనివారం అరెస్ట్ చేసి ఆదివారం వరకు రహస్యంగా దాచిపెట్టిన పోలీసులు

ఫొటో సోర్స్, Mandeep punia/facebook
- రచయిత, సత్ సింగ్
- హోదా, బీబీసీ హిందీ కోసం
రైతులు ఆందోళన చేస్తున్న సింఘు బోర్డర్ వద్ద జర్నలిస్ట్ మన్‌దీప్ పునియాను అరెస్ట్ చేసిన విషయం శనివారం సాయంత్రం మొదట సోషల్ మీడియాలో వచ్చింది.
కానీ, అధికారులు మాత్రం ఆయన అరెస్టును నిర్ధరించలేదు.. అక్కడికి చాలా సమయం తరువాత ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒక చిన్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఒక వ్యక్తిని పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
ఆ తరువాత సోషల్ మీడియాలో మన్‌దీప్ పునియా అరెస్టు గురించి పోస్టులు, వీడియోలు కనిపించాయి. అయితే, ఆదివారం ఉదయం వరకు కూడా ఆయన ఎక్కడ ఉన్నదీ పోలీసులు బయటపెట్టలేదు.
'కారవాన్' సహా వివిధ మ్యాగజీన్లకు మన్‌దీప్ రైతుల ఆందోళనలపై వార్తలు రాస్తున్నారు.
మన్‌దీప్‌తో పాటు ధర్మేంద్ర సింగ్ అనే మరో జర్నలిస్ట్‌ను కూడా సింఘు బోర్డర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ధర్మేంద్ర ఒక యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు.
మన్‌దీప్, ధర్మేంద్ర ఇద్దరూ హరియాణాలోని ఝజ్జర్ జిల్లాకు చెందినవారు.

ఫొటో సోర్స్, Getty Images
సింఘు బోర్డర్ వద్ద ఏమైంది?
మన్‌దీప్‌తో పాటు ధర్మేంద్ర సింగ్‌ను కూడా సింఘు బోర్డర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆ తరువాత ఆదివారం ఉదయం 5 గంటలకు ధర్మేంద్రను పోలీసులు వదిలిపెట్టారు.
రైతుల ఆందోళన విషయంలో పోలీసులు ఏం చేసినా ఆ వీడియోలు తీయబోనని.. ఇవన్నీ మీడియాతో మాట్లాడబోనని రాతపూర్వకంగా తన వద్ద నుంచి పత్రం తీసుకుని విడిచిపెట్టారని ధర్మేంద్ర చెప్పారు.
ధర్మేంద్రను అరెస్ట్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న మన్‌దీప్ ప్రశ్నించడంతో పాటు.. జర్నలిస్టును ఎందుకు అరెస్టు చేస్తున్నారో ప్రశ్నించాలంటూ ప్రజలకు పిలుపునివ్వడంతో ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి లాగేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఒక పంజాబీ న్యూస్ పోర్టల్ కోసం పనిచేసే మన్‌దీప్ సింగ్ అనే మరో జర్నలిస్ట్ మాట్లాడుతూ.. అప్పుడక్కడ కిసాన్ మోర్చా ప్రెస్ కాన్ఫరెన్స్ జరగాల్సి ఉందని.. అప్పుడక్కడ గందరగోళం నెలకొందని.. అలాంటి సమయంలో ధర్మేంద్ర, మన్ దీప్ పునియాలను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
న్యూస్ లాండ్రీ కోసం పనిచేసే జర్నలిస్ట్ బసంత్ కుమార్ మాట్లాడుతూ.. ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేశారన్న విషయం తెలియగానే మిగతా జర్నలిస్టులు అలీపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులను నిలదీశారని.. కానీ, పోలీసులు మాత్రం తామెవరనీ అరెస్టు చేయలేదని చెప్పారని అన్నారు.
ఆదివారం వేకువన 3 గంటల వరకు చాలామంది జర్నలిస్టులు అక్కడే పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించారు. కానీ, పోలీసులు మాత్రం మన్ దీప్, ధర్మేంద్రలకు సంబంధించి ఎలాంటి సమాచారం చెప్పలేదు.
అనంతరం ఆదివారం మధ్యాహ్నం కొందరు జర్నలిస్టులు దిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట జర్నలిస్టులు తమ నిరసన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎఫ్ఐఆర్‌లో ఏముంది?
సుమారు 12 గంటల పాటు పోలీస్ కస్టడీలో ఉంచిన తరువాత మన్ దీప్ పునియాపై వివిధ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సింఘు బోర్డర్ వద్ద పోలీసులు తమ విధుల్లో ఉన్న సమయంలో కొందరు రైతులు బారికేడ్లు విరగ్గొట్టే ప్రయత్నం చేశారని.. పోలీసులతో కొందరు రైతులు ఘర్షణకు దిగారని, ఈ తోపులాటలో మన్ దీప్ సింగ్ కూడా ఉన్నారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆదివారం ఉదయం దిల్లీ పోలీసులు మన్ దీప్‌ను సమయ్‌పుర్ బద్లీ స్టేషన్ నుంచి తిహార్ జైలుకు కోర్టు కాంప్లెక్స్‌కు తరలించి అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
అయితే, ధర్మేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా గానీ, విడిచిపెట్టినట్లుగా కానీ ఎఫ్ఐఆర్‌లో ఎక్కడా నమోదు చేయలేదు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా: సరస్సులో ఈదుతుంటే మొసలి పట్టుకుంది.. చివరకు దాని దవడలు చీల్చి బయటపడ్డాడు
- హైదరాబాద్: ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’.. ఒంటరి మహిళలే టార్గెట్... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- తెలంగాణ: ఆసిఫాబాద్ జిల్లాలో పులి కలకలం.. అసలైనదా? అధికారులు సృష్టించిందా?
- మదనపల్లె హత్యలు: ‘కాళికనని చెబుతూ.. నాలుక కోసి..
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








