కరోనావైరస్: భారత్ అవసరాలకు సరిపడినంత వ్యాక్సీన్‌ను దేశంలోని సంస్థలు తయారుచేయగలవా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్ టీం
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచంలో 60 శాతం వ్యాక్సీన్లను భారత్ ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు కరోనావైరస్ కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా తర్వాతి స్థానం భారత్‌దే.
తమ దేశానికి అవసరమైన టీకాలను ఉత్పత్తి చేయడంతోపాటు ప్రపంచ దేశాలకు సరిపడా టీకాలు సరఫరా చేసేందుకు ప్రస్తుతం భారత్ కృషి చేయాల్సి ఉంటుంది.
మరి ఈ డిమాండ్‌ను భారత సంస్థలు అందుకోగలవా?
భారత్ ఎన్ని వ్యాక్సీన్లను ఉత్పత్తి చేయగలదు?
ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్), దేశీయ వ్యాక్సీన్ కోవాగ్జిన్‌లకు భారత్ ఆమోదం తెలిపింది.
ట్రయల్ దశలోనున్న మరికొన్ని వ్యాక్సీన్లు కూడా భారత్‌లో తయారుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వ్యాక్సీన్లను భారీగా తయారుచేసేందుకు భారత ఫార్మా సంస్థలు కొత్త సదుపాయాలను సమకూర్చుకుంటున్నాయని, ఇప్పటికే భారీగా తయారీని మొదలుపెట్టాయని ఇటీవల కాలంలో చాలా వార్తలు వచ్చాయి.
నెలకు 7 కోట్ల టీకాలను తాము చేయగలమని భారత్‌లో అతిపెద్ద టీకా తయారీ సంస్థ ద సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తెలిపింది.
మరోవైపు ఏడాదికి 20 కోట్ల డోసుల టీకాలు తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. అయితే ప్రస్తుతం సంస్థ దగ్గర కేవలం 2 కోట్ల డోసుల కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉంది.
వ్యాక్సీన్లను తయారుచేస్తున్న మరికొన్ని సంస్థలు భారత్ అధికారులతో చర్చలు జరుపుతున్నాయి. అయితే, ఎన్ని టీకాలు తయారుచేస్తారు? ఎప్పుడు తయారుచేస్తారు? లాంటి అంశాలు ఇంకా ఆ సంస్థలు బయటపెట్టడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు ఎన్ని అవసరం అవుతాయి?
ప్రాధాన్య వర్గాలుగా గుర్తించిన 30 కోట్ల మందికి జులై చివరి కల్లా తొలి దశలో భాగంగా టీకాలు ఇస్తామని ఇప్పటికే భారత ప్రభుత్వం వెల్లడించింది.
ఇక్కడ వ్యాక్సీన్లు ఇచ్చే ప్రక్రియ జనవరి 16న ప్రారంభం కానుంది. ఆరోగ్య సేవల సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి దశలో టీకాలు ఇస్తారు.
నెలకు 8.5 కోట్ల డోసుల చొప్పున వచ్చే ఏడు నెలల్లో 60 కోట్ల డోసుల వ్యాక్సీన్లను ప్రజలకు ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతానికి తమ దగ్గర 5 కోట్ల డోసుల టీకాలు మాత్రమే సిద్ధంగా ఉన్నాయని సీరం ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.
వీటిలో ఎన్ని విదేశాలకు ఎగుమతి చేయాలి? ఎన్ని భారత్‌లో ఉపయోగించాలి? లాంటి అంశాలపై ఇంకా చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
SIICovishield, Covovax
Bharat BiotechCovaxin, Nasal vaccine
Biological EJohnson & Johnson
Dr Reddy'sSputnik
Zydus CadilaZyCov-D
GennovamRNA vaccine
టీకాల ఎగుమతిలో భారత్ పాత్ర
మధ్య, అల్పాయ దేశాలకు వ్యాక్సీన్లు చేరవేయడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చిన అంతర్జాతీయ కార్యక్రమం కోవాక్స్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా పాలుపంచుకుంటోంది.
దీనిలో భాగంగా 20 కోట్ల డోసుల వ్యాక్సీన్లను అందించేందుకు గత సెప్టెంబరులో సీరం ఇన్‌స్టిట్యూట్ అంగీకరించింది. కోవిషీల్డ్ లేదా అమెరికా తయారుచేసిన నోవావ్యాక్స్‌లను సంస్థ తయారుచేయాల్సి ఉంటుంది.
మరోవైపు కోవాక్స్ ఒప్పందంలో మరో 90 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను చేర్చే అవకాశముందని సీరం ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదర్ పునావల్లా బీబీసీకి తెలిపారు.
దీంతో ప్రపంచ దేశాలకు వంద డోసులపైనే టీకాలు సరఫరా చేసేందుకు సంస్థ అంగీకరించినట్లు అవుతుంది.
మార్చి నుంచి నెలకు పది కోట్ల డోసులను తయారుచేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు బీబీసీకి సంస్థ తెలిపింది.
మిగతా సంస్థలు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి?
కోవాక్స్ కార్యక్రమంతోపాటు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ కోవిషీల్డ్‌ను మరికొన్ని దేశాలకు సరఫరా చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.

ఫొటో సోర్స్, EPA
అయితే, ఎగుమతులు చేయకూడదు అనే షరతుపై తమ టీకాకు అనుమతి ఇచ్చారని ఇటీవల ఆదర్ చెప్పడంతో కాస్త అనిశ్చితి నెలకొంది.
దీనిపై బంగ్లాదేశ్ నిరసన వ్యక్తంచేయడంతో భారత్ స్పష్టతనిచ్చింది. ఎగుమతులకు అనుమతిస్తామని తెలిపింది. 3 కోట్ల డోసుల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌తో బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రపంచంలో అతిపెద్ద టీకా తయారీ దేశమైన భారత్.. పొరుగు దేశాలతోపాటు ఇతర దేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేసేందుకు కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ అధికారి బీబీసీకి తెలిపారు.
ప్రస్తుతం సౌదీ అరేబియా, మయన్మార్, మొరాకోలతో కూడా సీరం ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఎంత మొత్తంలో టీకాలు ఎగుమతికి ఒప్పందాలు కుదిరాయో తెలియడం లేదు.
మరోవైపు నేపాల్, బ్రెజిల్, శ్రీలంక కూడా భారత్‌లో తయారుచేస్తున్న వ్యాక్సీన్లను తీసుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నాయి.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/gettyimages
అయితే, మొదట దేశీయ అవసరాలకే తాము ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే ఆదర్ తెలిపారు.
‘‘దేశంలో సరిపడా టీకాలు సరఫరా చేసిన తర్వాతే.. మేం విదేశాలకు ఎగుమతి చేస్తాం’’అని ఆయన వివరించారు.
ప్రస్తుతం భారత ప్రభుత్వంతోపాటు సీరం ఇన్‌స్టిట్యూట్‌తోనూ తరచూ సంప్రదింపులు చేపడుతున్నామని కోవాక్స్ కార్యక్రమంలో భాగస్వామ్య సంస్థ గ్లోబల్ వ్యాక్సీన్ అలయన్స్ (గావి) బీబీసీతో తెలిపింది.
కోవాక్స్ కార్యక్రమానికి ఇచ్చిన హామీల్లో ఎలాంటి ఆలస్యమూ జరగకపోవచ్చని సంస్థ తెలిపింది.
‘‘కోవాక్స్ ఒక అంతర్జాతీయ కార్యక్రమం. దీనిలో భాగంగా ఇచ్చిన హామీలను భారత కంపెనీలు నెరవేర్చకపోతే సరికాదు. అదే సమయంలో ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలను నేరవేర్చాలి’’అని వైరాలజిస్ట్ డాక్టర్ షహీద్ జమీల్ వ్యాఖ్యానించారు.
‘‘ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే భారత్‌లో టీకాల కొరత ఉంటుందని నేను అనుకోవట్లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘అయితే, ఎంత త్వరగా టీకాలను ప్రజలకు ఇవ్వగలం అనేదే అసలు సమస్య. మరోవైపు వ్యాక్సీన్ల నిల్వకు అవసరమయ్యే గాజు సీసాల అందుబాటు మరో సమస్య. వీటి కొరత ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి’’అని ఆయన చెప్పారు.
అయితే, ప్రస్తుతం తమకు ఎలాంటి కొరతా లేదని బీబీసీతో సీరం ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:
- వాట్సాప్: కొత్త ప్రైవసీ నిబంధనలతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా? అసలు ఆ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- భారత్‌లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








