అమెరికా హెచ్1బీ వీసా దొరకలేదు... భారతదేశానికి తిరిగి వచ్చి బడా వ్యాపారవేత్తగా ఎదిగారు

కునాల్ బహల్

ఫొటో సోర్స్, Snapdeal

ఫొటో క్యాప్షన్, కునాల్ బహల్

అమెరికా వెళ్లిన అందరికీ వారికి కావల్సింది లభించి ఉండకపోవచ్చు. కానీ, కొంత మంది చేసే పట్టు వదలని కృషి వారికి విజయావకాశాలు తెచ్చి పెడుతుంది.

అందుకు ఉదాహరణగా 51,000 కోట్ల రూపాయిల ( 6. 8 బిలియన్ యు ఎస్ డాలర్లు) విలువ చేసే స్నాప్ డీల్ ఆన్‌లైన్ సంస్థ వ్యవస్థాపకుడు కునాల్ బహల్‌ను చెప్పుకోవచ్చు.

ఆయన మైక్రోసాఫ్ట్ లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ లో పని చేస్తుండగా , అమెరికాలో ఉండేందుకు అవసరమైన డాక్యుమెంట్లు లభించలేదు.

ఆ వయసులో అతను కూడా ఎంతో మంది లాగే మైక్రోసాఫ్ట్ లో పని చేసి గొప్ప ప్రొఫెషనల్‌గా మారాలని కలలు కన్నారు. కానీ, ఒక్క ఇ-మెయిల్ అతని ఆలోచనలనే మార్చేసింది.

"ఆ డాక్యుమెంట్లు రావడంలో మన తెలివితేటల ప్రమేయం ఏమీ లేకపోయినా ఒక్కొక్కసారి ఎందుకో విఫలమయ్యామనే భావన కలుగుతుంది. కానీ, ఇది లాటరీ పోగొట్టుకోవడం లాంటిదే” ఆ పరిస్థితిని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టిందని కునాల్ బీబీసీ తో అన్నారు.

ఆ సమయంలో ఏమి చెయ్యాలో అర్ధం కాక నా స్కూల్ స్నేహితుడు రోహిత్ బన్సల్ కి ఫోన్ చేసాను. వాళ్లిద్దరూ స్కూల్ లో ఉన్నప్పుడు రక రకాల వ్యాపారాలు చెయ్యాలని ప్రణాళికలు చేసేవారు.

దిల్లీ తిరిగి రాగానే కునాల్ అమెరికాలో తాను చూసిన అనుభవంతో చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలకు ఉండే సమస్యలకు పరిష్కారాలు చూపాలని అనుకున్నారు. " చిన్న చిన్న వ్యాపారాలు చేసే రెస్టారెంట్లు లాంటి వ్యాపారాల కోసం మేము కూపన్లను అమ్మాలని అనుకున్నామని” కునాల్ చెప్పారు.

"ఈ కూపన్ల వ్యాపారం అమెరికాలో 30-40 సంవత్సరాల పాటు బాగా జరిగింది. అలా మొదలైన మా వ్యాపారం ఈ రోజున ఈ- కామర్స్ రంగంలో నిలదొక్కుకునే స్థాయికి చేరింది.

రోహిత్ బన్సల్, కునాల్ బహల్

ఫొటో సోర్స్, Snapdeal

ఫొటో క్యాప్షన్, రోహిత్ బన్సల్, కునాల్ బహల్

ఈ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. 2007 లో పరిస్థితులు 2020 లోలా లేవు. మా వ్యాపార ఆలోచన బాగుందనగానే పెట్టుబడి పెట్టడానికి ఎవరూ సంసిద్ధంగా ఉండేవారు కాదు. అప్పట్లో పెట్టుబడులను ఆహ్వానించడానికి స్టార్టప్స్ అనే విధానం కూడా అంత ప్రాచుర్యం పొందలేదు.

మొదటి మూడేళ్లు చాలా కష్టంగా గడిచాయి. కొన్ని సార్లు, దిల్లీ ఫర్నిచర్ మార్కెట్ పక్కన ఉండే ఫంక్షన్ హాళ్ళకి వెళ్లి కడుపు నింపుకున్న రోజులు కూడా ఉన్నాయని భల్ గుర్తు చేసుకున్నారు. మా వ్యాపార ఆలోచన విఫలమయింది.

అప్పుడే ఆన్‌లైన్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన దిల్లీ కన్నాట్ ప్లేస్ లో రెస్టారంట్ నడుపుతున్న ఒక వ్యాపారి సూచించారు.

"మీరు ఆన్లైన్ కూపన్ల వ్యాపారం ఎందుకు మొదలుపెట్టకూడదని ప్రశ్నించారు. మాకు మొదట్లో ఆయన చెబుతున్నది అర్ధం కాలేదు. ముందు ఆయన ఆలోచనను తిప్పి కొట్టాం. భారతదేశంలో ఎవరూ ఆన్‌లైన్ లో సరకులు కొనడం లాంటివి చెయ్యరని భల్ అన్నారు.

"కానీ, వ్యాపారం నిలదొక్కుకోవటానికి కొన్నేళ్లు పట్టినా ఇంటర్నెట్ దే భవిష్యత్తని గ్రహించాం. భవిష్యత్ కూపన్లది కాదని అర్ధమైంది. అప్పుడే చిన్న వ్యాపారాల కోసం కూపన్లు ఆన్లైన్ లో అమ్మే వ్యాపారం మొదలుపెట్టాం. 18 నెలల్లో మేము మార్కెట్ లీడర్లగా మారాం" అని కునాల్ చెప్పారు.

జాక్ మా

ఫొటో సోర్స్, Getty Images

స్నేహితులకిద్దరికీ ఉన్న వ్యాపార ఆశయాలకు వారు చేస్తున్న వ్యాపార ప్రణాళికలు సరిపోవని అర్ధమైంది. 2011లో స్నేహితులిద్దరూ చైనా వెళ్ళినప్పుడు అలీబాబా ఏమి చేస్తున్నారో చూసారు. మేము కూపన్లమ్ముతుంటే అలీబాబా వస్తువులను అమ్ముతున్నారని కునాల్ చెప్పారు.

"ఇంటర్నెట్ , ఆర్ధిక విధానాలు మా వ్యాపారం అభివృద్ధి చెందడానికి సహకరించాయి కానీ, కేవలం వాటి వలనే మా వ్యాపారం విస్తరించిందని చెప్పలేము. మా వ్యాపార బృందం పెట్టిన కృషి మా సిబ్బందికున్న నైపుణ్యం, తెలివితేటలు మా విజయానికి కారణాలుగా నిలిచాయి. అందరూ మా విజయాన్ని గుర్తిస్తారు. కానీ, మా బృందం సహకారం లేకుండా మేము మాత్రం ఎంత కని పని చేయగలం? “పదేళ్ల క్రితం మా బృందంలో చాలా మంది సాంప్రదాయ రంగాలకు చెందిన వారు చేరుతుండేవారు. ఇప్పుడు చాలా ఆన్లైన్ మార్కెట్లు ఉండటంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి” అంటారాయన.

ఎచ్ 1 బి తిరస్కారం అయి ఇండియా కి తిరిగి రావాలనుకునే వారికి మీరిచ్చే సలహా?

"నాకు పరిస్థితులు అనుకూలించి వ్యాపారంలో విజయవంతం అయ్యాను కాబట్టి ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, వెనక్కి తిరిగి రండి అని చెప్పడం సులువుగానే ఉంటుంది. నాకు ఒక మంచి సహ వ్యవస్థాపకుడు, నైపుణ్యం కలిగిన సిబ్బంది లభించడం కూడా నా అదృష్టమే. మేము వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మార్కెట్ పెట్టుబడులు పెరిగాయి. ఇంటర్నెట్ విస్తరించింది. మాకు కాలం అనుకూలించింది"

"అలా అని అందరూ వెనక్కి తిరిగి వస్తే ఇక్కడ కంపెనీ పెట్టవచ్చనే సలహా మాత్రం నేనివ్వలేను. పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు. ఎవరైనా భారతదేశానికి తిరిగి రావాలనుకుంటే ఇక్కడ కూడా అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పటికి నాకు 23 సంవత్సరాలు. నాకు అప్పటికి కుటుంబం, పిల్లలు లాంటి బాధ్యతలు లేవు. దాంతో నాకు వెనక్కి తిరిగి రావడం సులభం అయింది. వెనక్కి తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ బాధను నేనర్ధం చేసుకోగలను”.

బహల్ వ్యాపారం మొదలుపెట్టిన కొత్తల్లో కాలిఫోర్నియా కి చెందిన ఆష్ లిలాని అనే పారిశ్రామిక వేత్త సహాయం చేసినట్లు బీబీసీ కి చెప్పారు. "చాలా మంది బయటకి మాట్లాడరు. కునాల్ మన కళ్ళ ముందు కనిపించే ఒక ఉదాహరణ. చాలా మంది వెనక్కి తిరిగి వచ్చి పెద్ద కంపెనీలలో ఉద్యోగాలలో చేరారు. అమెరికా నుంచి ధైర్యంగా చాలా మంది వెనక్కి వస్తారనే ఉద్దేశ్యంతో నేను ఈ ట్వీట్ చేసాను. దేశానికి యువత ని రప్పించడానికి ప్రభుత్వానికి ఇదొక అవకాశమని" ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

భారతదేశంలో 2007 లో కంటే ఇప్పుడు పెట్టుబడులు, నైపుణ్యం ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లు విస్తరించాయి. కునాల్ లాంటి 100 మంది తిరిగి వస్తే అందరూ విజయవంతం కాలేకపోవచ్చు. కానీ ఎంతో కొంత ప్రయత్నం అయితే జరగక మానదు.

ప్రస్తుత పరిస్థితుల్లో,ఎచ్ 1 బి వీసా నిషేధం అంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదని, ఈ విపత్తు ముగుస్తుందని ఆశాభావంతో ఎదురు చూడటమే మనం చేయగలిగిందని గ్రాంట్ థోర్న్టన్ భాగస్వామి రాజా లహిరి అన్నారు.

కునాల్‌కున్న వ్యాపార తృష్ణ లాంటిదే అందరిలో ఉంటే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి.

"నా చిన్నప్పుడు మా అమ్మగారు అందరికీ నేనొక పెద్ద వ్యాపారినవుతానని చెప్పేవారు. నాలో వ్యాపార తృష్ణ మొదటి నుంచీ ఉంది. నేనొక పెద్ద పారిశ్రామిక వేత్తగా అభివృద్ధి చెందడానికి సహకరించిన పరిస్థితులకు, గ్రహస్తితికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి" అని కునాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)