కర్నూలు ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనావైరస్ పాజిటివ్.. జిల్లాలో పెరుగుతున్న కేసులు

ఫొటో సోర్స్, Getty Images
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందులో కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
తొలుత మర్కజ్‌కి వెళ్లి వచ్చిన వారి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందగా ఇప్పుడు లోకల్ కాంటాక్టులు కూడా నమోదవుతున్నాయి.
దాంతో కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు.
కర్నూలు ఎంపీ ఇంట్లో ఆరుగురు
కర్నూలు జిల్లాలో పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతుండడం విశేషంగా మారుతోంది. ఇప్పటికే నగరంలో ప్రముఖ వైద్యుడు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ విషాదంలో ముంచింది.
తాజాగా కర్నూలు ఎంపీ డాక్టర్ కే సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారణైంది. ఈ విషయం రెండు రోజులుగా ప్రచారంలో ఉంది. కాగా ఎంపీ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఈ ప్రచారం వాస్తవమేనని ప్రకటించారు
డాక్టర్ సంజీవ్ కుమార్ ఈ పరిణామాలపై ‘బీబీసీ’తో మాట్లాడుతూ ‘‘మా ఇంట్లో ఆరుగురుకి పాజిటివ్ వచ్చింద’’ని స్పష్టం చేశారు.
‘‘మా తండ్రి, నా ఇద్దరు సోదరులు.. ఆ ఇద్దరి భార్యలు, ఒక సోదరుడికి కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. అందరి పరిస్థితి నిలకడగా ఉంది. ఎలాంటి సమస్యలు లేవు. వారంతా కర్నూలు కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ ఆస్పత్రిలో అన్ని సదుపాయాలున్నాయి. యధావిధిగా నిబంధనల ప్రకారం ఐసోలేషన్ పూర్తి చేస్తారు. మేము కూడా జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. వైరస్ ఎలా సోకిందనేది ఇంకా నిర్ధరణ కాలేదు. అన్నింటినీ పరిశీలిస్తున్నాం’’ అని తెలిపారు.

‘వైరస్ వ్యాప్తి తగ్గించడానికి లాక్‌డౌన్ దోహదపడుతుంది’
మిగిలిన దేశాలతో పోలిస్తే మన దగ్గర కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండడానికి అనేక కారణాలున్నాయని ఆయన వివరించారు.
కరోనా పట్ల జాగ్రత్తలు పాటించడానికి, వ్యాప్తిని తగ్గించడానికే లాక్‌డౌన్ ఉపయోగపడుతుందన్నారు.
ఎక్కువ కేసులు రావడం పట్ల ఆందోళన అవసరం లేదని, ఇమ్యూనిటీ పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చని తెలిపారు.
యూరప్ దేశాలు, అమెరికా లాంటి పరిస్థితి మన దేశంలో రాదని ఒక డాక్టర్ గా స్పష్టంగా చెప్పగలనని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, kurnool.ap.gov.in
నిలకడగా ఉంది.. ఆందోళన అవసరం లేదు.
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ అన్నారు.
తాజా పరిస్థితిపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘జిల్లాలో ప్రస్తుతం 279 కేసులున్నాయి. గత 24 గంటల్లో కొత్త నాలుగు పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి.
24 మంది ఐసోలేషన్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు సార్లు నెగిటివ్ రావడంతో వారిని ఇంటికి పంపించాము.
జిల్లాలో పరిస్థితి నిలకడగా ఉంది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అవసరమైన మేరకు సిబ్బంది , సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
కేసులు కూడా త్వరలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంద’’ని చెప్పారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్‌డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్‌డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- ‘రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి’ : మతపెద్దల మార్గదర్శకాలు
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో దేశంలో రోజూ ఎన్ని వేల కోట్ల నష్టం వస్తోంది? ఎన్ని ఉద్యోగాలు పోతాయి?
- ఏపీలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో ఏం జరుగుతోంది? డిశ్ఛార్జ్ అయిన వాళ్లు ఏం చెబుతున్నారు?
- కరోనావైరస్: రాయలసీమలో ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్: ఆంధ్రప్రదేశ్‌లో పడిపోయిన పాలు, పాల ఉత్పత్తుల విక్రయం... కష్టాల్లో పాడి రైతులు
- కరోనావైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలి... లాక్‌డౌన్ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?
- కరోనావైరస్ను చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారుచేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








