కరోనావైరస్ లాక్ డౌన్: ఎండిపోతున్న డార్జిలింగ్ తేయాకు తోటలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రభాకర్ మణి తివారీ
- హోదా, బీబీసీ కోసం
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ ప్రభావం డార్జిలింగ్ తేయాకు తోటలపైనా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఈ తేయాకు తోటలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఫలితంగా మొదటి ఫ్లష్‌కు తీవ్ర నష్టం జరిగింది.
అత్యుత్తమ తేయాకు పొడి తయారీకి అవసరమయ్యే మంచి ఆకులు మొదటి ఫ్లష్‌లోనే దొరుకుతాయి. విదేశాలకూ దీన్ని ఎగుమతి చేస్తారు. ఇప్పుడు రెండో ఫ్లష్‌కు కూడా ప్రమాదం పొంచి ఉంది. లాక్‌డౌన్ ఈ రంగాన్ని పెద్ద దెబ్బ తీసింది.
తేయాకు తోటలను సాధారణం కన్నా సగం మంది కార్మికులతో నిర్వహించుకోవచ్చని కేంద్రం ఏప్రిల్ 11న అనుమతి ఇచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 15 శాతం కార్మికులతో నిర్వహంచుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
డార్జిలింగ్‌లోని తరాయీ కొండ ప్రాంతం, దాని పక్కనే ఉండే వువార్స్ మైదాన ప్రాంతంలో చిన్నవి, పెద్దవి కలుపుకొని 353 తేయాకు తోటలు ఉన్నాయి. వీటిలో 3.5 లక్షల మంది శాశ్వత, తాత్కాలిక కార్మికులు పనిచేస్తున్నారు. రూ.176 రోజు కూలీతోపాటు వారం వారం రేషన్ కూడా వారికి అందుతుంది.
కొండ ప్రాంతంలోని తేయాకు తోటలకు ఈ లాక్‌డౌన్ వల్ల ఎక్కువ నష్టం జరిగింది.

ఫ్లష్ అంటే ఆకులను తెంపడం. లాక్‌డౌన్ వల్ల మొదటి ఫ్లష్‌కు తీవ్ర నష్టం జరిగింది. అత్యుత్తమమైన, ఖరీదైన తేయాకు పొడికి అవసరమైన ఆకులు కొండ ప్రాంతంలోని తోటల్లో ఈ సీజన్‌లోనే వస్తాయి. ఇప్పుడు రెండో ఫ్లష్‌కు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. మే 3న లాక్‌డౌన్ ఎత్తేసినా, ఆకులు తయారవ్వడానికి కనీసం మరో వారం సమయం పడుతుంది.
కేంద్రం తోటల్లో 50 శాతం మంది కార్మికులు పనిచేయొచ్చని చెప్పినా కార్మికుల్లోనూ కరోనా భయం ఎక్కువగా ఉంది. తేయాకు రంగ ప్రతినిధులతో సమావేశం తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.
‘‘పచ్చి ఆకులను తెంపకపోతే, కొన్ని రోజుల్లో పనికిరాకుండా పోతాయని తోటల యజమానులు అంటున్నారు. 15 శాతం కార్మికులతో పనిచేయించుకునేందుకు అనుమతి ఇస్తున్నాం. కానీ, అన్ని రక్షణ చర్యలూ తీసుకోవాలి’’ అని ఆమె అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తున్నామని, కార్మికుల సంక్షేమం తమ తొలి ప్రాధాన్యం అని డార్జిలింగ్ టీ అసోసియేషన్ (డీటీఏ) అధ్యక్షుడు బినోద్ మోహన్ అన్నారు.
‘‘మొదటి ఫ్లష్‌లో దాదాపు వంద శాతం తేయాకు పొడి ఎగుమతి అవుతుంది. ఇలాంటి నాణ్యమైన ఉత్పత్తి కోల్పోవడం తోట వార్షిక ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని డీటీఏ మాజీ అధ్యక్షుడు అశోక్ లోహియా చెప్పారు.

డార్జిలింగ్ కొండ ప్రాంతంలోని 87 తోటల్లో ప్రతి ఏడాదీ దాదాపు 80 లక్షల కిలోల తేయాకు పొడి ఉత్పత్తి అవుతుంది. నాలుగింట ఒక వంతు మొదటి ఫ్లష్‌లోనే వస్తుంది. రెండో ఫ్లష్‌లో 15 శాతం వస్తుంది.
మొత్తం దేశంలో ఉత్పత్తయ్యే తేయాకులో డార్జిలింగ్ వాటా తక్కువే. కానీ, ఈ తేయాకుకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2011లో యూరోపియన్ యూనియన్ దీనికి జీఐ హోదా కూడా ఇచ్చింది.
లాక్‌డౌన్ వల్ల తీవ్ర నష్టం జరిగిందని, మొదటి ఫ్లష్‌లో కేవలం 200 కిలోల తేయాకు పొడి మాత్రమే తయారైందని బినోద్ మోహన్ అన్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

లాక్‌డౌన్ ముగిసేసరికి ఈ రంగం చాలా దెబ్బతింటుందని ఆయన అన్నారు. మే 3న లాక్‌డౌన్‌ను తొలగించినా, నాణ్యమైన తేయాకు పొడి తయారు చేసే పరిస్థితి లేదని చెప్పారు.
ఉత్పత్తి నిలిచిపోవడంతో చాలా తోటలకు నగదు కొరత ఏర్పడింది. కార్మికులకు కూలీలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయంలో తమకు సహకారం అందించాలని డీటీఏ ప్రభుత్వాన్ని కోరింది.
ఈ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఈ రంగానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తేయాకు తోటల యజమానుల సంఘం కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ ప్లాంటేషన్ అసోసియేషన్ (సీసీపీఏ) డిమాండ్ చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 12 లక్షల మంది కార్మికులకు రోజుకూలీ దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.
లాక్‌డౌన వల్ల తేయాకు రంగానికి కనీసం రూ.1400 కోట్ల నష్టం జరగవచ్చని చెప్పింది.
కార్మికులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వ సాయం అవసరం అంటూ కేంద్ర వాణిజ్య మంత్రికి సీసీపీఏ అధ్యక్షుడు వివేక్ గోయంకా లేఖ రాశారు.
తేయాకు రంగం మిగతా రంగాల కన్నా చాలా భిన్నమైనదని, ఖర్చులో దాదాపు 60 నుంచి 65 శాతం కూలీలపైనే వెచ్చించాల్సి వస్తుందని సీసీపీఏ తెలిపింది. పని చేయించుకోకుండా కూలీ చెల్లించాల్సి వస్తే మొత్తం ఖర్చు ఆరు శాతం పెరుగుతుందని, దీనికి తోడు అమ్మకాలు కూడా 15 శాతం పడిపోతాయని పేర్కొంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
అంతర్జాతీయ మార్కెట్‌లో భారత తేయాకుకు శ్రీలంక, కెన్యా తేయాకులతో తీవ్ర పోటీ ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రెండో ఫ్లష్‌లోనూ తేయాకు పొడి ఉత్పత్తి కాకపోతే మార్కెట్ చేజారే ప్రమాదం ఉందని డార్జిలింగ్ టీ అసోసియేషన్ హెచ్చరించింది.
గూర్ఖాల్యాండ్ డిమాండ్‌తో 2007లో చేపట్టిన 104 రోజుల బంద్ ప్రభావం నుంచే డార్జిలింగ్ కొండ ప్రాంత తేయాకు తోటలు ఇప్పటికీ కోలుకోలేకపోయాయని, ప్రస్తుత లాక్‌డౌన్‌తో ఈ రంగం వెన్ను విరిగినట్లైందని స్థానిక తేయాకు తోటల యజమానులు అంటున్నారు.
అప్పట్లో డార్జిలింగ్ తేయాకు పొడిని చాలా మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు తమ జాబితాల నుంచి తీసేశారని, మరో దెబ్బ పడటం ఈ రంగాన్ని కోలుకోలేకుండా చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ లాక్ డౌన్: భారత్‌లో స్వచ్ఛమైన గాలి కోసం ఉద్యమానికి బాటలు వేస్తుందా?
- కరోనావైరస్-రిస్ట్‌బ్యాండ్స్: చేతికి ఈ బ్యాండ్ ఉంటే మీరెక్కడికి వెళ్లినా పోలీసులు పట్టేస్తారు
- కరోనావైరస్: అమెరికా వర్సెస్ చైనా... పోటాపోటీగా కుట్ర సిద్ధాంతాలు
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో సర్కస్‌లు ఇక అంతరించిపోయినట్లేనా?
- కరోనావైరస్: నగదు నిల్వలు కరిగి పోతున్నాయని హెచ్చరించిన 'ఎయిర్ బస్'
- కరోనావైరస్ లాక్ డౌన్: ‘సామాజిక బంధాల’ విస్తరణ తొందరపాటు అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








