PMCARESకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విరాళం రూ.25 కోట్లు - ప్రెస్ రివ్యూ

అక్షయ్ కుమార్

ఫొటో సోర్స్, facebook/akshaykumarofficial

ఫొటో క్యాప్షన్, అక్షయ్ కుమార్

కరోనా నియంత్రణ చర్యల కోసం ప్రధాని సహాయ నిధికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

''ప్రజల జీవితాలను కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఎవరికి తోచిన సాయం వారు చేయాలి'' అని ఆయన ట్వీట్‌ చేయగా భార్య ట్వింకిల్‌ ఖన్నా స్పందించారు. ''అంతమొత్తమా.. ఆలోచించే ఇస్తున్నావా'' అని ఆమె ప్రశ్నించగా.. ''నన్ను ఈస్థాయికి తెచ్చినవాళ్లకే తిరిగి ఇస్తున్నా'' అని అక్షయ్‌ బదులిచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇప్పటి వరకు బాలీవుడ్ నటీనటులలో ఇంత అధికమొత్తంలో ఎవరూ సాయంగా ప్రకటించలేదు.

అక్షయ్ కుమార్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది.

టాటాగ్రూప్ విరాళం రూ.1500 కోట్లు

కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటానికి అండగా నిలిచేందుకు టాటా గ్రూప్‌ ముందుకొచ్చింది.

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్టు రూ.500 కోట్ల సహాయక ప్యాకేజీని ప్రకటించాయి.

'మానవజాతి మునుపెన్నడూ చూడని విపత్తునుచవిచూస్తోంది. ప్రభుత్వం, ఇతరత్రా భాగస్వాములతో కలిసి కరోనా సహాయక చర్యల్లో క్రియాశీలకంగా పాల్గొంటాం' అని టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ రతన్‌టాటా ఈ సందర్భంగా అన్నారు.

ప్రజలకు అత్యవసరమైన వెంటిలేటర్లను సమకూర్చడంతో పాటు వాటి తయారీపై దృష్టి సారిస్తామని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ మరో ప్రకటనలో తెలిపారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19 మృతులకు గైడ్‌లైన్స్ ప్రకారమే అంతిమ సంస్కారాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. 74 ఏళ్ల వ్యక్తి ఒకరు కోవిడ్-19 సోకి మృతి చెందారు.

కరోనా వైరస్‌ సోకి చనిపోయిన వ్యక్తి మృతదేహానికి కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు తెలిసిందని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గాంధీ మార్చురీ వైద్యుల పర్యవేక్షణలో మృతదేహానికి ప్రత్యేక రసాయనాలు పూసి కుటుంబసభ్యులకు అప్పగించారు.

మృతదేహాన్ని సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రం చేశారు.

అనంతరం పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ దుస్తులు తొడిగారు.

ప్రత్యేకంగా రూపొందించిన లీక్‌ ఫ్రూఫ్‌ సంచిలో మృతదేహాన్ని ఉంచి జిప్‌ వేశారు.

మరోసారి హైపోక్లోరైడ్‌ ద్రావణంతో సంచిని శుభ్రం చేశారు.

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యుల్లో ఒకరికి మాత్రమే అనుమతించారు.

అనంతరం ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని గాంధీ మార్చురీ నుంచి తరలించారు.

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

ఫొటో సోర్స్, facebook/hyderabadpolice

ఫేక్‌న్యూస్ సహించం - హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

కొవిడ్‌-19పై సోషల్‌మీడియాలో ఫేక్‌న్యూస్‌లు, నకిలీ వాయిస్‌ మెసేజ్‌లు, వదంతుల ప్రచారాన్ని సహించబోమని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

వాట్సాప్‌ అడ్మిన్లు.. ఏదీ నిజం.. ఏదీ అబద్ధం అని నిర్ధారించుకొని మాత్రమే ఫార్వర్డ్‌ చేయాలని అంజనీకుమార్ సూచించారు.

ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా నకిలీ ఆడియోలు, వీడియోలను సర్క్యులేట్‌చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

తన నకిలీ వాయిస్‌తోపాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నకిలీ వాయిస్‌తో ప్రచారం, శుక్రవారం మక్కామసీద్‌ వద్ద ప్రార్థనల్లో భారీగా జనాలున్నారని పాత వీడియోలతో మరో ఫేక్‌వీడియోను సోషల్‌మీడియాలో వైరల్‌చేయడంపై సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సుమోటోగా కేసులు నమోదుచేసినట్టు తెలిపారు.

జర్నలిస్ట్‌, అపోలో వైద్యుడి సంభాషణ అంటూ ప్రచారమైన ఆడియోపై అపోలో ప్రతినిధుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్టు పేర్కొన్నారు.

Sorry, your browser cannot display this map