కరోనావైరస్: సినీ కార్మికులు, సాధారణ ప్రజలకు టాలీవుడ్ హీరోలు, నిర్మాతల సహాయం

జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశం మొత్తం కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్‌లో ఉన్న పరిస్థితుల్లో రోజువారీ కూలీలు, ఇళ్లులేని వారు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో వారికి ఇబ్బంది తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వచ్చాయి.

అదే సందర్భంలో తమ వంతుగా వారికి సాయం అందించడానికి దేశంలోని వివిధ సినిమా పరిశ్రమలకు చెందిన పెద్దలు ముందుకు వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సినీ పరిశ్రమది ముఖ్య స్థానం. గతేడాదిలో 13 సినిమాలు 100 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు చేశాయి. కొందరు సినిమా పెద్దల ప్రకారం, ఆ పరిశ్రమ ఏడాదికి 150 కోట్ల అమెరికన్ డాలర్లను భారత ఆర్థిక వ్యవస్థకు అందిస్తోంది.

కానీ, లాక్‌డౌన్‌తో షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో సెట్లలో పనిచేసేవారు, ప్రొడక్షన్ ఇతర యూనిట్లలో రోజువారీగా చేసేవారికి ఇబ్బందులు మొదలయ్యాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ నేపథ్యంలో చాలా మంది దక్షిణాది తారలు ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమ వంతు విరాళాలు ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, నితిన్, ప్రభాస్ వంటి పెద్ద తారలు విరాళాలు ఇచ్చారు. తమిళ పరిశ్రమలో రజనీకాంత్, శివకుమార్, సూర్య, విజయ్ సేతుపతి వంటి నటులు తమ విరాళాలను ప్రకటించారు.

అయితే దక్షిణాది సినిమా తారలు ఆర్థిక విరాళాలతో ముందుకు రావడం ఇదే మొదటిది కాదు. భాషతో సంబంధం లేకుండా దక్షిణాది సినీ పరిశ్రమ 2015లో చెన్నై వరదలు, 2018, 2019లో కేరళ వరదల సమయంలో సహాయ నిధులను సేకరించడానికి కలిసి వచ్చింది.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో అవసరమైన వారికి మద్దతు ఇవ్వడానికి సహాయ నిధి కోసం డబ్బును సేకరించడానికి వారు స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేశారు. సిద్దార్థ్ తదితర నటులు చాలా మంది చెన్నై వరదల సమయంలో అవసరమైన వారికి ఆహార పదార్థాలను అందించడానికి రోడ్లపైకి సైతం వెళ్లారు.

రామ్‌చరణ్ ప్రకటన

దక్షిణాది తారలను అభిమానులు దేవుళ్లలా చూసుకుంటారు. వారు తమ నటులు చేసే పనులను నిశితంగా గమనిస్తారు. అభిమాన నటులు తమ నిజ జీవితాల్లో ఎలా ఉంటున్నారనేది గమనిస్తూ వారిని అనుకరించే ప్రయత్నం చేస్తారు.

తెలుగు పరిశ్రమలో చిరంజీవి సినిమా కార్మికుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆయన కొడుకు రామ్ చరణ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి 70 లక్షల రూపాయలు అందించారు.

చిరంజీవి తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నిధికి కోటి రూపాయలు, ఆంధ్ర-తెలంగాణల ముఖ్యమంత్రుల నిధులకు రూ. 50 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
కేసీఆర్, నితిన్

వీరి కంటే ముందే తెలుగు నటుడు నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి, కోవిడ్-19 పరికరాల కోసం 10 లక్షల రూపాయల చెక్‌ను అందించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రూ. 10 లక్షలు ఇచ్చారు.

ఇక తమిళ పరిశ్రమ నుంచి రజనీకాంత్, సూర్య, శివ కార్తికేయన్, ప్రకాశ్ రాజ్, విజయ్ సేతుపతులు పెద్ద మొత్తంలో విరాళాలు రోజూవారీ కూలీలకు అందించారు.

తమిళ పరిశ్రమపై ఆధారపడి ఉన్న 15,000 మందికి మార్చి 31 వరకూ భోజనం పెట్టడానికి సుమారు రూ. 2 కోట్లు ఖర్చవుతుందని దక్షిణ భారత సినిమా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి అంచనా వేశారు.

ఈ సంస్థకు రజనీకాంత్ రూ. 50 లక్షలు, శివకుమార్, సూర్య, విజయసేతుపతి పదేసి లక్షల రూపాయల చొప్పున అందించారు.

ఫర్హాన్ అక్తర్ ట్వీట్

ఇక హిందీ పరిశ్రమ నుంచి నటులు ఫర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్, హృతిక్ రోషన్ తదితరులు.. సినిమాల్లో పనిచేసే రోజువారీ కార్మికులకు సహాయం చేసినట్టు ప్రకటించారు. అయితే వారెంత ఇచ్చారన్నది తెలియదు. సినిమా పరిశ్రమలోని వారు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని భారత నిర్మాతల సంస్థ (ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇండియా) విజ్ఞప్తి చేసింది.

కానీ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆలియా భట్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి కొన్ని పెద్ద పేర్లు ఇంకా ఈ విరాళాలు ఇచ్చిన వారి జాబితాలో లేవు.

ఈ లాక్‌డౌన్‌తో రణవీర్‌సింగ్ నటిస్తున్న 83, రోహిత్ శెట్టి నటిస్తున్న సూర్యవంశీ, దిబాకర్ బెనర్జీ నటిస్తున్న సందీప్ ఔర్ పింకీ ఫరార్ వంటి చాలా పెద్ద బడ్జెట్ సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి.

మార్చిలో విడుదలైన టైగర్ ష్రాఫ్ బాఘి 3 బాక్సాఫీస్ వద్ద రూ 53.83 కోట్లు వసూలు చేసింది. సినీ విమర్శకుడు, వ్యాపార విశ్లేషకుడు తరణ్ ఆదర్ష్ ప్రకారం 2019 ఏప్రిల్‌లో విడుదలైన అక్షయ్ కుమార్ - కేసరి మొదటి వారంలో రూ. 105.86 కోట్లు వసూలు చేసింది. 2020 జనవరిలో విడుదలైన అజయ్ దేవగన్ సినిమా తన్హాజీ రూ. 200 కోట్లు దాటింది. హిందీ చిత్ర పరిశ్రమ బాలీవుడ్‌లోని చాలా మంది నటులు సామాజిక దూరం గురించి అవగాహన కోసం వీడియోలు తయారు చేశారు. ఇంట్లో ఉండాలని తమ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలిసిన వారు.. ''ఇది సరిపోతుందా?'' అని ప్రశ్నిస్తున్నారు.

''నటీనటులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ఇంట్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు సరే.. కానీ సోషల్ మీడియాలో ఎంతో మంది రోజు కూలీలు తిండి లేక కష్ట పడుతున్నారు. దేశం మొత్తం ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి చిన్న సహాయం అవసరం'' అని హైదరాబాద్‌లోని ఒక సీనియర్ ఫిల్మ్ రిపోర్టర్ చెప్పారు.

''లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నవారికి సాయం చేయడానికి ఒక సంక్షేమ నిధి ఏర్పాటుచేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. దీనికి మీరంతా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాం'' అని మార్చి 17న ప్రకటన విడుదల చేశారు భారత నిర్మాతల సంఘం అధ్యక్షుడు సిద్ధార్థ రాయ్.

ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక ఉద్యోగ సంఘాలవారు, వ్యాపారస్తులూ పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)