కరోనావైరస్ గ్రామాలకు పాకితే భారత్ పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోని చాలా ప్రాంతాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మార్చి 28 ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 748 కరోనాకేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.
2020 మార్చి 3 వరకూ భారత్ వ్యాప్తంగా ఐదు కరోనాకేసులు మాత్రమే నమోదయ్యాయి. మరుసటి రోజే ఆ సంఖ్య 27కు చేరింది. ఆ తర్వాత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకవేళ కరోనావైరస్ కేసులు దేశంలోని గ్రామీణ ప్రాంతాలకూ పాకితే, పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టం.
ఆరోగ్య వసతుల లేమి
కేసుల సంఖ్య పెరుగుతూ పోతే, గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పడకలు చాలవని నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019 నివేదిక సూచిస్తోంది.
దేశవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని, వీటిలో 21 వేలు గ్రామీణ ప్రాంతాల్లో, ఐదు వేలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది.
దీని ప్రకారం రోగులు, ఆసుపత్రి పడకల నిష్పత్తి ఆందోళనకర స్థాయిలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1700 మంది రోగులకు కేవలం ఒక్క పడక మాత్రమే అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 3,100 మందికి ఒక పడక చొప్పున అందుబాటులో ఉన్నాయి.
ఒక్కో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆసుపత్రి పడకలు, జనాభా నిష్పత్తిని చూస్తే, బిహార్ అట్టడుగు స్థానంలో ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు పది కోట్ల మంది నివసిస్తున్నారు. అక్కడ ప్రతి 16 వేల మందికి ఒకటి చొప్పున ఆసుపత్రి పడకలు ఉన్నాయి.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

తమిళనాడు ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో 40,179 ఆసుపత్రి పడకలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 690 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ లెక్కన అక్కడ 800 మంది ఒకటి చొప్పున ఆసుపత్రి పడకలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వైద్యుల కొరత
గ్రామీణ ఆరోగ్య గణాంకాల ప్రకారం భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 26 వేల మందికి ఒకరు చొప్పున అల్లోపతి వైద్యులు ఉన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి వెయ్యి మందికి ఒకరు చొప్పున అల్లోపతి వైద్యులు ఉండాలని సూచిస్తోంది.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వివిధ రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిళ్ల రికార్డుల ప్రకారం దేశంలో 1.1 కోట్ల మంది అల్లోపతి వైద్యులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తగినంత వైద్యులు, వైద్య వసతులు లేవని ఈ సమాచారం తేటతెల్లం చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పరీక్ష కేంద్రాలు చాలా తక్కువ
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదం పొందిన ప్రభుత్వ ప్రయోగశాలలు దేశంలో 116 ఉన్నాయి. వీటిలో 89 ప్రయోగశాలలను కోవిడ్19 పరీక్ష కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. మరో 27 ప్రయోగశాలలను కూడా వినియోగంలో తెచ్చే ప్రక్రియ సాగుతోంది.
కరోనావైరస్ కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్రలో ఎనిమిది ఆమోదిత పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ముంబయిలో, మూడు పుణెలో, ఒకటి నాగ్‌పుర్‌లో ఉన్నాయి.
ఐసీఎంఆర్ మరో నాలుగు ప్రేవేటు పరీక్ష కేంద్రాలకు కూడా ఆమోదం మంజూరు చేసింది. ఆ నాలుగూ ముంబయిలోనే ఉన్నాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- కరోనా వైరస్ విజృంభిస్తున్నా... రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకంత నిశ్చింతగా ఉన్నారు?
- బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్
- హంటావైరస్: భయపెడుతున్న మరో వైరస్... దీని లక్షణాలేంటి?
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ఉత్తరాంధ్రలో కుదేలైన చిరు కార్మికుల జీవితాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








