Fact Check: పుల్వామా దాడి తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పాకిస్తాన్‌ను సమర్థించారా, నిజమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
భారత్‌లో తీవ్రవాదం ప్రాబల్యం గురించి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
దానిని "#BoycottAkshayKumar" అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేస్తున్నారు.
అక్షయ్ కుమార్‌ను దేశ వ్యతిరేకి అని, ఆయనను సమాజం నుంచి బహిష్కరించాలంటూ చాలా ట్విటర్ హ్యాండిల్స్‌లో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలో అక్షయ్ కుమార్ "భారతదేశంలో కూడా తీవ్రవాదం ఉంది" అని చెబుతుంటారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ న్యూస్ ఛానల్ 'దునియా న్యూస్' కూడా ఇలాంటి ఒక కథనాన్నే ప్రసారం చేసింది.
"అక్షయ్ కుమార్ టెర్రరిస్టు దేశాల్లో పాకిస్తాన్ పేరు ఉండడాన్ని ఖండించారని, బదులుగా టెర్రరిజం ప్రపంచమంతా ఉందని అన్నట్లు" తెలిపింది.
మా పరిశోధనలో ఈ వీడియోకు అసలు పుల్వామా దాడితో ఎలాంటి సంబంధం లేదని తేలింది.
వీడియో అసలు నిజం
ఈ వీడియో 2015లో 'బేబీ' సినిమా ప్రమోషన్ ఈవెంట్‌కు సంబంధించినది. ఆ సమయంలో అక్షయ్ ఆ సినిమాలో తీవ్రవాదానికి ఉన్న సంబంధం గురించి మాట్లాడారు.
అసలు వీడియోలో అక్షయ్ కుమార్ "తీవ్రవాదం ఏ దేశంలోనూ లేదు. దాని మూలాలు మాత్రమే ఉన్నాయి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, పారిస్, పెషావర్ అంతా తీవ్రవాదం ఉంది. కొంతమంది టెర్రరిజంను వ్యాప్తి చేస్తున్నారు. దానిని ఏ దేశం సమర్థించదు" అన్నారు.
పుల్వామా దాడి విషయానికి వస్తే, అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు "భారత్ కే వీర్" రిలీఫ్ ఫండ్ కోసం విరాళాలు అందించాలని అక్షయ్ కుమార్ ప్రజలను కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తన మాటలను తప్పుదారి పట్టిస్తూ వస్తున్న ట్వీట్స్ గురించి అక్షయ్ కుమార్ స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: ఈ అద్భుత చిత్రం కుంభమేళా ప్రాంతానిదేనా?
- Fact Check: 2014 తర్వాత భారత్‌లో భారీ తీవ్రవాద దాడులు జరగలేదా
- FACT CHECK: ఆస్ట్రేలియా బీరు సీసాలపై హిందూ దేవుళ్ళ బొమ్మలు
- పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందంట!!
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








