కరోనావైరస్: కమల్‌ హాసన్ ఇంటికి ఐసొలేషన్ స్టిక్కర్.. తప్పుగా అతికించామని తొలగించిన అధికారులు

కమల్ హాసన్ ఇంటికి కరోనా నోటీసు
    • రచయిత, ప్రమీలా కృష్ణన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చెన్నై నగరంలోని ఆళ్వారుపేటలో ఉన్న ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్ ఇంటికి చెన్నై కార్పొరేషన్ అధికారులు కరోనావైరస్ రోగుల ఇళ్లకు అంటించే 'ఐసొలేషన్' (గృహ నిర్బంధం) స్టిక్కర్ అంటించారు. అయితే, పొరపాటున దీనిని అతికించామని తెలుసుకున్న అధికారులు కొన్ని గంటల వ్యవధిలోనే దానిని తొలగించారు.

నగర వ్యాప్తంగా 24 వేల గృహాలకు ఈ స్టిక్కర్లు అతికిస్తున్నామని, ఈ క్రమంలో జరిగిన పొరపాటు ఇదని చెన్నై నగరపాలక సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పేరు బయటపెట్టకూడదన్న షరతు మీద బీబీసీ తమిళ్‌కు చెప్పారు.

కాగా, ఈ వ్యవహారంపై కమల్ హాసన్ కూడా స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆళ్వారుపేటలోని తన ఇంట్లో గత కొన్నేళ్లుగా తాను నివశించట్లేదని, పార్టీ సమావేశాలు నిర్వహించేందుకుగాను పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నామని ట్విటర్‌లో పేర్కొన్నారు.

''నేను గృహ నిర్బంధానికి గురయ్యానన్న వార్తల్లో నిజం లేదు. ముందు జాగ్రత్తగా ప్రజలంతా ఇతరులకు దూరంగా (సోషల్ డిస్టెన్సింగ్) ఉండాలని నేను కోరాను, అదేవిధంగా నా అంతట నేనుగా ఇతరులకు దూరం పాటిస్తున్నాను'' అని కమల్ హాసన్ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

ఈ ఇంటిని కరోనా రోగులకు చికిత్స అందించేందుకు తాత్కాలిక ఆసుపత్రిగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన ఈ మధ్య ప్రకటించారు.

అలాగే, కరోనా సోకిన కోవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు తమ పార్టీలోని వైద్యులు కూడా సహకరిస్తారని తెలిపారు.

కమల్ హాసన్ ప్రకటన
ఫొటో క్యాప్షన్, కమల్ హాసన్ విడుదల చేసిన ప్రకటన

ఇదిగా ఉండగా, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ రెండు వారాల కిందట ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ముంబైలోని తన నివాసంలో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. కమల్ చిన్న కుమార్తె అక్షర చెన్నైలోనే మరొక ఇంట్లో నివశిస్తున్నారు. కమల్ హాసన్ వేరొక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు.

Sorry, your browser cannot display this map