క్యాథలిక్: చర్చిలో మతాధికారి హోదా కోసం మహిళల పోరాటం... ససేమిరా అంటున్న వాటికన్ వర్గాలు

ఫొటో సోర్స్, ANNE TROPEANO
ఆన్ ట్రోపియానో మరుసటి రోజు వేసుకోవడానికి తన బట్టలను ఇస్త్రీ చేస్తూ కనిపించారు. ఆమె తన తెల్లని ఆల్బ్, ఎంబ్రాయిడరీ దుస్తులు క్యాథలిక్ మతాధికారులు (ప్రీస్ట్) వేసుకునే వస్త్రాలు ధరించారు.
గోడపై ఉన్న కేలండర్ మీద ఎర్రటి పెన్నుతో రేపు "ఆర్డినేషన్ డే" అని గుర్తు పెట్టారు.
అయితే, ఆమె నివసిస్తున్న న్యూ మెక్సికోలో.. తనతో ఎవరికైనా శత్రుత్వం ఉండవచ్చని ఊహించారు.
అందుకే అక్కడి అల్బుకెర్కీలో ఒక చర్చికి సెక్యూరిటీ గార్డు నియమించుకోవడానికి ఆమె ఫోన్‌లో మాట్లాతున్నారు.
"ఇది ఒక ఉద్విగ్న సమస్య. స్త్రీలను మతాధికారిగా పిలిచే అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు" అని ట్రోపియానో వ్యాఖ్యానించారు.
క్యాథలిక్ మతాధికారి కావాలని ఉందనే ఆశను వ్యక్తం చేసినప్పటి నుంచి ఆమె మీద ఆన్‌లైన్‌లో వేధింపులు మొదలయ్యాయి. వేధింపులతో ఊపిరిసలపలేదని ట్రోపియానో అన్నారు.

ఎవరీ ట్రోపియానో..?
రోమన్ క్యాథలిక్ మహిళా మతాధికారి హోదా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న 250 మంది మహిళలలో ట్రోపియానో ఒకరు.
వీరంతా రోమన్ క్యాథలిక్ చర్చ్ నిబంధనలకు వ్యతిరేకంగా మతాధికారులుగా మారడానికి అనధికారిక ఆర్డినేషన్ సర్వీసులలో పాల్గొంటున్నారు.
క్యాథలిక్ చర్చి స్త్రీలను మతాధికారిగా (ప్రీస్ట్) అనుమతించదు. అయితే, దీన్ని కానన్ చట్టం ప్రకారం బహిష్కరణ శిక్ష విధించేటంత తీవ్రమైన నేరంగా వాటికన్ చూస్తోంది.
మహిళలు ఒకవేళ ఆర్డినేషన్‌లో పాల్గొంటే మత పరమైన కర్మలను స్వీకరించలేరు. వారితో సంబంధాలు ఉండవు. చర్చి అంత్యక్రియల్లో పాల్గొనలేరు.
''బహిష్కరణ కారణంగానే నేను చాలారోజులు మతాధికారిగా మారలేకపోయాను.'' అని ఆమె చెప్పారు.
ప్రతీ రోజు సమూహం దగ్గరికి వెళుతున్నాను. పారిస్‌లో పనిచేశాను. నా జీవితమంతా చర్చిలోనే గడిచిపోయింది.
అందుకే దాన్ని వదులుకోవడాన్ని నేను ఊహించలేకపోయా" అని ఆమె అంటున్నారు.
ట్రోపియానో ఒక క్యాథలిక్ భక్తురాలు. ఆమె రాక్ బ్యాండ్ నిర్వహణతో సహా పలు ఉద్యోగాలు చేశారు. అనంతరం మతాధికారిగా మారుతానని చెప్పారు.
"నేను ఇది వింటాను. నువ్వు నా మతాధికారివి, నువ్వు ఒక మతాధికారివి. నువ్వు మతాధికారి అవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆమె గుర్తుచేసుకుంటున్నారు.
అయితే, చర్చిలో ఆమెకు ఆప్షన్లలో ఉన్నవి నన్ లేదా సాధారణ సహకారిగా ఉండటం మాత్రమే. లేదా ఆమె పూర్తిగా క్యాథలిక్ మతం నుంచి దూరంగా వెళ్లి, మతాధికారిగా ఆమెను స్వాగతించే మరో క్రైస్తవ వర్గానికి చేరడం.

ఫొటో సోర్స్, ANNE TROPEANO
క్రీస్తు దూతల్లో మహిళలు లేరా?
ఈ వాటికన్ నిబంధనలు తనను సరిగా జీవించనివ్వడం లేదని చాలా ఏళ్ల తర్వాత గ్రహించారు ట్రోపియానో.
''ఇది తదుపరి దశ అని నేను గుర్తించిన తర్వాత, బహిష్కరణ కేవలం ప్రయాణంలో భాగం మాత్రమే'' అని ఆమె స్పష్టం చేశారు.
సెక్సిస్ట్ పాలనలా భావిస్తున్న అలాంటి చర్చిల నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇది మార్గంగా ట్రోపియానా, ఆమెలాంటి ఇతర మహిళలు అనుకుంటున్నారు.
జుడాయిజం నుంచి అనేక తెగలు ఆందోళనల అనంతరం మహిళల నియమావళిని స్వీకరిస్తున్నాయి. ఇప్పటికీ క్యాథలిక్ చర్చి మతాధికారి గుర్తింపుపై నిషేధం ఉంది.
బైబిల్ ప్రకారం క్రీస్తు తన దూతలుగా 12 మంది పురుషులనే ఎన్నుకున్నారని, అప్పటి నుంచి చర్చిలు కూడా అదే పాటిస్తున్నాయి.
ట్రోపియానో ఉద్ధేశంలో ఈ నిబంధన ప్రభావం చాలా విస్తృతం. ''మతాధికారి బాధ్యతల నుంచి మహిళలను దూరం చేయడాన్ని చర్చిలు నేర్పిస్తే, అది మహిళల స్థాయిని తక్కువగా చూడాలంటూ బోధిస్తుంది.
స్త్రీలు దీన్ని నేర్చుకుంటారు, చిన్న పిల్లలు ఇది నేర్చుకుంటారు, పురుషులు దీన్నే నేర్చుకుంటారు. కాబట్టి వారు ప్రపంచంలోకి వెళ్లి ఆ విధంగానే జీవిస్తారు." అని స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, OLGA LUCÍA ÁLVAREZ
ఉద్యమం ఎలా మొదలైంది?
2002లో మహిళా మతాధికారి ఉద్యమం బయటికొచ్చింది.
ఏడుగురితో కూడిన మహిళల బృందం డాన్యూబ్ నదిలోని ఒక ఓడలో జరిగిన అనధికార ఆర్డినేషన్ సర్వీస్‌లో పాల్గొంది.
ఆయా ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణకు చోటు లేకుండా అంతర్జాతీయ జలాలపై దీన్ని నిర్వహించారు.
అంతకుముందు జరిగిన రహస్య ఆర్డినేషన్లు కూడా ఉన్నాయి. అందులో లుడ్మిలా జావరోవా చరిత్ర కూడా ఒకటి.
1970లలో చెకోస్లోవేకియా కమ్యూనిస్ట్ పాలనలో రోమన్ క్యాథలిక్ బిషప్ నేతృత్వంలోని జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
మహిళల ఆర్డినేషన్ ఉద్యమంలో ఎక్కువగా యూరోపియన్, అమెరికా గ్రూపులే ఉన్నాయి. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాపిస్తోంది.
కొలంబియాకు చెందిన ఓల్గా లూసియా అల్వారెజ్ బెంజుమియా లాటిన్ అమెరికాలోని చర్చికి మొదటి మహిళా మతాధికారి.
ఇది 1.3 బిలియన్ల ప్రపంచ క్యాథలిక్ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది ఉన్న క్యాథలిక్ చర్చి. సిస్టర్ నాథాలీ బెక్వార్ట్ వాటికన్ సిటీ కార్యాలయం నుంచి పనిచేస్తున్నారు. వెనకాల ఆమెది, పోప్ ఫ్రాన్సిస్ ఫొటోలు ఉంటాయి.
2010లో ఆమె కార్యక్రమం రహస్యంగా జరిగింది. అయితే, చర్చికి సంబంధించిన వ్యక్తుల మద్దతు ఉందని ఆమె చెప్పారు.
"అక్కడ రోమన్ క్యాథలిక్ అయిన బిషప్ ఉన్నారు. వాటికన్ నుంచి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆయన పేరు చెప్పడం లేదు.
నేను నివసిస్తున్న ఈ సంప్రదాయిక సమాజంలో ప్రజలు అకస్మాత్తుగా నన్ను అవమానించడమో, నా మీదకి వస్తువులను విసిరేయడమో చేస్తారని భయపడ్డాను.
అయితే, ప్రజల నుంచి లభించిన మద్దతు చాలా ఆశ్చర్యం కలిగించింది. అది నా సంకల్పానికి ఊతమిచ్చింది. బలోపేతం చేసింది" అని అల్వారెజ్ చెప్పారు.
ఆమె ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ ఉమెన్ ప్రీస్ట్స్ (ఏఆర్సీడబ్ల్యూపీ)లో బిషప్‌గా పదోన్నతి పొందారు. అయితే దీన్ని వాటికన్ గుర్తించలేదు.
అల్వారెజ్ అధిక దైవభక్తి గల క్యాథలిక్ కుటుంబం నుంచి వచ్చినా ఆమె తల్లి, మాజీ నన్ నుంచి మద్దతు పొందారు.
ఆమె సోదరుడు ఒక మతాధికారి. అల్వారెజ్‌కు చాలీస్‌ను బహుమతిగా ఇచ్చి మరో రూపంలో మద్దతు ఇచ్చారు.

చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనా...
అయితే, మతాధికారుల నుంచి స్త్రీలను మినహాయించాలని గ్రంథంలో ఏం లేదని అల్వారెజ్ చెబుతున్నారు.
"ఇది మనుషుల చట్టం, చర్చి చట్టం, అన్యాయమైన ఈ చట్టానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు."
ఇది ఉమెన్స్ ఆర్డినేషన్ కాన్ఫరెన్స్ ద్వారా పంచుకున్న విషయం. మహిళా మతాధికారుల కోసం వాటికన్‌లో పని చేసే గ్రూప్ ఈ ఉమెన్స్ ఆర్డినేషన్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూఓసీ).
ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేట్ మెక్‌ఎల్వీ మాట్లాడుతూ.. ఆమెకు ఇష్టమైన పనిని వాళ్లంతా (చికాకు పెట్టేదిగా) మినిస్ట్రీ ఆఫ్ ఇరిటేషన్ అని పిలుస్తారు.
కాన్‌క్లేవ్ సమయంలో గులాబీ పొగ (పింక్ స్మోక్)ను విడుదల చేయడం నుంచి పోప్ మోటర్‌కేడ్ నగరం గుండా వస్తున్నప్పుడు రోడ్డుపై పడుకోవడం వరకు మద్దతుదారులు చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు.
ఆ సమయంలో వాటికన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు కూడా.
"మేం ఈ మహిళలతో కలిసి నడుస్తాం. వాటికన్.. దాని తలుపులు తెరిచేందుకు, సెక్సిజం పాపాలను నిజంగా ఎదుర్కోవటానికి వాళ్లు ఎదురుచూస్తున్నారు" అని మెక్‌ఎల్వీ చెప్పారు.
"కానీ అదే సమయంలో ఇతర మహిళలు ఎదురుచూడటం అసాధ్యం. దేవుని నుంచి పిలుపు ఉంది. అన్యాయమైన ఈ చట్టాన్ని ఉల్లంఘించడం తప్ప వారికి వేరే మార్గం లేదు."

ఫొటో సోర్స్, WOMEN'S ORDINATION CONFERENCE
పోప్ ఫ్రాన్సిస్ ఏమన్నారు?
చర్చి వీటన్నింటిని చట్టవిరుద్ధంగా మాత్రమే కాకుండా చెల్లనివిగా కూడా చూస్తోంది.
డాన్యూబ్ సెవెన్ ఘటన బయటపడంతో పోప్ కార్డినల్ జోసెఫ్ రాట్జింగర్ వారికి శిక్ష విధించారు.
ఆ మహిళలు పశ్చాతాపం ప్రకటించనందుకు, ''వారు చేసిన అత్యంత తీవ్రమైన నేరానికి బహిష్కరణకు గురయ్యారు'' అని ప్రకటించారు.
ఒక మహిళా మతాధికారిగా పని చేయడాన్ని పోప్ ఫ్రాన్సిస్ తోసిపుచ్చారు. 2016లో ఇలాగే అడిగినప్పుడు ఆయన 1994 నాటి జాన్ పాల్ II పత్రాన్ని ప్రస్తావించారు. దానిలో మహిళల ఆర్డినేషన్‌కు "తలుపు మూసివేయబడింది" అని చెప్పారు. దానిపై నిలబడి ఉన్నాం అన్నారు.
సిస్టర్ నథాలీ బెక్వార్ట్ వాటికన్ సిటీలోని ఒక కార్యాలయంలో పని చేస్తున్నారు. వెనక ఆమె ఫొటోతో పాటు పోప్ ఫ్రాన్సిస్ ఫోటో కూడా ఉంటుంది.
ఫిబ్రవరి 2021లో పోప్‌కు సలహా ఇచ్చే సంస్థ అయిన బిషప్‌ల సైనాడ్‌కు అండర్ సెక్రటరీగా నియమితులైన మొదటి మహిళ ఆమె.
ఆమెను మహిళా మతాధికారుల స్థితిపై ప్రశ్నించగా.. "క్యాథలిక్ చర్చి నుంచి అధికారికంగా చూస్తే.. ఇది బహిరంగ ప్రశ్న అయితే ఏం కాదు. మీరు మిమ్మల్ని మతాధికారులుగా అనుకోవడం కాదు.. చర్చ్ కూడా మిమ్మల్ని మతాధికారులుగా గుర్తించాలి. మీ వ్యక్తిగత భావాలు లేదా నిర్ణయాలు సరిపోవు" అని ఈ ఫ్రెంచ్ నన్ చెప్పారు.
పోప్ ఫ్రాన్సిస్ దగ్గర కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తుల్లో సిస్టర్ బెక్వార్ట్ ఒకరు. ఈ స్థానం ఆమెను వాటికన్‌లో ఓటు హక్కు కలిగిన మొదటి మహిళగా నిలిపింది.
చాలామంది మహిళలు నాయకత్వం చేపట్టే విధంగా ఉండేలా ఏదో బృహత్తరమైనది జరగబోతోందని ఆమె నమ్ముతున్నారు. ఆ స్థానాలు ఆర్డినేషన్‌కు దూరంగా ఉన్నవేనని ఆమె భావన.
"చర్చి విషయంలో మన దృష్టిని విస్తృతం చేసుకోవాలని భావిస్తున్నా. చర్చికి సేవ చేయడానికి మహిళలకు అనేక మార్గాలు ఉన్నాయి " అని సిస్టర్ బెక్వార్ట్ చెప్పారు.

క్యాథలిక్ చర్చి ఏం చెబుతోంది?
క్యాథలిక్ సిద్ధాంతం లేదా దాని చట్టం ప్రకారం మతాధికారి హోదా పురుషుల ప్రత్యేక హక్కు అని అంటోంది.
దాని ప్రకారం "బాప్టిజం పొందిన పురుషుడు మాత్రమే పవిత్రమైన ఈ అవకాశం పొందుతారు" (కానన్ 1024).
సవరించిన చర్చి చట్టం 2021 (కానన్ 1379) ప్రకారం మహిళలకు పవిత్రమైన ఆదేశాలను అందిచడాన్ని నేరంగా పరిగణించింది. దీని ప్రకారం తీర్పు లేకున్నా జరిమానా విధిస్తారు.
పోప్ ఫ్రాన్సిస్ గతంలో మహిళలను డీకన్‌లుగా నియమించే అవకాశాన్ని కల్పించారు. అయితే మహిళలు సామూహిక వేడుకలు జరపలేరు. కానీ అంత్యక్రియలు, బాప్టిజం, వివాహాలను నిర్వహించగలరు.
చర్చి భవిష్యత్తుపై అభిప్రాయాలను తెలపాల్సిందిగా సాధారణ కాథలిక్‌లను పోప్ ఫ్రాన్సిస్ కోరారు. సైనోడాలిటీలో సైనాడ్ అనే రెండేళ్ల సంప్రదింపు ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.
ఈ చర్యల ఫలితంగా మహిళల ఆర్డినేషన్ కాన్ఫరెన్స్ నుంచి సైనాడ్ వెబ్‌సైట్‌లో వాటికన్ కొన్నింటిని చేర్చింది.
వచ్చే అక్టోబర్‌లో రోమ్‌లో బిషప్‌లు సంప్రదింపుల ఫలితాలను చర్చించడానికి సమావేశమవనున్నారు. చర్చిలో మహిళల పాత్ర గురించే ఈ ఎజెండాలో ఎక్కువగా ఉండబోతుందని ఇటీవలి నివేదిక ద్వారా తెలుస్తోంది.
సిస్టర్ నథాలీ బెక్వార్ట్ బీబీసీ 100 మహిళలతో మాట్లాడుతూ, "సైనోడాలిటీలో సైనాడ్ ద్వారా మేం చూస్తాం. తర్వాత ఏం చేయాలనేది పోప్ చూసుకుంటారు'' అన్నారు.

ఫొటో సోర్స్, FRANCESCO PISTILLI
14 ఏళ్ల అనంతరం ట్రోపియానోకు దక్కిన గౌరవం
ఆన్ ట్రోపియానో నావ్‌కి చేరుకుని బిషప్ ఎదురుగా నిల్చున్నారు. "నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను" అని ఉద్వేగభరితంగా చెప్పారు.
ఆమె 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు ఇది. ఈ 'అర్డినేషన్' వేడుక పురుషులు క్యాథలిక్ మతాధికారులుగా మారడంలో జరిగే పవిత్ర ప్రార్ధనలనే అనుసరిస్తుంది.
బిషప్ బ్రిడ్జేట్ మేరీ మీహన్.. ట్రోపియానో చేతులను పైకెత్తి చప్పట్లు కొడుతున్న సభకు ఆహ్వానించారు. ఇదంతా ఆలింగనం చేసుకున్నట్లు అనిపించిందని ట్రోపియానో భావోద్వేగంగా చెప్పారు.
"ఎవరూ భావాలు వ్యక్త పరచకుండా (కమ్యూనియన్) దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు విడాకులు తీసుకున్నారా.. లేదా? వంటివి ముఖ్యం కాదు. అందరికీ స్వాగతం. ఎల్జీబీటీ క్యూ వ్యక్తులకు కూడా స్వాగతం" అని ఆమె పిలుపునిచ్చారు.
మహిళల మతాధికారి హోదా క్యాథలిక్‌లో సాధారణ వ్యక్తులు, ప్రతినిధులతో సంబంధాలను పునర్నిర్మించే ఓ అవకాశంగా ఓల్గా లూసియా అల్వారెజ్ చూస్తారు.
చర్చి ప్రస్తుత స్థితిలో ఈ అవకాశం ఉందని కొలంబియా మహిళ 'బిషప్' అంటున్నారు. క్యాథలిక్‌లో వృత్తుల సంఖ్య తగ్గిపోవడం, లైంగిక వేధింపుల కారణంగా మతాధికారులపై నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
"భూమిపై వాళ్లే దేవుని ఏకైక ప్రతినిధులమని ఎలా చెబుతారు? వారికి సిగ్గు లేదు" ప్రపంచవ్యాప్తంగా వేధింపుల ఆరోపణల పరంపరపై ఆమె స్పందించారు.

ఫొటో సోర్స్, Getty Images
పోప్ ఫ్రాన్సిస్ క్షమాపణలు
అయితే, మత గురువులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలపై బాధితులకు పోప్ ఫ్రాన్సిస్ క్షమాపణలు చెప్పారు. నేరాలను దాచిపెట్టడం, సహకరించడాన్ని ఆయన ఖండించారు.
మహిళా మంత్రిత్వ శాఖ దీనికి ఒక సమాధానం చూపుతారని అల్వారెజ్ భావిస్తున్నారు. మతాధికారులు కావాలని ఆశించే యువతులకు 80 ఏళ్ల వయస్సులో కూడా మార్గదర్శనం చేస్తున్నారామె.
"మతాధికారుల అసలు ముఖాన్ని చూపించడం అత్యవసరం, చరిత్ర పునరావృతం కాకూడదు" అని ఆమె అన్నారు.
మహిళలపై విధించిన ఈ నిషేధంపై బహిరంగ చర్చను కోరుతూ ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే వారికి సాధారణ క్యాథలిక్‌ల మద్దతు ఉంటుందనే నమ్మకం ఉంది.
లాటిన్ అమెరికాలో అత్యధిక క్యాథలిక్ జనాభా ఉన్న బ్రెజిల్‌లో దాదాపు పది మందిలో 8 మంది మహిళా మతాధికారులకు మద్దతు తెలిపారు.
అమెరికాలో 2014 సర్వే ప్రకారం ఈ సంఖ్య 10లో ఆరుగా ఉంది. క్యాథలిక్ జనాభా ఎక్కువగా వృద్ధి చెందుతున్న ఆఫ్రికాలో మాత్రం మహిళల ఆర్డినేషన్‌కు సంబంధించిన ఉద్యమం ఇంకా ప్రారంభం కాలేదు.
పరిస్థితి మారడానికి ఏదైనా అవకాశం ఉంటే పోప్ మాట్లాడాల్సిందిగా ట్రోపియానో విజ్ఞప్తి చేశారు. "మతాధికారులుగా ఉన్నారంటే మీ దగ్గర మహిళా బలం ఉండాలి. ఈ ఉద్యమంలో వారు భాగమైనా.. కాకున్నా కూడా. మీరు మా అనుభవాలను వినాలి, ప్రార్థన చేయాలి" అన్నారు.
అయితే, మహిళా మతాధికారి హోదా కోసం చేసే పోరాటం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిందిగా కనిపిస్తున్నప్పటికీ, ఇది చర్చి భవిష్యత్తుకు చాలా ముఖ్యమని ట్రోపియానో భావిస్తున్నారు.
"సమాన భాగస్వామ్యం ఉంటే తప్ప చర్చి తన లక్ష్యాన్ని నెరవేర్చలేదు. ప్రస్తుతానికి అంతకన్నా ముఖ్యమైంది ఏం లేదు" అన్నారు ట్రోపియానో.
ఇవి కూడా చదవండి
- కరోనా: బీఎఫ్7.. ఈ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ ఎంత డేంజరస్
- కరోనా వైరస్: ఆపిల్స్, మిరియాలు, జున్ను, మాంసం, ఆలివ్, బ్రెడ్... వీటి మీద వైరస్ ఎంత కాలం ఉంటుందో తెలుసా?
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలో నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- మీ పిల్లల్లోని ‘అసాధారణ ప్రతిభ’ను ఎలా గుర్తించాలి
- హిందు వర్సెస్ ముస్లిం: సీతారామం, ద కశ్మీర్ ఫైల్స్ సినిమాలు ఏం చాటాయి?














