ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...

ఫొటో సోర్స్, Reuters
బ్రిటన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ 'క్యూఎస్' 2023కు సంబంధించి 'బెస్ట్ స్టూడెంట్ సిటీస్' జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను అందించే నగరాల జాబితాలో లండన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. క్యూఎస్ సర్వే ప్రకారం లాటిన్ అమెరికాలో బ్యూనోస్ ఎయిర్స్ (అర్జెంటీనా) మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ జాబితాలో దానికి 23వ స్థానం దక్కింది.
ఈ అధ్యయనం మొత్తంగా 140 నగరాల జాబితాను రూపొందించింది. టాప్-100 జాబితాలో భారతీయ నగరాలేవీ లేవు. కానీ, ముంబయి 103, బెంగళూరు 114, చెన్నై 125, దిల్లీ 129 స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ నగరానికి ఇందులో చోటు దక్కలేదు. భారత్ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబయిలో ఐఐటీ బాంబే, ముంబయి యూనివర్సిటీ అంతర్జాతీయంగా పేరు పొందాయి.
ఇక ఐటీ కంపెనీలకు హబ్‌గా ఉన్న బెంగళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, థాపర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వంటి మంచి విద్యాసంస్థలు ఉన్నట్లు క్యూఎస్ చెబుతోంది. ఈ నగరంలో పుట్టిన ఎన్నో స్టార్టప్స్ ఆ తరువాత యూనికార్న్స్ అంటే పెద్ద ఐటీ కంపెనీలుగా మారాయి. ఇక్కడ ఇంజినీరింగ్, టెక్నాలజీతోపాటు ఆర్ట్స్ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Facebook/IIT Bombay
ముంబయిలోని బెస్ట్ యూనివర్సిటీలు
- ఐఐటీ బాంబే
- ముంబయి యూనివర్సిటీ
చెన్నైలోని బెస్ట్ యూనివర్సిటీలు
- ఐఐటీ మద్రాస్
- మద్రాస్ యూనివర్సిటీ
- అన్నా యూనివర్సిటీ
- సత్యభామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
- ఎస్ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ఫొటో సోర్స్, Facebook/IIT Delhi
దిల్లీలోని బెస్ట్ యూనివర్సిటీలు
- ఐఐటీ దిల్లీ
- దిల్లీ యూనివర్సిటీ
- జేఎన్‌యూ
- జామియా మిలియా ఇస్లామియా
ఒక నగరంలో జనాభా ఎంత? ఎంత మంది విద్యార్థులున్నారు? వారిలో విదేశీ విద్యార్థులు ఎందరు? భిన్నత్వం ఏమేరకు ఉంది? నగరంలోని జీవన వ్యయం, విద్యార్థులకు భద్రత, ఉద్యోగ అవకాశాలను వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇస్తారు.
ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుని 140 స్టూడెంట్ ఫ్రెండ్లీ నగరాల జాబితాను తయారు చేసినట్లు క్యూఎస్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
చదువుకోవడానికి ఉత్తమమైన టాప్-10 నగరాలు
- లండన్ (బ్రిటన్): ఇంపీరియల్ కాలేజీ లండన్, యూనివర్సిటీ కాలేజీ లండన్, కింగ్స్ కాలేజీ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
- మూనిచ్ (జర్మనీ): టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మూనిచ్, లుడ్విగ్ మాక్సిమిలియన్స్ యూనివర్సిటీ
- సియోల్ (దక్షిణకొరియా): సియోల్ నేషనల్ యూనివర్సిటీ, కొరియా యూనివర్సిటీ, యాన్సీ యూనివర్సిటీ, హాన్యాంగ్ యూనివర్సిటీ
- జూరిచ్ (స్విట్జర్లాండ్): ఈటీహెచ్ జూరిచ్ (స్విస్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్
- మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా): యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, మొనాశ్ యూనివర్సిటీ, రాయల్ మెల్‌బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- బెర్లిన్ (జర్మనీ): ఫ్రీయి యూనివర్సిటీ, హంబొల్డ్ యూనివర్సిటీ
- టోక్యో (జపాన్): యూనివర్సిటీ టోక్యో, టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యొకొహామా సిటీ యూనివర్సిటీ
- పారిస్ (ఫ్రాన్స్): పీఎస్‌ఎల్ యూనివర్సిటీ, సార్బాన్ యూనివర్సిటీ, పారిస్-స్కేలే యూనివర్సిటీ
- సిడ్నీ (ఆస్ట్రేలియా): యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ-సిడ్నీ
- ఎడిన్‌బరో (బ్రిటన్): యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరో, హెరాయిట్-వాట్ యూనివర్సిటీ, ఎడిన్‌బరో నేపియర్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images
సాంస్కృతికంగా సంపన్నమైన లండన్, 'క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్' జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచస్థాయి యూనివర్సిటీలు, కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువే. లండన్‌లో డైవర్సిటీ కూడా ఎక్కువే... అంటే భిన్న వర్గాలు, జాతుల వారు ఇక్కడ నివసిస్తుంటారు. లండన్ అగ్రస్థానంలో నిలవడం ఇది నాలుగో సారి.
మూనిచ్, సియోల్, జూరిచ్, మెల్‌బోర్న్, బెర్లిన్, టోక్యో, పారిస్, సిడ్నీ, ఎడిన్‌బరో నగరాలు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా నుంచి 5 నగరాలు
ఆసియా నుంచి 5 నగరాలు టాప్-20లో చోటు దక్కించుకున్నాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌తోపాటు టోక్యో, హాంకాంగ్, సింగపూర్, క్యోటో ఒసాకా కొబే (జపాన్) జాబితాలో ఉన్నాయి.
'సియోల్ ప్రత్యేకమైన నగరం. ఇక్కడ ఎన్నో మంచి యూనివర్సిటీలున్నాయి. అంతేకాదు ఉపాధి అవకాశాలకు కూడా కొరత లేదు.' అని క్యూఎస్ తెలిపింది.
క్యూఎస్ ర్యాంకు ఇవ్వాలంటే ఒక నగరంలో కనీసం 2 లక్షల 50 వేల మంది జనాభా ఉండాలి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న కనీసం రెండు యూనివర్సిటీలైనా ఆ నగరంలో ఉండాలి.
అలాగే పాత విద్యార్థుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ సమీపంలో గోల్కొండ నవాబుల గ్రామం 'షేర్ మహమ్మద్ పురం'... బొబ్బిలి సంస్థానానికీ ఈ ఊరికీ ఏమిటి సంబంధం?
- కర్ణాటక: హిందూ ఆలయంలో అరటి పండ్ల ముస్లిం వ్యాపారిపై ఏమిటీ వివాదం, అసలేం జరుగుతోంది?
- వాహనాలపై ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ చేసి డబ్బులు దొంగిలిస్తున్నారా
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? ‘సూపర్ మామ్’గా ఉండటం కరెక్టేనా?
- రెండుసార్లు సీఎం.. ఇప్పుడు డిప్యూటీ సీఎం.. దేవేంద్ర ఫడణవీస్ స్థాయిని బీజేపీ అధిష్ఠానం తగ్గించిందా?
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












