ఆలివ్ ఆయిల్: చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసే ఈ నూనె ధర ఎందుకు పెరుగుతోంది... దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, మిచెల్ టీచీ
- హోదా, బీబీసీ ట్రావెల్
తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ఆలివ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వంట మాస్టర్లు చిట్కాలవైపు, ఆలివ్ ఆయిల్ తయారీదార్లు ప్రత్యామ్నాయాలవైపు దృష్టిసారించారు.
స్పానిష్ వంటలలో ఎంతో ప్రసిద్ధి పొందిన టమోటా సూప్ గాజ్‌పాచో పైనా, లేదంటే మిడిల్ ఈస్ట్ దేశాలలో నోరూరించే డాల్మేడ్స్‌లోనో ఆలివ్ ఆయిల్ కనిపించడం ఓ అద్భుత దృశ్యంగా మారింది. వీటన్నింటికీ మించి సూపర్ మార్కెట్లలో ఆలివ్ ఆయిల్ ధరలు ఆకాన్నంటుతున్నాయి.
ఆలివ్ ఆయిల్ ధరలు పెరగడానికి కారణమేమిటి?
గడిచిన దశాబ్దకాలంలో ఈ భూమిపై అతిపురాతనమైన ఆలివ్‌చెట్ల సాగు కుంటుపడింది. వరుసగా ముంచెత్తుతున్న వరదలు, వడగాడ్పులు, కరువు తదితర తీవ్ర వాతావరణ మార్పుల వలన మధ్యధరా ప్రాంత ఆలివ్ తోటలు ఎండిపోయాయి.
2023లో మిగతా ప్రపంచం ఎదుర్కొన్నట్టే ఈ ప్రాంతం నిప్పులు కక్కిన వేసవిని ఎదుర్కొంది.
ఆలివ్ ఆయిల్ ఉత్పత్తితో సింహభాగాన్ని ఆక్రమించే ఇటలీ, గ్రీసు, స్పెయిన్ వాతావరణ మార్పులకు బలయ్యాయి. దీంతో వంటమాస్టర్లు, వినియోగదారులు తమ వంటింట్లో ఎంతో అవసరమైన ఈ ఆలివ్ ఆయిల్‌కు బదులుగా ఏం వాడదామా అనే ప్రయత్నాల్లో పడిపోయారు.
‘‘నా జీవితం మొత్తంలో ఇంత కరువును ఎప్పుడూ చూడలేదు’’ అని ఆలివ్ ఆయిల్ ఉత్పత్తిదారుడు రోసెల్లా బోయిరీ చెప్పారు. ఈయన ఇటలీలోని బడాలుక్కోలో ‘ఆలివ్ ఆయిల్ ఉత్పత్తి చేసే ‘ఆలియోరోయ్’ కంపెనీకి ఐదోతరం ప్రతినిధి.
‘‘అదృష్టం కొద్దీ ఆలివ్ ఆయిల్ చెట్లు బలంగా ఉన్నాయి. కానీ ఆలివ్ ఆయిల్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఇది అంతిమంగా ధరల పెరుగుదలకు దారితీసింది. దీనివల్ల ఈ ఆయిల్ వినియోగమూ తగ్గింది. దీంతో డిమాండ్ పడిపోయింది’’ అని చెప్పారు.
‘‘గడిచిన 20 సంవత్సరాలతో పోల్చుకుంటే కిందటేడాది 15శాతం ఉత్పత్తి తగ్గింది. దీనిని మేం సాధారణంగానే భావిస్తాం. ఎందుకంటే ప్రతి ఏడాది ఆలివ్ చెట్లు ఒకేరకమైన దిగుబడిని ఇవ్వం. కానీ ఈ ఏడాది 45 శాతం మాత్రమే సాగుబడి రావడం ఆందోళన కలిగిస్తోంది’’ అని స్పెయిన్‌లోని ఆల్మెరియా ప్రాంతానికి చెందిన ఆలివ్ ఆయిల్ చెట్లను సాగుచేస్తున్న ఓ రైతుకుటుంబంలోని ఏడోతరం ప్రతినిధి ఆల్నాసో బర్రౌ చెప్పారు.
తక్కవ దిగుబడి రావడానికి రకరకాల కారణాలు ఉన్నా, ముఖ్యంగా వాతావరణ మార్పే అసలైన ప్రతినాయక పాత్ర పోషించి సంక్షోభం సృష్టిస్తోందని బర్రౌ చెప్పారు. ‘‘ వేసవి కాలాలు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి. వడగాడ్పులు ఎక్కువవడం వలన ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోంది. ఇదే ఆందోళన కలిగిస్తోంది’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏడాదిలో 115 శాతం పెరిగిన ధరలు
ఆలివ్ ఆయిల్ ఉత్పత్తిదారులు తమ మనుగడం కోసం కుస్తీపడుతుంటే, యురోపియన్ వినియోగదారులకు కూడా ఆ నొప్పి తెలుస్తోంది. బౌర్రె వర్ణించినట్టు పెద్ద కంపెనీలు ‘కమ్మక్కు’ అవడంతో ఆయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇది కేవలం బడుగువర్గాలనే కాదు, చిన్న వ్యాపారులను, సూపర్‌మార్కెట్ నిర్వాహకులను కూడా బెంబేలెత్తిస్తోంది. చాలా ఆలివ్ ఆయిల్ దుకాణాలలో చోరీలు కూడా ఎక్కువయ్యాయి.
ముడి సరుకుల డిమాండ్‌ను అంచనావేసి, సమాచారాన్ని విశ్లేషించే ‘మింటెక్ ’ సంస్థ ప్రకారం స్పానిష్ ఆలివ్ ఆయిల్ ధరలు సెప్టెంబరు 2022 నుంచి 2023 మధ్యన 115శాతం పెరిగాయి.
ప్రపంచమంతటా ఆలివ్ ఆయిల్ ధరల ప్రభావం కనిపిస్తున్నా యూరోప్ సమాజానికి ఈ దెబ్బ గట్టిగా తగిలింది.
ప్రత్యేకించి చాలామంది యురోపియన్లకు ఆలివ్ అయిల్ అనేది కేవలం ఓ వంట దినుసుమాత్రమే కాదు, అదోక పూడల్చేని సాంస్కృతిక చిన్హం.
‘‘ఒక చెఫ్ గా అది నాపనిలో భాగం. నేనేం చేస్తానో వాటన్నింటికీ అదే ఆధారం. మనిషి శరీరానికి రక్తం ఎంత ముఖ్యమో నాకు అదే అంత ముఖ్యం’’ అని చెప్పారు ఇటలీలోని బడాలుక్కోలో ఉమామి రెస్టారెంట్ లో హెడ్ చెఫ్‌గా పనిచేస్తున్న మాటియో డి ఎలియా.
‘‘ఆలివ్ ఆయిల్‌లోని భిన్నత్వం కేవలం దాని రుచిమాత్రమే కాదు,అది కలిగించే వైన్ లాంటి అనుభూతి కూడా. అది నిజంగా అద్భుతమైనది’’ అంటారాయన.
గ్రీకు ఆహార హృదయాన్ని, ఆత్మను మీరు ఒకే సీసాలో కనుగొంటారు అంటారు స్విజ్జర్లాండ్‌లోని దావోస్‌లో గల లా మునా రెస్టారెంట్ చెఫ్ డియోమోయిస్ ఏంజెలోస్.
‘‘ పాకశాల వారసత్వానికి బంగారు తీగలతో అత్యంత జాగ్రత్తగా అల్లిన వస్త్రమే ఆలివ్ ఆయిల్’’ అంటారు ఏంజెలోస్.
‘‘నాకు మా అమ్మమ్మ చేసే ఓ వంటకం గుర్తుకొస్తోంది. వోలోస్ (గ్రీసు)కు దగ్గరలోని మా పల్లెలో ఫాసోలాకియా లాడెరా (బీన్స్ తో తయారుచేసే వంటకం ) ను వండటానికి మా పురాతన తోట నుంచి తెచ్చిన ఆలివ్ ఆయిల్ ను వినియోగించేది. ఓ కుండలో ఈ ఆయిల్‌ను కాస్త వేడి చేసేది. ఈ వేడి నూనె సువాసన వంట ప్రారంభమవుతోందనే సందేశాన్ని ఇచ్చేది. దీనికి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసేది. అవి మెత్తగా ఉడికాకా, గ్రీన్ బీన్స్, ఆలుగడ్డలు, టమోటా ముక్కలు వేసే కలగలిపేది’’ అని గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆలివ్ ఆయిల్‌కు ప్రత్యామ్నాయం లేదా?
తన వంటకాలలో ఆలివ్ ఆయిల్‌కు ప్రత్యామ్నాయం లేదని గట్టిగా నమ్ముతారు పాపీ కోర్కుటాకీ. ఈమె మినోస్ బీచ్ ఆర్ట్ హోటల్లోని బాచూస్ రెస్టారెంట్‌లో ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా పనిచేస్తున్నారు. కానీ గ్రీకు సంస్కృతి, సంప్రదాయా వంటకాలపై దృష్టిసారిస్తున్నాను,
ఆలివ్ ఆయిల్ దొరకనప్పుడు దానికి బదులుగా మధ్యధార వంటకాలు సరైన ఎంపిక అవుతుంది అని చెప్పారు.
‘‘ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడకుండా రుచికరమైన ఆహారం తయారుచేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవసరం. తక్కువ మంటపై వంటలు చేయడానికి క్రెటన్ సిరామిక్ పాత్రలు చాలా ముఖ్యం అంటారు కోర్కుటాకీ.
‘‘క్రీట్ ద్వీపంలో మా పూర్వీకులు సిరామిక్ పాత్రలు శతబ్దాల తరబడి వాడారు. నేను పనిచేసే రెస్టారెంట్ పరిసర ప్రాంతాల గ్రామాలలోనూ వీటిని వాడుతున్నారు. ఇవి వేడిని బాగా తట్టుకోవడంతోపాటు ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడకుండానే చక్కటి రుచి వచ్చేలా చేస్తాయి’’ అని చెప్పారు.
తక్కువ మంటపై నెమ్మదిగా వంట చేయగలిగితే ఆలివ్ ఆయిల్ వాడాల్సిన పనే లేదంటారు ఆమె. ‘‘ కొవ్వుకు బదులుగా ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగిస్తాం. అందుకే దీనికి బదులుగా మాంసం లేదా చేపల కొవ్వును ఉపయోగించవచ్చు. ఇది ఫ్రిజ్‌లు లేని రోజులలో మన బామ్మలు, తాతయ్యలు వాడిన పురాతన సాంకేతిక ప్రక్రియ ’’ అని చెప్పారు.
నిజానికిది ఆలివ్ ఆయిల్ పోషకాలుండే ఒమెగా రిచ్ ఎక్స్‌ట్రా కు ప్రత్యామ్నాయం కాకపోయినా, ఆలివ్ ఆయిల్ దొరకనప్పుడే ఇదే మంచి పరిష్కారం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సృజనాత్మకతతో ప్రత్యామ్నాయం
వంటగదిలో సృజనాత్మకంగా ఉండటం ఆలివ్ ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని ఎన్నో అవార్డులు గెలుచుకున్న బేకర్ నికోలా అలీవైరీ అంగీకరించారు. ఆలివ్ ఆయిల్ వినియోగించుకుండా ఆయన ఎన్నో బేకరీ పదార్థాలు తయారుచేశారు. ‘‘ ఆలివ్ ఆయిల్ ను నేనెంతో ఇష్టపడతాను.నా వంటకాలలో ఒకదాంట్లోనైనా నేను అలీవ్ ఆయిల్ వాడతాను. కానీ ఇంకా ఎన్నో ఇటాలియన్ వంటకాలు ఉన్నాయి. ఇవి మధ్యధార ప్రాంత వంటలకు సమానమైనవే’’ అని చెప్పారు.
నాణ్యమైన ఆలివ్ ఆయిల్ అనేది సంస్కృతిలో ఓ భాగం. దాని కోసం ఎంతకైనా పోరాడొచ్చు. ‘‘కరువు, తీవ్రమైన ఉష్ణోగ్రతల నడుమ ఆలివ్ సాగు చేస్తున్నాం. మేం ఐదోతరపు ఆలివ్ ఆయిల్ ఉత్పత్తిదారులం. మేం వాతావరణ మార్పులతో పోరాడుతూనే 1877 ప్రాంతంలో తయారుచేసినట్టు ఉత్తమమైన నాణ్యతతో కూడిన ఆలివ్ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తున్నాం’’ అని బోయెరి అనే ఉత్పత్తి దారుడు చెప్పారు.
భారత్‌లో ఆలివ్ ఆయిల్ వాడకం ఎలా ఉంది?
ఆలివ్ ఆయిల్ ఉత్పత్తి పడిపోవడం, ధరల పెరుగుదల ప్రభావం భారత్ పైనా పడింది. ఈ నూనెల ధరలు భారత్‌లో 22శాతం మేర పెరిగాయని హిందూస్థాన్ టైమ్స్ కథనమొకటి పేర్కొంది. ఇండియా ఏటా 12వేల మెట్రిక్ టన్నుల ఆలివ్ ఆయిల్‌ను వినియోగిస్తుందని ఇండియన్ ఆలివ్ అసోసియేషన్‌ను ఉటంకిస్తూ పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
- 2024: కొత్త సంవత్సరం వేడుకలు అందరి కన్నా ముందు ఏ ప్రాంతంలో జరుపుకొన్నారు?
- తొలిప్రేమ ఎందుకంత మధురం?
- నటరాజ స్వామి ఆలయం: వాన నీటిని చోళులు ఎగువకు ఎలా ప్రవహింపజేశారు? చిదంబర రహస్యం ఇదేనా?
- అయోధ్య రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి తెచ్చిన భారీ శిలలు ఏమయ్యాయి... వాటితో విగ్రహాలు చేయలేదా?
- క్రికెట్: ధోనీతో యువ ఆటగాడైన రాబిన్ మింజ్‌ను ఎందుకు పోల్చుతున్నారు? ఐపీఎల్లో తొలి గిరిజన ఆటగాడు ఈయనేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














