తెలంగాణ: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌లో ఏ పోస్టులు ఎన్ని?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022 ఏప్రిల్ 26న ఇచ్చిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కొద్ది సేపట్లోనే కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ.
రద్దయిన నోటిఫికేషన్లో ఉన్న 503 పోస్టులకు మరో 60 ఖాళీలను కలుపుకొని మొత్తంగా 563 పోస్టులకు సోమవారం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని టీఎస్‌పీఎస్‌సీ తన ప్రకటనలో తెలిపింది.
దరఖాస్తులను ఎడిట్ చేసుకునే ఆప్షన్‌ను మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఇస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం కొత్తగా విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రిలిమినరీ పరీక్ష మే/జూన్ 2024లో, మెయిన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్/అక్టోబర్ 2024లో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.
పరీక్ష నిర్వహించే తేదీకి 7 రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభం కావడానికి 4 గంటల ముందు వరకు హాల్‌టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రూప్-1 నోటిఫికేషన్‌లోని ఖాళీల వివరాలు:
పోస్టు పేరు - ఖాళీల సంఖ్య
- డిప్యూటీ కలెక్టర్(సివిల్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్): 45
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ-II(పోలీస్ సర్వీస్): 115
- కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్): 48
- రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్(ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్): 04
- జిల్లా పంచాయత్ ఆఫీసర్(పంచాయత్ సర్వీసెస్): 07
- జిల్లా రిజిస్ట్రార్(రిజిస్ట్రేషన్ సర్వీసెస్): 06
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్)(జైళ్ల సర్వీస్): 05
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్(లేబర్ సర్వీస్): 08
- అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఎక్సైజ్ సర్వీస్): 30
- మున్సిపల్ కమిషనర్ – గ్రేడ్-II(మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్): 41
- జిల్లా సోషల్ వెల్‌ఫేర్ ఆఫీసర్/జిల్లా షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(సోషల్ వెల్‌ఫేర్ సర్వీస్): 03
- జిల్లా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్‌ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్‌ను కలుపుకుని(జిల్లా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)(బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్‌ఫేర్ సర్వీస్): 05
- జిల్లా ట్రైబల్ వెల్‌ఫేర్ ఆఫీసర్(ట్రైబల్ వెల్‌ఫేర్ సర్వీస్): 02
- జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్(ఎంప్లాయిమెంట్ సర్వీస్): 05
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్ II(మెడికల్, హెల్త్ సర్వీసెస్): 20
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ట్రైనింగ్ కాలేజీ అండ్ స్కూల్‌లో అసిస్టెంట్ లెక్చరర్(ట్రెజరీస్, అకౌంట్ సర్వీస్): 38
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(స్టేట్ ఆడిట్ సర్వీస్): 41
- మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్): 140

ఫొటో సోర్స్, TSPSC

ఫొటో సోర్స్, TSPSC
అర్హత వయసు ఎంత?
కొత్తగా విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లో కనీస అర్హత వయసు కొన్ని పోస్టులకు 18 సంవత్సరాలు కాగా, మరికొన్నింటికి 21 సంవత్సరాలుగా ఉంది.
గరిష్ఠ వయసు కొన్ని పోస్టులకు 35 ఏళ్లుగా, మరికొన్నింటికి 46 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ వివరాలను టీఎస్‌పీఎస్‌సీ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని, కులాల వారీగా వివిధ పోస్టులకు ఉన్న ఖాళీలను, పరీక్షా విధానం, సిలబస్ వివరాలను కూడా అందులో పొందుపరిచింది.

ఫొటో సోర్స్, TSPSC
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022 ఏప్రిల్ 26న ఇచ్చిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కొద్ది సేపట్లోనే ఈ కొత్త నోటిఫికేషన్ వచ్చింది.
అంతకు కొద్ది సేపటి ముందే గతంలో 503 పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
503 పోస్టులకు గ్రూప్-1 పరీక్షను గతంలో రెండుసార్లు నిర్వహించినప్పటికీ,మొదటిసారి పేపర్‌లీక్ కావడంతో, రెండోసారి బయోమెట్రిక్ తీసుకోనందున ఈ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
దీనిపై టీఎస్‌పీఎస్‌సీ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే ఇటీవల ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరాక టీఎస్‌పీఎస్‌సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది.
ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ ఉపసంహరించుకుంది.

ఫొటో సోర్స్, BHANU PRAKASH BJYM/FACEBOOK
తెలంగాణలో నిరుద్యోగిత రేటు ఇలా
తెలంగాణలో అన్ని రకాల పోటీ పరీక్షలకు కలిపి దాదాపు 30 లక్షల మంది యువత పోటీ పడుతున్నారని అంచనా.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ నియామకాలు పెద్దగా జరగకపోవడంతో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది.
తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పలు గణంకాలు సూచిస్తున్నాయి.
భారత రిజర్వు బ్యాంకు 2022 నివేదిక ప్రకారం, తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 77 మంది నిరుద్యోగులు ఉన్నారు. అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చే సరికి ఇది 33గా ఉంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022 ప్రకారం, తెలంగాణలో 2019-20 నుంచి 2020-21 మధ్య నిరుద్యోగిత రేటు 15 నుంచి 59 వయసు ఏళ్ల వారిలో 7.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది.
అయితే, 2022 జులై నుంచి సెప్టెంబరు త్రైమాసానికి నిరుద్యోగిత రేటు 7.7 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామిక్ చరిత్రలో అత్యంత తెలివైన అందాల మహరాణి జైనబ్... ఆమెను 'జాదూగర్' అని ఎందుకు అనేవారు?
- ఎలక్టోరల్ బాండ్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఎలా దెబ్బ పడనుంది?
- విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు కదలట్లేదు... తప్పు రాష్ట్రానిదా, కేంద్రానిదా?
- ఆంధ్రప్రదేశ్: 'ట్రాన్స్‌జెండర్ మహిళగా సర్జరీ చేయించుకున్నా... ఇప్పుడు జీవితం ఎలా ఉందంటే... ' - మదనపల్లె భాను
- ఎజియావో: మనుషుల యవ్వనం కోసం గాడిదలను చంపేస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














