అమృత్ భారత్: మోదీ ప్రారంభించిన ఈ కొత్త రైలు ప్రత్యేకతలు ఏమిటి

వీడియో క్యాప్షన్, అయోధ్యలో ప్రధాని మోదీ ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఏమిటి?

అయోధ్యలో కొత్తగా నిర్మించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

మరోవైపు ఇక్కడి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అయోధ్యధామ్‌ను కూడా మోదీ ప్రారంభించారు.

రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందే భారత్ రైళ్ల ప్రారంభానికి ఆయన జెండా ఊపారు. జనవరి 22న అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మూడు వారాల ముందు ప్రధానమంత్రి అయోధ్యలో కొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

amrit bharat

ఫొటో సోర్స్, ani

రెండు వైపులా ఇంజిన్, క్షణాల్లో స్పీడ్ అందుకుంటాయి

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ పుష్‌-పుల్ రైలు.

దీనికి ముందూవెనుక ఇంజిన్లు ఉంటాయి. తక్కువ సమయంలోనే వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

దీనిలో 22 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్ కోచ్‌లు కాగా, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డ్ కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి.

ఈ రెండు కోచ్‌లలోనే కొంత భాగాన్ని మహిళలు, దివ్యాంగులకు కేటాయిస్తారు.

ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

Amrit Bharat

ఫొటో సోర్స్, ANI

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)