‘కళాక్షేత్ర’లో లైంగిక వేధింపుల ఆరోపణలు, బాధిత విద్యార్ధినుల ఫిర్యాదులో ఏముంది?

- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ తమిళ్
చెన్నైలోని కళాక్షేత్ర కాలేజీలో విద్యార్థులు టీచర్లకు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేశారు.
ఈ సమస్యపై కాలేజీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
చెన్నైలో సాంస్కృతిక గుర్తింపు ఉన్న సంస్థల్లో కళాక్షేత్ర ఫౌండేషన్ ఒకటి.
భరతనాట్యం, కథాకళి, సంగీతం, వాయిద్యాల్లో నాలుగేళ్ల డిప్లొమా కోర్సులను ఇది ఆఫర్ చేస్తోంది.
1993లో కళాక్షేత్రానికి ఇన్‌స్టిట్యూషన్‌గా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇందులోని కొందరు అధ్యాపకులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కొన్ని రోజుల కిందట కొన్ని సోషల్ మీడియా గ్రూప్‌లలో వీరిపై ఈ ఆరోపణలు వచ్చాయి. అయితే, మొదట్లో ఎవరూ ముందుకొచ్చి ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేకపోయారు.
అనితా రత్నం అనే నృత్యకారిణి ఈ లైంగిక వేధింపులపై తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు.
కళాక్షేత్రలో పనిచేసే నలుగురు అధ్యాపకులు అమ్మాయిలను లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
విద్యార్థుల దీనిపై ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇప్పటి వరకు కళాక్షేత్ర అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఎలాంటి చర్యలను తీసుకోలేదు.
దీనిపై చర్యలు తీసుకోవాలని మార్చి 21న తమిళనాడు పోలీసు శాఖాధిపతిని జాతీయ మహిళా కమిషన్ కోరింది. కళాక్షేత్రానికి నోటీసులు కూడా పంపింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ కళాక్షేత్రం ఈ వ్యవహారంపై ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ విషయంపై తాము సరైన చర్యలు తీసుకుంటామని, దీనిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని పేర్కొంది.
‘‘గత కొన్ని నెలలుగా, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా కళాక్షేత్ర ఫౌండేషన్‌పై విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఫ్యాకల్టీలో కొంతమందిని టార్గెట్ చేశారు. ఈ ఇన్‌స్టిట్యూషన్ క్రెడిబులిటీని దెబ్బతీయాలని చూస్తున్నారు. సోషల్ మీడియా ఆరోపణలపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ సుమోటోగా విచారణ చేపట్టింది.
రెండున్నర నెలల పాటు చేపట్టిన విచారణలో, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అసత్యమైనవిగా నిర్ధారణైంది’’ అని కళాక్షేత్ర విడుదల చేసిన పత్రికా ప్రకటన తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇన్‌స్టిట్యూషన్ ఇంటర్నల్ కమిటీ దీనిపై విచారణ చేపట్టిన తర్వాత బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేసేందుకు నిరాకరించిందని, దీంతో ఈ విషయాన్ని అంతటితో ముగించాలని నిర్ణయించినట్లు కమిషన్ తెలిపింది.
జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మా గురువారం కళాక్షేత్రానికి వచ్చి, విచారణ చేపట్టారు.
రేఖా శర్మతో మాట్లాడేందుకు తమను అనుమతించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. అందరి సమక్షంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారం తర్వాత గురువారంనాడు విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు.
కళాక్షేత్ర అడ్మినిస్ట్రేషన్ తొలుత క్యాంపస్ లోపలికి మీడియాను అనుమతించలేదు. ఆ తర్వాత అనుమతి ఇవ్వడంతో, విద్యార్థులు తాము చేసిన ఫిర్యాదుల గురించి వెల్లడించారు. కొందరు అధ్యాపకుల ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు.
నిరసనలు జరుగుతుండటంతో, మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు కాలేజీని మూసివేస్తున్నట్లు కళాక్షేత్ర చెప్పింది.
రెండు రోజుల పాటు హాస్టలర్స్ తమ గదులను ఖాళీ చేయాలని పేర్కొంది. అలాగే ఆ సమయంలో జరగాల్సిన పరీక్షల తేదీలను కూడా అడ్మినిస్ట్రేషన్ వాయిదా వేసింది.
కాలేజీ చేసిన ఈ ప్రకటనలతో నిరసనకారులు తమ ఆందోళనలను తీవ్రతరం చేశారు. రాత్రిపూట కూడా తమ నిరసనలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఆఫీసర్, తహశీల్దార్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌లు కాలేజీకి వచ్చి, విచారణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నిరసనలు జరుగుతున్న ప్రదేశానికి కళాక్షేత్ర డైరెక్టర్ రేవతి రామచంద్రన్ వచ్చారు.
‘‘విద్యార్థుల భద్రత మాకు చాలా ముఖ్యం. వీరి ఫిర్యాదులపై మేం విచారణ చేపడతాం. ప్రతి ఒక్కరితో దీని గురించి చర్చిస్తాం.’’ అని రేవతి రామచంద్రన్ చెప్పారు.
రెండున్నర నెలల పాటు విచారణ జరిపినప్పటికీ ఎలాంటి చర్యలను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించినప్పుడు, ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, KALAKSHETRA FOUNDATION
ఈ విషయంపై తమిళనాడు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు ఎస్ఎస్ బాలాజి, వేల్ మురుగన్, సెల్వ పెరుంతగై ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
‘‘ఇప్పటి వరకు పోలీసు డిపార్ట్‌మెంట్‌కు దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నిరసనల కారణంతో కాలేజీని మూసివేశారు. విద్యార్థులను హాస్టల్‌ను ఖాళీ చేయాలని ఆదేశించారు.
విద్యార్థుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మహిళా ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో కొందరు పోలీసు అధికారులు విద్యార్థులకు రక్షణ కల్పిస్తున్నారు.
విచారణను నిర్వహిస్తాం, ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే, అవసరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు.
తామింకా కళాక్షేత్రంలో జరుగుతోన్న ఈ సమస్యపై ఎలాంటి ఫిర్యాదును అందుకోలేదని, ఒకవేళ అందించే అవసరమైన చర్యలు తీసుకుంటామని అదనపు పోలీసు కమిషన్ ప్రేమ్ ఆనంద్ సిన్హా కూడా తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దన్నారు.
తమిళనాడు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఏఎస్ కుమారి కళాక్షేత్రానికి వచ్చి, విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
దీనిపై ఆమె కూడా ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించనున్నారు.

నలుగురు వ్యక్తుల నుంచి తాము లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
2008 నుంచి దీనిపై ఫిర్యాదులు వినిపిస్తున్నా.. అడ్మినిస్ట్రేషన్ వీటిపై ఎలాంటి చర్యలను తీసుకునేందుకు ప్రయత్నించలేదు.
గురువారం కొందరు తల్లిదండ్రులు కూడా కాలేజీ క్యాంపస్‌కు వచ్చారు. కళాక్షేత్ర లో జరుగుతోన్న వ్యవహారంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘అడ్మిషన్ సమయంలో మాకు క్యాంపస్‌లోకి ప్రవేశించే అవకాశం దక్కింది. ఆ తర్వాత, మమ్మల్ని ఎప్పుడూ లోపలికి రానివ్వలేదు. కోర్సు ముగింపులో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో మమ్మల్ని ఆడిటోరియంలోకి అనుమతిస్తారు.
అంతే తప్ప, క్యాంపస్‌లో మరేచోటికి మేం వెళ్లేందుకు అనుమతి ఉండదు. ఎవరితో మాట్లాడకూడదు. మా పిల్లల చదువు కోసం మేము తప్పనిసరి పరిస్థితిలో నోరు మూసుకుని ఉండాల్సి వస్తుంది’’ అని కేరళకు చెందిన ఒక పేరెంట్ అన్నారు.
1936లో రుక్ష్మిణి దేవి అరుండేల్, ఆమె భర్త జార్జ్ అరుండేల్‌లు థియోసోఫికల్ సొసైటీ గార్డెన్‌లో 1936లో కళాక్షేత్రాన్ని స్థాపించారు.
ఆ తర్వాత, దీన్ని 1962లో తిరువాన్మయూర్‌కి తరలించారు. 1993లో పార్లమెంట్ దీనికి ఇన్‌స్టిట్యూషన్‌గా జాతీయ హోదా కల్పించింది.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














