‘‘పెరుగు ప్యాకెట్ల మీద పేరును హిందీలో రాయాలా... దక్షిణాది భాషలను అవమానిస్తారా’’ అంటూ విమర్శలు ఎందుకు వచ్చాయి

నందిని డెయిరీ పెరుగు

ఫొటో సోర్స్, Twitter/HD Kumaraswamy

పెరుగు ప్యాకెట్ల మీద రాసే పేరు భాష విషయంలో వివాదం నెలకొంది.

ప్యాకెట్ల మీద పెరుగు పేరును 'దహీ' అంటూ హిందీ పదం రాయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశించిందని, ఇది హిందీని 'రుద్దడమే' అంటూ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

వివాదం ఏంటి?

పెరుగు ప్యాకెట్ల మీద పేరును హిందీలో రాయాలంటూ కేంద్రం ఆదేశించిందని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్వీట్ చేశారు. అందులో ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ విడుదల చేసిన మార్గదర్శకాలు అని చెబుతున్న ఒక సర్క్యూలర్ ఉంది.

మార్చి 10న ఆ సర్క్యూలర్‌ను జారీ చేశారు. దాని ప్రకారం...

పెరుగు ప్యాకెట్‌పై ముద్రిస్తున్న కర్డ్(CURD) అనే నాలుగు అక్షరాల ఇంగ్లిష్ పేరుకి బదులు దహీ(DAHI) అని ముద్రించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

  • దహీ(కర్డ్)
  • దహీ(మోసరు)
  • దహీ(తాయిర్)
  • దహీ (పెరుగు)... ఇలా ఆయా రాష్ట్రాల్లోని భాషల ఆధారంగా ముద్రించుకోవచ్చని తెలిపింది.

కర్నాటక కోపరేటివ్ మిలక్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్, హట్సన్ ఆగ్రో ప్రోడక్ట్స్, తమిళనాడు కోపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ జాయింట్ డైరెక్టర్(సైన్స్ అండ్ స్టాండర్డ్స్) మహావదియా రాజేంద్ర ఆదేశాలు జారీ చేశారు.

ఎంకే స్టాలిన్

ఫొటో సోర్స్, Facebook/MK Stalin

''హిందీ రుద్దుతున్నారు''

పెరుగు ప్యాకెట్ల మీద పేరును దహీ అని రాయమనడం మీద తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు.

''పెరుగు ప్యాకెట్ల మీద కూడా హిందీలో పేరును రాయమనే స్థాయికి హిందీని రుద్దడం అనేది వచ్చింది. మా సొంత రాష్ట్రాల్లోనూ తమిళం, కన్నడలను (హిందీ కంటే) కిందకు దిగజారుస్తున్నారు.

మా మాతృభాష పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించిన వారిని దక్షిణాది నుంచి శాశ్వతంగా వెలివేస్తాం'' అని స్టాలిన్ ట్వీట్ చేశారు.

హెచ్‌డీ కుమారస్వామి

ఫొటో సోర్స్, Facebook/HD Kumaraswamy

''వ్యతిరేకిస్తారని తెలిసే చేస్తున్నారు''

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా దహీ అని రాయడాన్ని విమర్శించారు.

ఆయనొక ట్వీట్ చేశారు. అందులో నందిని డెయిరీ పెరుగు డబ్బా బొమ్మ ఉంది.

ఆ చిత్రంలో పెరుగు డబ్బా మీద ప్రొబయాటిక్ కర్డ్(దహీ) అని నందిని డెయిరీ ముద్రించినట్లుగా కనిపిస్తోంది. దాని మీద తయారీ తేదీ ఫిబ్రవరి 25గా ఉంది.

''కన్నడ ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిసే హిందీని రుద్దుతున్నారు. హిందీలో దహీ అని ముద్రించమని కేఎంఎఫ్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించడం తప్పు.

నందిని కన్నడిగుల ఆస్తి. కన్నడిగుల గుర్తింపు. కన్నడిగుల జీవనరేఖ. అది తెలిసినా హిందీ అనే అహం ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా వెనుక డోర్ నుంచి కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.

నందిని డెయిరీని అమూల్‌లో కలిపేస్తామని గతంలో అమిత్ షా అన్నారు. దాన్ని కన్నడిగులు వ్యతిరేకించారు.

దాంతో దొంగచాటుగా ఇప్పుడు ఇలా హిందీని తీసుకొచ్చారు. నందిని డెయిరీని అమూల్‌కు అప్పగించాలని చూస్తున్నారు. దీన్ని మేం చూస్తు ఉండం.

కర్నాటక అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భాగం కానీ గుజరాత్ కాలనీ కాదు'' అంటూ కుమార స్వామి ట్వీట్లు చేశారు.

ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని కర్నాటక మిల్క్ ఫెడరేషన్ కోరింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆదేశాలు వెనక్కి

కర్నాటక, తమిళనాడు నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ కొత్త సర్క్యూలర్‌ను జారీ చేసింది.

సాధారణంగా ఎఫ్‌ఎస్ఎస్ఎఫ్‌ఏ-2011 నిబంధనల ప్రకారం పాలు, పాల సంబంధిత ఉత్పత్తులకు మాత్రమే డెయిరీ పరమైన పదాలు వాడాలని అందులో పేర్కొంది. నాన్-డెయిరీ ప్రోడక్ట్స్‌కు వాటిని వాడకూడదని చెప్పింది.

అయితే ఫెర్మెంటెడ్ మిల్క్ ప్రోడక్ట్స్‌ నుంచి కర్డ్‌ అనే పదం తీసేయడం మీద తాజాగా వచ్చిన అభ్యర్థనల మేరకు మళ్లీ CURD అని రాసుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.

  • కర్డ్(పెరుగు)
  • కర్డ్(దహీ)
  • కర్డ్(మోసరు)
  • కర్డ్(తాయిర్)... అని రాసుకోవచ్చని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)