రక్తంతో ప్రేమలేఖలు, అమరుల చిత్రాలు, విన్నపాలు, నిరసనలు... ఈ ఎరుపుదనం ఓ బలమైన ప్రతీకగా ఎలా మారింది?

భారత్‌లో ఆందోళనలకు, నిరసనలకు రక్తమే ఒక సంకేతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రక్తంతో గీసిన ప్రధానమంత్రి ఫోటోను ప్రదర్శిస్తున్న మద్దతుదారులు
    • రచయిత, సౌత్విక్ బిశ్వాస్
    • హోదా, ఇండియా కరెస్పాండెంట్

భారత్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థ తన సభ్యులు విరాళంగా అందించే రక్తంతో గత పదేళ్ళుగా పెయింటింగ్స్ వేయిస్తోంది.

ఢిల్లీకి చెందిన షహీద్ స్మృతి చేతన సమితి (అమరవీరుల సంస్మరణ సంఘం) అమరవీరులు, పోరాటయోధుల గౌరవార్థం 250కి పైగా పెయింటింగ్స్‌ వేయించింది.

అలా రక్తంతో వేసిన చిత్రాలను వారు ఆశ్రమాలకు (ఆధ్యాత్మిక క్షేత్రాలకు), చిన్న చిన్న మ్యూజియంలకు ఇస్తుంటారు. ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తుంటారు.

‘‘రక్తం ఒక బలమైన ప్రతీక. ప్రజల్లో దేశభక్తిని నింపేందుకు మేము మా చిత్రాలను రక్తంతో వేస్తున్నాం. పిల్లల్లో దేశంపై ఉన్న ప్రేమ తగ్గుతోంది’’ అని ఈ సంస్థ అధిపతి ప్రేమ్ కుమార్ శుక్లా చెప్పారు.

ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన రవి చందర్ గుప్తా ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

ఆరోగ్యం మంచిగా ఉన్నంత కాలం 100కి పైగా పెయింటింగ్స్‌కి తన రక్తాన్ని విరాళంగా అందించారు గుప్తా.

‘‘ప్రజల్ని ఆకర్షించేందుకు నేను ఇది ప్రారంభించాను. రక్తంతో చిత్రాలు గీస్తే ప్రజలు మరింత ఆసక్తి చూపిస్తారు. రక్తం ఎన్నో భావోద్వేగాలను రగిలిస్తుంది.’’ అని 2017లో చనిపోయిన గుప్తా తెలిపారు.

గుప్తా తర్వాత ఈ సంస్థ బాధ్యతలను చూసుకుంటోన్న 50 ఏళ్ల స్కూల్ ఉపాధ్యాయుడు, కవి శుక్లా.

శుక్లా కూడా 100 పెయింటింగ్స్‌కు తన రక్తాన్ని విరాళంగా అందించారు.

శుక్లా లాంటి దాతలు స్థానిక ల్యాబ్‌లకు వెళ్లి, అక్కడ తమ రక్తాన్ని ఇస్తారు.

ఆ రక్తాన్ని యాంటీ-కాగ్యులెంట్స్ అంటే రక్తం గడ్డకట్టకుండా ఉండే కెమికల్‌లో కలుపుతారు.

ఆ తర్వాత దాన్ని 50 ఎంఎల్ బాటిల్‌లో పోస్తారు. వాటిని చిత్రకారులకు ఇస్తారు.

రెండు లేదా మూడు పెయింటింగ్స్‌కి సాధారణంగా 100ఎంఎల్ రక్తం సరిపోతుందని శుక్లా చెప్పారు.

పెయింటింగ్స్‌ కోసం తాను ఏడాదిలో నాలుగు సార్లు రక్తాన్ని విరాళంగా అందిస్తానని తెలిపారు.

నేతాజీగా మనమందరం పిలుచుకునే స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ నినాదం.. ‘‘నాకు రక్తమివ్వండి.. మీకు స్వేచ్ఛను ఇస్తాను’’ అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తాము ‘‘రక్త చిత్రాలు గీయిస్తున్నాం" అని శుక్లా అన్నారు.

భారత్‌లో ఆందోళనలకు, నిరసనలకు రక్తమే ఒక సంకేతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వందకు పైగా పెయింటింగ్స్‌కు రక్తదానం చేసిన రవి చందర్ గుప్తా

భారత్‌లో రక్త రాజకీయాలు నడిచిన చరిత్ర కూడా ఉంది.

రక్తానికి, రాజకీయాలకు ఉన్న సంబంధాలను తెలియజేస్తూ హెమటాలజీస్ పుస్తకం రాసిన జాకోబ్ కోప్‌మ్యాన్, ద్వైపయాన్ బెనర్జి అన్నారు.

వలసవాద వ్యతిరేక సంకేతంగా కూడా రక్తాన్ని వాడేవారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ శాంతి కాముకుడిగా పేరున్న మహాత్మా గాంధీ సైతం.. భారతీయులు వలసవాద హింస, అవినీతులను ఎదుర్కొనగలిగే రక్తాన్ని కలిగి ఉండాలని ఆశించారు.

గాంధీ 1948లో హత్యకు గురైనప్పుడు, ఆయనపై రక్తంతో తడిచిన వస్త్రాన్ని కప్పారు.

మధురైలోని మ్యూజియంలో ఈ వస్త్రాన్ని ప్రదర్శనకు ఉంచారు.

భారత రాజకీయ ప్రసంగాల్లో రక్తం ఒక బలమైన సంకేతంగా ఎప్పటికీ విడదీయరాని బంధాన్ని కలిగి ఉందని కోప్‌మ్యాన్, బెనర్జీ తెలిపారు.

ఇది త్యాగానికి ప్రతీక అని కూడా చెప్పారు.

త్యాగానికి, విశ్వాసానికి రక్తాన్ని ఒక ప్రతీకగా చూడటం అంత ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతుదారులు కూడా ఆయన పెయింటింగ్స్‌ను రక్తంతో గీశారు.

రక్తాన్ని ఆందోళన విధానాలుగా కూడా వాడారు.

2013లో గుజరాత్‌లోని గ్రామాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు.. తమ రక్తంతో నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

కొత్త రహదారి నిర్మాణం కోసం తమ భూములను తీసుకొనడాన్ని వ్యతిరేకిస్తూ, రక్తంతో తమ నిరసన తెలియజేశారు.

తాము ప్రధానికి లేఖలు రాశామని, కానీ ఆయన నుంచి తమకెలాంటి సమాధానం రాలేదని వారు చెప్పారు.

బతికుండగానే మంటల్లో కాల్చేసిన తన తల్లికి న్యాయం చేయాలని కోరుతూ ఉత్తర ప్రదేశ్‌లోని ఒక యువతి ఆ రాష్ట్ర అధికారులకు తన రక్తంతో లేఖ రాసింది.

నిరసనకారులు తమకు అత్యధిక వేతనాలను అందించాలని రక్తంతో డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో, స్కూళ్లలో కూడా రక్తాన్ని ఆందోళనల అస్త్రంగా వాడుతున్నారు.

హింసాత్మకంగా భావించే చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రక్తంతో లేఖలు రాస్తుంటారు.

కొందరు తమ వైపుకి దృష్టిని మరలించుకునేందుకు ప్రేమ లేఖలను కూడా రక్తంతో రాస్తున్నారు.

అవినీతిని, రెడ్‌ టేప్‌లపై మండిపడుతూ ప్రజలు కూడా చాలా సార్లు రాజకీయనాయకులు తమ రక్తాన్ని పీల్చుకు తింటున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు.

భారత్‌లో ఆందోళనలకు, నిరసనలకు రక్తమే ఒక సంకేతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాయుధ దళాల్లో ఉద్యోగాల కోసం ఏప్రిల్‌లో రక్తంతో ప్రభుత్వానికి లేఖ రాసిన అభ్యర్థులు

2008లో భారత దేశ చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనగా భావించే భోపాల్‌ 1984 గ్యాస్ ప్రమాద బాధితులు ఢిల్లీకి 800కి.మీలు నడిచి వెళ్లి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రక్తంతో రాసిన లేఖను అందించారు.

తమ ఆరోగ్యం, పునరావాస సమస్యలపై దృష్టిసారించాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు.

నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అస్సాంలో కూడా 1980లో రాజధాని గౌహతి వీధుల్లో తన రక్తంతో రాసిన నినాదాలతో ఒక 22 ఏళ్ల యువకుడు ఆందోళనలు చేశాడు.

‘‘మేము రక్తం ఇస్తున్నాం, నూనె కాదు’’ అంటూ తన నినాదాల్లో పేర్కొన్నాడు.

పశ్చిమ బెంగాల్‌లో విద్యుత్ ప్లాంట్ నిర్మాణ సమయంలో సమాఖ్య ప్రభుత్వంతో ఫండింగ్ సమస్య నెలకొన్నప్పుడు, నిధులను సేకరించేందుకు తమ మద్దతుదారులు రక్తాన్ని విక్రయించాలని 1988లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్సిస్ట్) కోరింది.

ఈ సందర్భంగా సేకరించిన రక్తాన్ని స్టోర్ చేసేందుకు తగినంత స్థలం లేకపోవడంతో, ఆ రక్తం పాడైంది.

ఆ తర్వాత జపనీస్ రుణ సహకారంతో ఆ విద్యుత్ ప్లాంట్‌ను పూర్తి చేశారు.

అదే సమయంలో, వైద్య సంస్థను మెరుగుపర్చడం కోసం ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు కోల్‌కతాలోని దాతల బృందం తమ రక్తాన్ని విక్రయించింది.

ఆ తర్వాత 10 ఏళ్లకు రక్తాన్ని అమ్మడం చట్టవిరుద్ధమైంది.

ప్రజల ఆకర్షణ పొందేందుకు చాలా రాజకీయ పార్టీలు కూడా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంటాయి.

ఈ పార్టీల మద్దతుదారులు రక్తాన్ని విరాళంగా అందిస్తూ ఉంటారు.

రాజకీయ పార్టీలు నిర్వహించే ఈ రక్తదాన శిబిరాలు నిజంగా భయంకరమైనవని హెమటాలజీల రచయితలతో ఒక బ్లడ్ బ్యాంకు ప్రొఫెషినల్ అన్నారు.

ఎందుకంటే, నాయకుడిని సంతోష పెట్టేందుకు మాత్రమే రాజకీయ పార్టీలు ఈ శిబిరాలను నిర్వహిస్తాయని, మరే ఇతర స్ఫూర్తిదాయక అంశం ఉండదని అన్నారు.

భారత్‌లో ఆందోళనలకు, నిరసనలకు రక్తమే ఒక సంకేతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలు

ఏమైనా, రక్తం చాలా రకాలుగా ఉపయోగపడే ప్రతీక అనే చెప్పాలి.

‘‘కులం స్వచ్ఛతను చాటుకునేందుకు రక్తం గురించి మాట్లాడుతుంటారు. పురుషాధిక్యతకు కూడా రక్తాన్ని ఒక ప్రతీకగా ఉపయోగిస్తుంటారు. కులం, మగతనం గొప్పవని చెప్పుకోవడంలో రక్తం ఒక సామాజిక వ్యక్తీకరణగా మారింది. విధేయతకు అత్యున్నత రూపంగా కూడా రక్తాన్ని చూస్తారు’’ అని సోషియాలాజిస్ట్ సంజయ్ శ్రీవాస్తవ అన్నారు.

ఇక ఆధునిక భారతంలో మహిళలు రుతుస్రావాలపై ఉన్న అపోహలను ధ్వంసం చేయడానికి రక్తాన్ని ఒక బలమైన సంకేతంగా వాడుతున్నారు.

ఒక్కమాటలో, రక్తం ప్రజల దృష్టిని తక్షణమే తన వైపునకు తిప్పుకోవడానికి, గుర్తింపు పొందడానికి ఉపయోగపడుతుంది.

చెన్నైలోని ఒక కరాటే టీచర్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయరాం జయలలితకు చెందిన 57 చిత్రలేఖనాలను తన రక్తంతో గీసిచ్చారు.

కరాటే స్కూల్ నిర్మాణం కోసం షిహాన్ హుసేనీకి కొంత స్థలం అవసరమైంది. అందుకోసం, జయలలిత అపాయింట్‌మెంట్ కోసం అలా ప్రయత్నించారు

‘‘అప్పుడు జయలలిత నన్ను ఇంటికి పిలిపించారు. ప్లాట్ కోసం లక్షల్లో డబ్బు ఇచ్చారు ’’ అని హుసేనీ హెమటాలజీస్ పుస్తకర రచయితలకు చెప్పారు.

ప్రచారానికి, నిర్ణయాలను ప్రభావితం చేయడానికి రక్త చిత్రలేఖనం ఒక బలమైన అస్త్రమని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి: