వేల కి.మీ. పరిగెడుతూ ఆఫ్రికాను చుట్టేస్తున్న ఈయన ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు?

ఫొటో సోర్స్, GUUS VAN VEEN
- రచయిత, క్రిస్టియాన్ ఫులర్
- హోదా, బీబీసీ న్యూస్
ఆఫ్రికా ఖండాన్నంతా కవర్ చేస్తూ పరిగెడుతున్న రసెల్ కుక్ తన మారథాన్లను పూర్తి చేసే తేదీని ప్రకటించారు.
యూకేలో వెస్ట్ సస్సెక్స్‌లోని వోర్తింగ్ పట్టణానికి చెందిన రసెల్ కుక్ తన 360 మారథాన్లను 240 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నారు.
కానీ, వీసా విషయంలో, ఆరోగ్యపరంగా, భౌగోళిక రాజకీయ సమస్యలు నెలకొనడంతో ఈ 26 ఏళ్ల వ్యక్తి తన ప్రయాణాన్ని మరికొంత కాలం పొడిగించారు.
చివరికి ఈ ఏడాది ఏప్రిల్ 7న మారథాన్లను ముగించాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆయన తన మారథాన్ల ముగింపు తేదీని ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, GUUS VAN VEEN
ఈ పరుగు ఎప్పుడు ప్రారంభించారు?
రసెల్ కుక్‌ను ‘‘హార్డెస్ట్ గీజర్’’ అని కూడా పిలుస్తుంటారు.
‘‘పరుగెడుతూ ఆఫ్రికా ఖండాన్నంతా చుట్టేసిన తొలి వ్యక్తిని కాబోతున్నాను. ఇది నెరవేరుతోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.
దక్షిణాఫ్రికాలో నిరుడు ఏప్రిల్ 22న ఈ పరుగు ప్రారంభించారు. ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియాలో ఈ ఛాలెంజ్ పూర్తిచేయబోతున్నారు.
16 సరిహద్దుల గుండా ప్రయాణిస్తూ.. 9,320 మైళ్లను(14,500 కి.మీలను) చుట్టిరావాలని రసెల్ కుక్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రయాణంలో పలు నగరాలు, వర్షారణ్యాలు, సహారా ఎడారి గుండా మూడు నెలలు పాటు ప్రయాణించారు. ఎనిమిది నెలల పాటు ఆయన ఈ మారథాన్లను చేయాలనుకున్నారు.
గత వారమే మౌరిటానియా నుంచి అల్జీరియాలోకి ప్రవేశించేందుకు అవసరమైన వీసాను రసెల్ కుక్ పొందారు.
ఈ వీసాను పొందే సమయంలో ఈయన కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు.
అంతేకాక, భద్రతా కారణాల చేత అల్జీరియా గుండా ప్రయాణించవద్దని బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆయనకు సూచించింది.
ఉగ్రవాదులు పలు దాడులను చేపట్టే అవకాశం ఉందని, కిడ్నాప్ కూడా చేయొచ్చని హెచ్చరించింది.
ఆయన తన ప్రయాణం మధ్యలో దొంగతనానికి కూడా గురయ్యారు. అంగోలాలో జరిగిన ఘటనలో ఆయన కెమెరాలు, ఫోన్లు, నగదు, పాస్‌పోర్టులు దొంగతనానికి గురైనట్లు చెప్పారు.
అయితే, అంగోలాలో తనతో చాలా మంది చాలా స్నేహపూర్వకంగా మెలిగినట్లు, తనకు సంతోషంతో స్వాగతం పలికారని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చారిటీ కోసం ఎంత సేకరించారు?
రసెల్ కుక్‌కు వీసా కల్పించేలా సాయం చేయాలని యూకేలోని అల్జీరియా రాయబారిని కోరుతూ అల్జీరియా ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ అలెక్సాండర్ స్టాఫోర్డ్ లేఖ రాశారు.
అల్జీరియా గుండా ఆయన ప్రయాణించేలా సాయం చేయాలని చెప్పారు.
రసెల్ కుక్ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకమని, ఎంతో ఉన్నతమైన పనికి ఆయన నిధులు సేకరిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు అంటే 290 రోజులు ముగిసే సరికి యూకేకు చెందిన ‘ద రన్నింగ్ చారిటీ’ సంస్థకు సహాయం చేయడం కోసం తాను 1,65,000 పౌండ్లను (భారతీయ కరెన్సీలో రూ.1;72 కోట్లు) సేకరించినట్లు చెప్పారు.
తమది ఒక స్వతంత్ర సంస్థ అని ‘ద రన్నింగ్ చారిటీ’ వెబ్‌సెట్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- బీర్ నిండుకోవడంతో ఈ అద్భుత దీవుల్లో పర్యాటకం దెబ్బతింటోంది
- Turkey: భూగర్భంలో మహానగరం, 18 అంతస్తుల్లో సొరంగాలతో అనుసంధానం
- కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారు?
- విశాఖపట్నం ఎంపీగా స్థానికేతరులే ఎందుకు గెలుస్తున్నారు?
- పాల్ మెకంజీ: ఆకలితో చనిపోతే స్వర్గానికి వెళ్తారని చెప్పి 191 మందిని హత్య చేశారంటూ పాస్టర్‌పై కేసు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














