చాట్‌జీపీటీ: ఆండ్రాయిడ్‌లో ఏయే ఫోన్లలో పనిచేస్తుంది?

చాట్ జీపీటీ

ఫొటో సోర్స్, Getty Images

చాట్ జీపీటీ యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.

ఈ విషయాన్ని చాట్ జీపీటీ యాప్ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ట్విటర్ వేదికగా వెల్లడించింది.

అమెరికా, భారత్, బంగ్లాదేశ్, బ్రెజిల్‌ దేశాలలో ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులోకి వచ్చినట్లు మంగళవారం రాత్రి ‘ఓపెన్ ఏఐ’ తెలిపింది.

రానున్న వారంలో మరిన్ని దేశాలలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

చాట్ జీపీటీ యాప్ రెండు నెలల కిందటే ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

చాట్ జీపీటీ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను 2023 జులై 21న విడుదల చేయగా, జులై 25 నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు.

ChatGPT

ఫొటో సోర్స్, Google Play Store

ఇంతకీ ఏమిటీ చాట్ జీపీటీ?

చాట్ జీపీటీ అనేది ‘ఓపెన్ ఏఐ’ సంస్థకు చెందిన ఒక చాట్ బోట్. ఈ బోట్ వ్యాసాలు, స్క్రిప్ట్‌లు, కవితలు రాయగలగడంతో పాటు మనుషుల తరహాలో కంప్యూటర్ కోడింగ్ కూడా చేయగలదు.

చాట్ జీపీటీలో ‘జీపీటీ’ అనే పొడి అక్షరాలకు ‘జనరేటివ్ ప్రీ ట్రెయిన్డ్ ట్రాన్స్‌ఫార్మర్’ అనేది పూర్తి అర్థం.

నిర్దిష్ట అంశంపై ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం తీసుకుని క్రోడీకరించి చెప్పగల సామర్థ్యం ఈ బోట్ సొంతం.

యూజర్ ఒక ప్రశ్న అడగడమో, లేదంటే ఏదైనా పని చేయమని కమాండ్ ఇవ్వడమో చేసినప్పుడు ఈ బోట్ ఇంటర్నెట్‌లో దానికి సంబంధించి ఉన్న సమాచారంపై ఆధారపడి సమాధానం ఇవ్వడం కానీ, కోరిన పని చేయడం కానీ చేస్తుంది.

ఇంటర్నెట్‌లో అందుకు తగిన సమాచారం లేకపోయినా, చాట్ జీపీటీకి ఆ సమాచారం తీసుకునే యాక్సెస్ లేకపోయినా ఆ ప్రశ్నకు, కమాండ్‌కు తగిన సమాధానం, స్పందన ఉండవు.

ఫోన్ చూస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఏమేం ఆప్షన్లు ఉన్నాయి?

సాధారణ పద్ధతిలో టైప్ చేసి సెర్చ్ చేసే ఆప్షన్‌తో పాటు వాయిస్ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది.

దీనికి అదనంగా చాట్ హిస్టరీ చూసే అవకాశం ఉంది. డేటాను ఎక్స్‌పోర్ట్ చేసుకునే వీలూ ఉంది ఇందులో.

దీన్ని ఎక్కువగా గూగుల్ సెర్చ్‌కు ప్రత్యామ్నాయంగా వాడుతుండడంతో పాటు కంటెంట్ జనరేషన్‌లోనూ దీని సహాయం తీసుకుంటున్నారు యూజర్లు.

కోడింగ్ అసిస్టెంట్‌గానూ వాడుతున్నవారు ఉన్నారు.

అయితే, ఐవోఎస్‌లో పనిచేసే చాట్ జీపీటీ యాప్‌లో ప్లగ్-ఇన్ సదుపాయం ఉండగా, ఆండ్రాయిడ్ యాప్‌లో ఇంకా ఈ సదుపాయం రాలేదు.

ChatGPT CEO Samuel Altman

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాట్ జీపీటీ సీఈవో శామ్యూల్

ఓపెన్ ఏఐ కంపెనీ ఏం చెప్తోంది?

ఈ యాప్ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఏమేం చేయొచ్చనేది ‘ఓపెన్ ఏఐ’ సంస్థ ప్లేస్టోర్‌లో యాప్ డీటెయిల్స్‌లో చెప్పింది.

  • ఇన్‌స్టంట్ ఆన్సర్స్
  • టైలర్డ్ అడ్వైస్
  • క్రియేటివ్ ఇన్‌స్పిరేషన్
  • ప్రొఫెషనల్ ఇన్‌పుట్
  • లెర్నింగ్ ఆపర్చ్యూనిటీస్

ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలా?

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి చాట్ జీపీటీ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రొడక్టివిటీ కేటగిరీలో అందుబాటులో ఉంది.

ప్లే స్టోర్ ఓపెన్ చేసి ChatGPT అని టైప్ చేస్తే ఈ యాప్ చూపిస్తుంది. చాట్ జీపీటీ లోగోను గుర్తించి క్లిక్ చేయాలి.

లోగోకు కుడివైపు చాట్ జీపీటీ అని చూపిస్తుంది, దాని దిగువన ‘ఓపెన్ఏఐ’ అని కనిపిస్తుంది. అలా కనిపిస్తేనే అది అసలైన యాప్. అక్కడ కనిపించే ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది.

అనంతరం జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది.

android

ఫొటో సోర్స్, Getty Images

అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయదా?

ఈ యాప్ ఆండ్రాయిడ్ 6.0, ఆ తరువాత వచ్చిన వెర్షన్లకు మాత్రమే పనిచేస్తుంది.

అంటే ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆ తరువాత వెర్షన్లకు ఇది పనిచేస్తుందన్నమాట.

ఒకవేళ మార్ష్‌మాలో కంటే పాత ఆండ్రాయిడ్ వెర్షన్ ఉన్న ఫోన్లయితే పనిచేయదు, ఆ విషయం యాప్ డౌన్‌లోడ్ సమయంలోనే చూపిస్తుంది.

OpenAI

ఫొటో సోర్స్, Getty Images

మీ డేటా భద్రమేనా?

ఈ యాప్ యూజర్‌కు సంబంధించిన ఎలాంటి డేటా సేకరించే అవకాశం ఉందో సంస్థ చెప్పింది.

ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన డివైస్‌లో మైక్రోఫోన్, నెట్‌వర్క్ కనెక్షన్ వంటివాటి యాక్సెస్ దీనికి ఉంటుంది.

ఈ యాప్ యూజర్ లొకేషన్ గుర్తిస్తుంది.

పేరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారం తీసుకుంటుంది.

అయితే, ఈ డేటాను ఇతర సంస్థలతో షేర్ చేసుకోబోమని డెవలపర్లు తెలిపారు.

యూజర్ తన డేటాను ఈ యాప్ నుంచి డిలీట్ చేయాలని కోరుకుంటే, అందుకు అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)