ఇన్సులిన్, ఎయిర్ ఇంజెక్షన్లు ఇచ్చి ఏడుగురు చిన్నారులను చంపేసిన నర్స్

ఫొటో సోర్స్, SWNS
ఇంగ్లండ్‌లోని ఓ ఆసుపత్రి నియోనాటాలజీ విభాగంలో నర్సుగా పనిచేసిన లూసీ లెట్బీ ఏడుగురు నవజాత శిశువులను చంపేసిన కేసులో దోషిగా తేలారు.
బ్రిటన్‌లో పిలలను అత్యంత క్రూరంగా చంపేసిన సీరియల్ కిల్లర్‌గా లూసీ లెట్బీని పేర్కొంటున్నారు.
2015 జూన్ నుంచి 2016 జూన్ మధ్య కాలంలో ‘కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్’లో మరో ఆరుగురు నవజాత శిశువుల హత్యకు ప్రయత్నించిన కేసులోనూ 33 ఏళ్ల ఈమెను దోషిగా తేల్చింది కోర్టు.
2015 జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో లూసీ అయిదుగురు నవజాతశిశువులను చంపేశారు. ఆ తరువాత 2016 జూన్‌లో మరో ఇద్దరు పిల్లలు లూసీ చేతిలో చనిపోయారు.
పిల్లలకు గాలి ఇంజెక్షన్లు ఇచ్చి, బలవంతంగా ఇతరుల పాలు తాగించి, ఇన్సులిన్ ఎక్కించి చంపేసినట్లు గుర్తించారు.
తాజా తీర్పులు వెలువడే సమయంలో కోర్టుకు రావడానికి ఆమె నిరాకరించారు.
2022 అక్టోబర్‌లో ఆమెపై విచారణ ప్రారంభమైనప్పుడు తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన సహోద్యోగులను తప్పుదోవ పట్టించినట్లు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తెలిపింది.
ఆస్పత్రిల్లో ప్రీమెచ్యూర్ బేబీలు అకస్మాత్తుగా చనిపోయిన ఘటనలు అనూహ్యంగా పెరగడంతో చెషైర్ పోలీసులు రెండేళ్ల పాటు విచారణ జరిపిన తర్వాత ఆమెపై అభియోగాలు నమోదు చేశారు.
లూసీ నమోదైన కేసులను విచారణకు కోర్టుకు 10 నెలల సమయం పట్టింది.
తనకు వ్యతిరేకంగా నమోదైన 22 ఆరోపణలనూ లూసీ ప్రారంభం నుంచి తోసిపుచ్చుతూ వచ్చారు.

ఫొటో సోర్స్, PA
లూసీ లెట్బీ ఎవరు
ఇంగ్లాండ్‌లోని హెరెఫోర్డ్‌లో జాన్, సునాన్‌లకు 1990 జనవరి 4న లూసీ జన్మించారు.
తమ ఒక్కగానొక్క కూతరిపై జరుగుతున్న విచారణను గత అక్టోబర్ నుంచి మాంచెస్టర్ కోర్టులోని పబ్లిక్ గ్యాలరీలో కూర్చుని వింటున్నారు జాన్, సునాన్.
‘‘నేను ఎప్పుడూ పిల్లలతో కలిసి పనిచేయాలనుకునే దాన్ని’’ అన జ్యూరీకి లూసీ చెప్పారు.
చెస్టర్ యూనివర్సిటీలో లూసీ మూడేళ్లు పాటు నర్సింగ్ విద్యను అభ్యసించారు. ఆ కుటుంబంలో యూనివర్సిటీలో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి ఆమెనే.
చదువుకునే సమయంలోనే, ఆమె పలు ఇంటర్న్‌షిప్‌లు చేశారు. చాలా వరకు ఇంటర్న్‌షిప్‌లు కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలోని నవజాత శిశువులు, నియోనాటాలజీ విభాగంలోనే పూర్తిచేశారు.
2011 సెప్టెంబర్‌లో ఆమె నర్సింగ్ కోర్స్ పూర్తిచేశారు.
2012 జనవరి నుంచి ఆమె ఫుల్ టైమ్ నర్సుగా ఈ ఆస్పత్రిలో పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 2015లో నవజాత శిశువుల ఇంటెన్షివ్ కేర్‌లో పనిచేసే అర్హతను ఆమె సాధించారు.
నియోనాటాలజీ విభాగంలో ఉంచిన చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవడానికే తాను అంకితమయ్యానని లూసీ కోర్టులో చెప్పారు.
ఐదు నుంచి ఆరుగురు నర్సింగ్ విద్యార్థులకు తాను మెంటార్‌గా పనిచేశానని ఆమె చెప్పారు. 2015 నుంచి 2016 మధ్య కాలంలో వందలాది మంది నవజాత శిశువులను తాను సంరక్షించినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, CHESHIRE POLICE
విచారణ ఎలా సాగింది?
2016 సెప్టెంబర్‌లో పిల్లల మరణాల విషయంలో తనని విచారించనున్నట్లు తెలుపుతూ రాయల్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ నుంచి తనకు లేఖ ద్వారా అధికారికంగా తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఆమెను క్లినికల్ డ్యూటీల నుంచి ఆస్పత్రి నిర్వాహణ విభాగం తప్పించింది.
పేషెంట్ రిస్క్, సేఫ్టీ కార్యాలయంలో కేవలం అడ్మినిస్ట్రేటివ్ స్థానానికే ఆమెను పరిమితం చేసింది.
స్టాఫ్ తమ ఉద్యోగాలను ఎంత సమర్థంగా పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు తనని ఇక్కడికి పంపినట్లు అనుకున్నానని లూసీ చెప్పారు.
కాగా యూనిట్‌లో జరిగిన వరుస వైఫల్యాలతో ఈ మరణాలు సంభవించాయని, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ నిందను మరో వ్యక్తికి ఆపాదించాలని సిస్టమ్ అనుకుంటుందని ఆమె తరఫున వాదించిన లాయర్లు అన్నారు.
ఆరేళ్ల తర్వాత 2022లో ముందు ఎలాంటి నేర ప్రమేయం లేకపోవడం,, పని విషయంలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి వార్నింగ్స్ లేకుండానే తాను కోర్టులో కూర్చోవాల్సి వచ్చిందని వారు వాదించారు.
విచారణ సందర్భంగా లూసీ ప్రైవేట్ జీవితం కూడా వెలుగులోకి వచ్చింది. కోర్టులో ఆమె ప్రైవేట్ వాట్సాప్, సోషల్ మీడియా మెసేజ్‌లు చదివి వినిపించారు.
తాను సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గానే ఉంటానని జ్యూరీకి లూసీ తెలిపారు.
‘‘సల్సా క్లాస్‌లకు క్రమం తప్పకుండా వెళ్తుండేదాన్ని అని, స్నేహితులతో హ్యాంగవుట్, వెకేషన్‌కి వెళ్లడం, జిమ్‌కి వెళ్లడం చేసేదాన్ని’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, PA
తాను తొలుత అరెస్ట్ అయిన తన ఇంటి ఫోటోలను చూపించినప్పుడు లూసీ కన్నీటిపర్యంతమయ్యారు.
చెస్టర్‌లోని ఫ్లాట్‌కి షిఫ్ట్ అవడానికి ముందు లూసీ యాష్ హౌస్ వద్దనున్న ఆస్పత్రి ఉద్యోగుల నివాస సదుపాయంలో ఉన్నారు.
2015 జూన్‌లో ఈ ఆస్పత్రి నివాస సదుపాయానికి వెళ్లారు. ఆ తర్వాత 2016 ఏప్రిల్‌లో చెస్టర్‌లో తాను ఇంటిని కొనుగోలు చేసి అక్కడికి వెళ్లారు.
2020 నవంబర్ నుంచి లూసీ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. నాలుగు జైళ్లలో ఆమెను ఉంచారు.
ఆమె కేసు ప్రపంచవ్యాప్తంగా పాఠకుల దృష్టిని ఆకర్షించింది.
ఎందుకంటే నియోనాటల్ నర్సుగా పనిచేసే ఆమె ఇలాంటి పనికి ఎలా పాల్పడ్డారా అని చాలామంది ఆశ్చర్యపోయారు.
ఇవి కూడా చదవండి:
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
- భారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














