ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రొ: యాపిల్ కొత్త ఫోన్లు ఎలా ఉన్నాయి, వాటి ఫీచర్లేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
టెక్ దిగ్గజం యాపిల్ తన సరికొత్త సిరీస్ ఐఫోన్లను సెప్టెంబర్ 9న (మంగళవారం రాత్రి) విడుదల చేసింది.
కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయం కూపెర్టినోలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రొ, ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్ పేర్లతో ఈ సరికొత్త ఐఫోన్లను లాంచ్ చేసింది.
వీటితో పాటు అప్‌డేటెడ్ యాపిల్ వాచ్‌లను, ఇయర్‌పాడ్స్ ప్రొ 3ని కూడా విడుదల చేసింది.

కొత్త ఐఫోన్ల ధరలు ఇలా...
ఈ కొత్త ఐఫోన్ల ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమై..సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయని యాపిల్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఐఫోన్ 17 ధర భారత్‌లో రూ.82,900 నుంచి మొదలవుతుందని వెల్లడించింది.
అలాగే, ఐఫోన్ 17 ప్రొ ధర రూ.1,34,900 నుంచి, ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ధర రూ.1,49,900 నుంచి, ఐఫోన్ ఎయిర్ ధర రూ.1,19,900 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.

ఫొటో సోర్స్, www.apple.com

ఐఫోన్ 17 ఫీచర్లు
- మొత్తం ఐదు రంగులు.. లావెండర్, సేజ్, మిస్ట్ బ్లూ, వైట్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది.
- సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే
- 6.3 అంగుళాల (డయాగ్నోనల్) ఆల్ స్క్రీన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
- అల్యూమినియం ఫ్రేమ్
- సెరామిక్ షీల్డ్ 2 ఫ్రంట్ ప్రొటెక్షన్ (మూడింతలు ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను ఇది అందిస్తుంది.)
- 6 మీటర్ల లోతులో 30 నిమిషాల వరకు వాటర్ రెసిస్టెన్స్
- ముందువైపు 18 మెగాపిక్సెల్‌తో ఒక కెమెరా, వెనుకవైపు 48 మెగాపిక్సెల్‌తో రెండు కెమెరాలు
- 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోరేజీ కెపాసిటీ
- 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.82,900 అయితే, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,02,900.
- యూఎస్‌బీ-సీ చార్జింగ్ కేబుల్‌తో 40 వాట్స్ అడాప్టర్ లేదా అంతకంటే ఎక్కువ దానితో 20 నిమిషాల్లోనే 50 శాతం చార్జ్ అవుతుంది.
- మ్యాగ్ సేఫ్ చార్జర్‌తో 30 వాట్స్ అడాప్టర్ లేదా అంతకంటే ఎక్కువ దానితో 30 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది.
- ఐఓఎస్ 26, ప్రాసెసర్ యాపిల్ ఏ19
- 30 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్
- యూఎస్‌బీ-సీ, యూఎస్‌బీ 2 సపోర్టు చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఐఫోన్ 17 ప్రొ ఫీచర్లు
- మొత్తం మూడు రంగులు.. కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్
- సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే
- 6.3 అంగుళాల (డయాగ్నోనల్) ఆల్ స్క్రీన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
- అల్యూమినియం యూనిబాడీ
- సెరామిక్ షీల్డ్ 2 ఫ్రంట్ ప్రొటెక్షన్ (మూడింతలు ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను ఇది అందిస్తుంది.)
- సెరామిక్ షీల్డ్ బ్యాక్ ప్రొటెక్షన్
- 6 మీటర్ల లోతులో 30 నిమిషాల వరకు వాటర్ రెసిస్టెన్స్

ఫొటో సోర్స్, Justin Sullivan/Getty Images
- ముందు వైపు 18 మెగాపిక్సెల్‌తో ఒక కెమెరా, వెనుక వైపు 48 మెగాపిక్సెల్‌తో మూడు కెమెరాలు
- 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోరేజీ, 1 టీబీ స్టోరేజీ కెపాసిటీ
- 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,34,900 అయితే, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,54,900, 1 టీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,74,900.
- యూఎస్‌బీ-సీ చార్జింగ్ కేబుల్‌తో 40 వాట్స్ అడాప్టర్ లేదా అంతకంటే ఎక్కువతో 20 నిమిషాల్లోనే 50 శాతం చార్జ్ అవుతుంది.
- మ్యాగ్ సేఫ్ చార్జర్‌తో 30 వాట్స్ అడాప్టర్ లేదా అంతకంటే ఎక్కువతో 30 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది.
- ఐఓఎస్ 26, ప్రాసెసర్ యాపిల్ ఏ19 ప్రొ
- 31 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్
- యూఎస్‌బీ-సీ, యూఎస్‌బీ 3 (10జీబీపీఎస్ వరకు) సపోర్టు చేస్తుంది.

ఫొటో సోర్స్, Justin Sullivan/Getty Images
ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ఫీచర్లు
- మొత్తం మూడు రంగులు.. కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్
- సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే
- 6.9 అంగుళాల (డయాగ్నోనల్) ఆల్ స్క్రీన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
- అల్యూమినియం యూనిబాడీ
- సెరామిక్ షీల్డ్ 2 ఫ్రంట్ ప్రొటెక్షన్ (మూడింతలు ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను ఇది అందిస్తుంది. )
- సెరామిక్ షీల్డ్ బ్యాక్ ప్రొటెక్షన్
- 6 మీటర్ల లోతులో 30 నిమిషాల వరకు వాటర్ రెసిస్టెన్స్
- ముందు వైపు 18 మెగాపిక్సెల్‌తో ఒక కెమెరా, వెనుక వైపు 48 మెగాపిక్సెల్‌తో మూడు కెమెరాలు
- 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోరేజీ, 1 టీబీ స్టోరేజీ, 2 టీబీ స్టోరేజీ కెపాసిటీ
- 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,49,900 అయితే, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,69,900, 1 టీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,89,900, 2 టీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.2,29,900.
- యూఎస్‌బీ-సీ చార్జింగ్ కేబుల్‌తో 40 వాట్స్ అడాప్టర్ లేదా అంతకంటే ఎక్కువతో 20 నిమిషాల్లోనే 50 శాతం చార్జ్ అవుతుంది.
- మ్యాగ్ సేఫ్ చార్జర్‌తో 30 వాట్స్ అడాప్టర్ లేదా అంతకంటే ఎక్కువతో 30 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది.
- ఐఓఎస్ 26, ప్రాసెసర్ యాపిల్ ఏ19 ప్రొ
- 37 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్
- యూఎస్‌బీ-సీ, యూఎస్‌బీ 3 (10జీబీపీఎస్ వరకు) సపోర్టు చేస్తుంది.

ఫొటో సోర్స్, NIC COURY/AFP via Getty Images
ఐఫోన్ ఎయిర్ ఫీచర్లు
- మొత్తం నాలుగు రంగులు.. స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్, స్కై బ్లూ
- సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే
- 6.5 అంగుళాల (డయాగ్నోనల్) ఆల్ స్క్రీన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
- టైటానియం ఫ్రేమ్
- సెరామిక్ షీల్డ్ 2 ఫ్రంట్ ప్రొటెక్షన్ (మూడింతలు ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను ఇది అందిస్తుంది.)
- సెరామిక్ షీల్డ్ బ్యాక్ ప్రొటెక్షన్
- 6 మీటర్ల లోతులో 30 నిమిషాల వరకు వాటర్ రెసిస్టెన్స్
- ముందువైపు 18 మెగాపిక్సెల్‌తో ఒక కెమెరా, వెనుకవైపు 48 మెగాపిక్సెల్‌తో ఒక కెమెరా
- 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోరేజీ, 1 టీబీ స్టోరేజీ కెపాసిటీ
- 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900 అయితే, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,39,900, 1 టీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,59,900.
- యూఎస్‌బీ-సీ చార్జింగ్ కేబుల్‌తో 20 వాట్స్ అడాప్టర్ లేదా అంతకంటే ఎక్కువతో 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జ్ అవుతుంది.
- మ్యాగ్ సేఫ్ చార్జర్‌తో 30 వాట్స్ అడాప్టర్ లేదా అంతకంటే ఎక్కువతో 30 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది.
- ఐఓఎస్ 26, ప్రాసెసర్ యాపిల్ ఏ19 ప్రొ
- 27 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్
- యూఎస్‌బీ-సీ, యూఎస్‌బీ 2ను సపోర్టు చేస్తుంది.
- యాపిల్ ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఐఫోన్లలో ఇదే అత్యంత సన్నని ఐఫోన్.

ఫొటో సోర్స్, www.apple.com
ఇయర్‌పాడ్స్ ప్రొ 3
కొత్త ఫోన్లతో పాటు యాపిల్ ఇయర్‌పాడ్స్ ప్రొ 3ను కూడా విడుదల చేసింది.
ఇది కూడా సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది.
దీని ధర రూ.25,900.
ఇయర్‌పాడ్స్ ప్రొ 2తో పోలిస్తే రెండింతలు ఎక్కువగా అవసరం లేని శబ్దాలను ఇది అడ్డుకుంటుంది.
వర్కవుట్స్ సమయంలో హార్ట్ రేట్‌ను, ఎన్ని కేలరీలను కరిగిస్తున్నారో ట్రాక్ చేసుకోవచ్చు.
లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా ఉంది.
ఒక్కసారి చార్జింగ్‌తో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో 8 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందిస్తుంది. ఇయర్‌పాడ్స్ ప్రొ 2తో పోలిస్తే రెండు గంటలు అదనం.

ఫొటో సోర్స్, Justin Sullivan/Getty Images
యాపిల్ కొత్త వాచ్‌లు...
మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్ సందర్భంగా యాపిల్ వాచ్ సిరీస్ 11, యాపిల్ వాచ్ ఎస్ఈ 3, యాపిల్ వాచ్ అల్ట్రా 3లను కూడా లాంచ్ చేసింది.
యాపిల్ వాచ్ సిరీస్ 11 ధర రూ.46,900 నుంచి, యాపిల్ వాచ్ ఎస్ఈ 3 ధర రూ.25,900 నుంచి, యాపిల్ వాచ్ అల్ట్రా 3 ధర రూ.89,900 నుంచి ప్రారంభమవుతుంది.
ఈసీజ్ యాప్, హై, లో హార్ట్ రేట్ నోటిఫికేషన్లు, లో కార్డియో ఫిట్‌నెట్ నోటిఫికేషన్లు, బ్లడ్ ఆక్సీజన్ యాప్ ఈ వాచ్‌లలో ప్రత్యేకం.
నిద్రను ట్రాక్ చేస్తాయి. స్లీప్ స్కోర్‌ను అందిస్తాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)