మీ ఐఫోన్ నీటిలో పడిందా.. అయితే ఇలా చేయండి!

ఫొటో సోర్స్, Getty Images
మీ ఐఫోన్లోకి నీరు వెళ్తే, దానిని బియ్యం సంచిలో ఆరబెట్టవద్దని వినియోగదారులకు యాపిల్ కంపెనీ సలహా ఇచ్చింది.
ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్నప్పటికీ, దీని పనితీరుపై నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు యాపిల్ స్వయంగా వినియోగదారులకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఫోన్‌ను బియ్యం సంచిలో పెట్టవద్దని, ధాన్యంలోని సూక్ష్మ రేణువులు ఫోన్‌ను దెబ్బతీస్తాయని, అలా చేయవద్దని తెలిపింది.

ఫొటో సోర్స్, APPLE
నీటిలో పడితే ఏం చెయ్యకూడదు?
స్మార్ట్‌ఫోన్‌ల టెక్నాలజీ అంతకంతకూ మెరుగుపడుతోంది. అయితే అవి నీటిలో పడితే బాగు చేసుకొనే ఖర్చు కూడా పెరుగుతూ పోతోంది.
అయితే, అలాంటి వాటి నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా యాపిల్ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఐఫోన్‌లో నీటిని తొలగించడానికి రేడియేటర్, హెయిర్‌డ్రైయర్‌ల వంటి పద్దతులు వాడొద్దని సూచించింది. అంతేకాదు, పేపర్ టవల్, కాటన్ బడ్స్ లాంటి వస్తువులను ఫోన్లో చొప్పించడానికి ప్రయత్నించవద్దని తెలిపింది.

ఫొటో సోర్స్, APPLE
ఐఫోన్‌లోకి నీరు వెళ్తే ఏం చెయ్యాలి?
ఐఫోన్‌లోకి నీరు వెళ్లిందని భావిస్తే, కనెక్టర్ కిందకు ఉండేలా డివైజ్ పెట్టి, సున్నితంగా కొట్టాలని యాపిల్ కంపెనీ సూచించింది.
ఫోన్ వెంటనే ఛార్జింగ్ పెట్టవద్దని, గాలి తాకే పొడి ప్రదేశంలో మొబైల్‌ను కొద్దిసేపు ఉంచాలని తెలిపింది.
30 నిమిషాల తర్వాత, యూఎస్‌బీ-సీ కేబుల్ లేదా లైటెనింగ్ కనెక్టర్‌తో ఛార్జింగ్ చేయడానికి ప్రయత్నించాలి.
మళ్లీ అలర్ట్ వస్తే, కనెక్టర్‌లో లేదా మీ కేబుల్ పిన్‌ల కింద ఇంకా నీరు ఉందని అర్థం.
అలాంటి పరిస్థితిలో ఐఫోన్‌ను ఒక రోజు వరకు కొంత గాలి తగిలే పొడి ప్రదేశంలో ఉంచండి.
మీరు ఈ వ్యవధిలో ఫోన్ ఛార్జ్ చేయడానికి లేదా కనెక్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. పూర్తిగా నీరు పోవడానికి 24 గంటల సమయం పట్టవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌ను మార్చడం వల్ల భవిష్యత్తులో ఈ సలహాలు అనవసరం కావచ్చని ‘మ్యాక్‌వరల్డ్’ వెబ్‌సైట్ తెలిపింది. ఎందుకంటే వివిధ కొత్త మోడళ్లలో వస్తున్న మార్పుల కారణంగా అవి తడిని తట్టుకోగలవని అభిప్రాయపడింది.
ఐఫోన్ 12 సిరీస్, ఆ తర్వాత వచ్చిన యాపిల్ డివైస్‌లకు ఆరు మీటర్ల లోతు వరకు గరిష్ఠంగా 30 నిమిషాలపాటు ఉన్నా పనిచేసే సామర్థ్యం ఉంటుందని యాపిల్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- బ్లడ్ బ్రదర్స్: ఒకరి ప్రాణాలను మరొకరు కాపాడుకున్న ఇద్దరు అపరిచితులు
- శ్రీలంకలో రోజుకు ఒక ఏనుగు ఎందుకు చనిపోతోంది?
- చిలీ: ‘నరకం అంటే ఏంటో మాకు భూమ్మీదే కనిపిస్తోంది’ అని స్థానికులు ఎందుకు అంటున్నారు?
- పాంప్లెట్ ఫిష్: సత్పతి తీరంలో ఈ చేపలు ఎందుకు తగ్గిపోయాయి? అలా చేస్తే ఎక్కడైనా ఇదే పరిస్థితి వస్తుందా?
- ఒక్కో కప్ప రూ.83 వేలు.. 130 కప్పలను విమానంలో తరలించేందుకు యత్నించిన మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














