Google Dialer: కొత్త అప్‌డేట్ నచ్చలేదా? పాత వెర్షన్‌కు వెళ్లడానికి సింపుల్ స్టెప్స్ ఇవే..

ఫొటో సోర్స్, Anji/BBC
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆండ్రాయిడ్ ఫోన్లలో డయలర్ యాప్‌లో వచ్చిన మార్పుల గురించే చర్చ కదా. కొందరికి ఈ అప్‌డేట్ నచ్చితే... మరి కొందరికి నచ్చడంలేదు. ఒకవేళ ఈ మార్పులు నచ్చని వాళ్ల జాబితాలో మీరుంటే.. ఇది మీ కోసమే... సింపుల్ స్టెప్స్‌తో తిరిగి మీ పాత వెర్షన్‌కు వెళ్లొచ్చు. అది ఎలాగో ఇక్కడ చదివేయండి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ వన్‌ప్లస్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం...
"మీ ఫోన్ డయలర్ యాప్‌పై లాంగ్ ప్రెస్ చేయండి. యాప్ ఇన్ఫో వస్తుంది. దాంట్లో కార్నర్‌లో కనిపించే త్రీ డాట్స్ పై క్లిక్ చేయండి. అక్కడ అన్ ఇన్‌స్టాల్ అప్‌డేట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అంతే, దీంతో లెటెస్ట్ అప్‌డేట్ అన్‌ఇన్‌స్టాల్ అవుతుంది. పాత సెట్టింగ్స్ వచ్చేస్తాయి."
అయితే, మీ ఫోన్లలోని ఆండ్రాయిడ్ OSకు గూగుల్ మళ్లీ అప్‌డేట్ పంపినప్పుడు.. అది ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవ్వకూడదంటే....ప్లే స్టోర్‌లోని ఫోన్ యాప్ దగ్గరకు వెళ్లి... కార్నర్‌లో కనిపిస్తున్న త్రీడాట్స్ దగ్గర క్లిక్ చేసి... ఆటో అప్‌డేట్‌ను డిసేబుల్ చేయండి. అంతే.. మీ పాత వెర్షన్ వచ్చేస్తుంది.


అసలేం జరిగింది?
చాలామంది ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ ఫోన్‌లో కాల్, డయలర్ సెట్టింగ్స్‌లో అకస్మాత్తుగా వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు.
ఈ మార్పుల గురించి సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొందరు దీనిపై అసంతృప్తినీ వ్యక్తం చేశారు.
ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు లేదా ఎవరి నుంచైనా కాల్ వస్తున్నప్పుడు ఫోన్ ఇంటర్‌ఫేస్, అంటే డిస్‌ప్లే, డిజైన్ మారినట్లు కనిపిస్తుంది. ఈ మార్పులు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తున్న ఫోన్‌లలో మాత్రమే జరిగాయి.
మొబైల్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చిన గూగుల్, ఆ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ కూడా చేస్తుంది.
'మెటీరియల్ 3D ఎక్స్‌ప్రెసివ్' అప్‌డేట్ కింద ఆండ్రాయిడ్ ఫోన్స్ కాల్ యాప్ డిజైన్‌ను మార్చినట్లు గూగుల్ తెలిపింది. ఈ అప్‌డేట్ ఫోన్ సాఫ్ట్‌వేర్ డిస్‌ప్లే వినియోగాన్ని సులభతరం చేయడంతో పాటు, మరింత వేగవంతం చేస్తుందని గూగుల్ పేర్కొంది. కొత్త డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో చాలా మారతాయని తెలిపింది.
గూగుల్ ప్రకారం, కాలింగ్ యాప్ వాడకాన్ని సులభతరం చేయడమే దీని వెనుక ఉన్న లక్ష్యం.
'రీసెంట్' (రీసెంట్ కాల్స్), 'ఫేవరెట్స్' ఆప్షన్లను 'హోమ్'లో కలిపేసింది గూగుల్. దీంతో, ఇప్పుడు మీరు ఫోన్ యాప్‌ను ఓపెన్ చేస్తే, 'హోమ్', 'కీప్యాడ్' ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ అప్‌డేట్ మొదట జూన్‌లో కొంతమంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తరువాత దశలవారీగా చాలామంది ఫోన్లకు వచ్చింది. ఇప్పటికీ కొన్ని ఫోన్లలో ఈ సెట్టింగ్స్ మారలేదు.
ఈ కొత్త మార్పులు నచ్చనివారు.. పాత డిజైన్‌ను పునరుద్ధరించుకోవచ్చని ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ తెలిపింది.
గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో ఆటో-అప్‌డేట్‌లను ఆఫ్ చేసి, ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి 'అన్‌ఇన్‌స్టాల్ అప్‌డేట్స్' ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఫోన్ కాల్ డిస్‌ప్లే సెట్టింగ్‌లు మళ్లీ పాతవి వస్తాయని వివరించింది.
కాబట్టి, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వచ్చిన మార్పులు మీకు నచ్చకపోతే ఆందోళన చెందనక్కర్లేదు. మీరు ఇప్పటికీ పాత డిస్‌ప్లేని ఇష్టపడితే, అప్‌డేట్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం ద్వారా పాత డిస్‌ప్లేకి మారొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














