రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? అతిగా తాగితే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
అలసటగా అనిపించినా లేదా చర్మం పొడిబారినట్లు అనిపించినా.. ఎక్కువ నీళ్లు తాగాలని చెబుతూ ఉంటారు. కానీ, ఈ సూచన ఎంత వరకు సరైంది?
ఎవరైనా తమతో ఎప్పుడూ ఒక బాటిల్ పట్టుకుని తిరుగుతున్నారంటే, వారు శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ నీటిని తీసుకోవడం అలవాటు చేసుకుని ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు దొరక్క ప్రజలు దాహంతో బతకాల్సిన పరిస్థితులు ఉండేవి.
కానీ, ప్రస్తుతం శరీరానికి అవసరమైన దానికంటే అత్యధికంగా ప్రజలు నీటి తీసుకునే రోజులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
దీంతో, బాటిళ్లలో నీళ్ల అమ్మకాలు కూడా పెరిగినట్లు అంచనాలున్నాయి.
అయితే, ప్రజలు ఎక్కువ నీళ్లు తాగడానికి ప్రధాన కారణం, నీరు తాగడం అత్యంత అవసరమంటూ సమాచారం వ్యాప్తిచెందడమే.
ఉదాహరణకు.. ‘‘మెరుగైన ఆరోగ్యానికి, ఎనర్జీకి, చర్మం మెరిసేందుకు నీరు ఎక్కువ తాగాలి. బరువు తగ్గాలన్నా, క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవాలన్నా నీరు ఎక్కువగా తాగడం అవసరం’’ అనే ప్రచారం వ్యాప్తి చెందింది.
నీరు ఎంత తాగాలనే దానికి సంబంధించి 8*8 నిబంధన కూడా ఎక్కువగా పాపులర్ అయింది.
ఈ నిబంధన ప్రకారం రోజులో ఎనిమిది సార్లు నీళ్లు తాగాలి. తాగిన ప్రతిసారి 240 మిల్లీలీటర్లు తాగాలన్నది ఈ నిబంధన.
ఇలా రోజంతా కలిపి రెండు లీటర్లు నీరు తాగాలి. కానీ, సైన్స్ ఈ నిబంధనకు సపోర్టు చేయడం లేదు.
రోజులో ఒక వ్యక్తి ఎంత నీరు తాగాలనే దానికి ఎందుకంత సమాచారం అస్పష్టంగా ఉంది? బహుశ, దశాబ్దాల క్రితం నుంచి రెండు అంశాల ద్వారా దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు.
ప్రతి ఒక కేలరీ ఆహారానికి ఒక మిల్లీలీటర్ ద్రవాన్ని తీసుకోవాలని 1945లో అమెరికా నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌కు చెందిన ఫుడ్, న్యూట్రిషన్ బోర్డు సూచించింది.
అంటే, ఎవరైనా రోజులో 2 వేల కేలరీల ఆహారం తీసుకుంటే, వారు రెండు వేల మిల్లీలీటర్ల లేదా రెండు లీటర్ల నీటిని తాగాలి.
కానీ, ఈ నీటిలో ఇతర ద్రవాలను కూడా కలుపుకునే చెప్పింది. పండ్లు, కూరగాయల్లో కూడా నీరు ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రోజులో ఎన్ని నీళ్లు తాగాలి?
ఎనిమిది గ్లాసులు లేదా రెండు లీటర్ల నీరు తాగడం వల్ల అవసరమైన దానికంటే శరీరం ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉంటుందని ఇటీవల ఒక పరిశోధన చెప్పింది. దానికి బదులుగా, ఒకటిన్నర నుంచి ఒక లీటరు వరకు లేదా 800 మిల్లీలీటర్ల నీటిని రోజుకు తీసుకోవాలని సూచించింది. అంటే 6 లేదా ఏడు గ్లాసులు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ అంతే.
8*8 నిబంధనను అనుసరించాల్సిన అవసరం లేకుండా, మీ శరీర ఉష్ణోగ్రత, ఆరోగ్య పరిస్థితులు, వాతావరణం పరిస్థితుకు అనుగుణంగా ఎంత నీరు తీసుకోవాలో గుర్తిస్తూ ఉండాలి. నీరు తాగడమనేది ప్రతి వ్యక్తికి మారిపోతూ ఉంటుంది.
వేడి, తేమతో కూడిన వాతావరణాల్లో, ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారు, అలాగే క్రీడాకారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఇతరుల కంటే ఎక్కువగా నీరును తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
పెద్ద వారు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని న్యూట్రిషనిస్ట్‌లు మార్గరెట్ మెక్‌విలియన్స్, ఫ్రెడెరిక్ స్టయిర్ 1974లో చెప్పారు.
దీనిలో నీరు, సాఫ్ట్ డ్రింక్స్, కూరగాయలు, పండ్లలో ఉండే నీటిని కలుపుకుని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హైడ్రేషన్ సైన్స్
నిజమే శరీరానికి నీరు అత్యంత ముఖ్యమే. శరీర బరువులో మూడింట రెండో వంతు నీటిదే.
మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను నీరు శరీరమంతా వ్యాప్తించేలా చేస్తుంది. వ్యర్థ పదార్థాలను బయటికి వెళ్లేలా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది.
శరీరం లోపల జరిగే రసాయనిక చర్యలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
మనం తీసుకున్న నీరు చాలా వరకు చెమట, మూత్రం, శ్వాస రూపంలో బయటికి వెళ్లిపోతుంటుంది. అందుకే, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా శరీరానికి సరిపడ నీటిని ఇవ్వడం అవసరం.
మనం తాగే నీరు, బయటికి వెళ్లిపోయేది సమతులంలో ఉండాలి.
శరీరంలో ఉండే నీటిలో ఒకటి నుంచి రెండు శాతం నీటిని కోల్పోతే, డీహైడ్రేషన్ లక్షణాలను మనం గుర్తించవచ్చు.
ఈ సమయంలో నీరు తీసుకోకుండా, డీహైడ్రేషన్ అలానే కొనసాగితే, అది ప్రమాదకరంగా మారుతుంది.
అయితే, గత కొన్నేళ్లుగా 8*8 నిబంధన విషయంలో చాలా నిరాధారాలను మనం నమ్ముతూ వస్తున్నాం.
‘‘శరీర మాయిశ్చరైజర్ నియంత్రించడమనేది మానవ పరిణామ క్రమం ద్వారా తెలుసుకున్న విషయం. శరీరానికి అవసరమైన మాయిశ్చరైజర్ కోసం ఎన్నో విధానాలను పాటిస్తూ ఉంటాం’’ అని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ న్యూరోసైన్స్ అండ్ ఏజింగ్ లేబరేటరీ సీనియర్ సైంటిస్ట్ ఐర్విన్ రోజెన్‌బర్గ్ చెప్పారు.
ఆరోగ్యకరమైన శరీరం, మెదడు రెండూ మన శరీరం డీహైడ్రేటెడ్ అవుతుందా లేదా? అన్నది గుర్తించగలవు. డీహైడ్రేషన్ అయినప్పుడు మాత్రమే దాహంగా అనిపిస్తుంటుంది.
నీరు అనేది ఆరోగ్యకరమైన ద్రవం. ఎందుకంటే, దీనిలో ఎలాంటి కేలరీలు ఉండవు.
కానీ, టీ, కాఫీ, ఇతర కెఫినేటెడ్ బెవరేజస్, అల్కాహాల్ బెవరేజ్‌లో స్వల్పంగా డైయురెటిక్స్ ఉంటాయి. దీని వల్ల, శరీరం మాయిశ్చర్ అయి, అంతే వేగంగా ఆ మాయిశ్చర్ బయటికి వెళ్లిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
బరువు తగ్గేందుకు ఎక్కువ నీరు తాగాలా?
నీరు తాగాలనే సంకేతాలను మన శరీరం ఇచ్చే దాని కంటే ఎక్కువగా నీటిని తాగినప్పుడు, డీహైడ్రేషన్ తప్పించుకోవడంతో పాటు అంతకు మించిన ప్రయోజనాలు ఉంటాయనడంలో ఎలాంటి ఆధారాలు లేవు.
అయితే, డీహైడ్రేషన్ బారిన పడకుండా తప్పించుకునే వారిలో ఇతర ప్రయోజనాలు ఉంటున్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
డీహైడ్రేషన్‌ను తప్పించుకునేందుకు తగిన ద్రవాలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని కొన్ని అధ్యయనాలు గుర్తించాయి.
శరీరంలో సరైన హైడ్రేషన్ వల్ల వయసు పెరిగే సంకేతాలను తగ్గించుకోవచ్చని 2023లో ఒక అధ్యయనం గుర్తించింది. గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి కూడా తప్పించుకోవచ్చని పేర్కొంది.
బరువు నియంత్రణకు శరీరంలో తగిన నీరు ఉండటం అవసరమని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రజలు తీసుకునే నీరు, బరువు నియంత్రణకు సంబంధించిన అంశంపై వర్జినియా పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్, స్టేట్ యూనివర్సిటీ హ్యుమన్ న్యూట్రిషియన్, డైట్, ఎక్సర్‌సైజు ప్రొఫెసర్ బ్రెండ డేవీ అధ్యయనం చేశారు.
తన అధ్యయనంలో రెండు గ్రూప్‌లను పరీక్షించారు. ఈ రెండు గ్రూప్‌లను మూడు నెలల పాటు ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను పాటించాలని కోరారు.
దీనిలో ఒక గ్రూప్‌కు ఆహారం తీసుకోవడానికి అర్థగంట ముందు రెండు గ్లాసుల లేదా అర లీటరు నీటిని తాగాలని చెప్పారు.
తినడానికి ముందు నీటిని తాగిన వారు ఇతర గ్రూప్‌తో పోలిస్తే ఎక్కువ బరువు తగ్గారు.
ఈ రెండు గ్రూప్‌లను రోజుకు 10 వేల అడుగుల నడవాలని చెప్పారు. నీరు మంచిగా తాగిన వారు, నడక బాగా చేయగలిగారు.
ఒకటి లేదా రెండు శాతం స్వల్ప డీహైడ్రేషన్ ప్రజలలో సాధారణమే. చాలా మంది వారు డీహైడ్రేట్ అయిన విషయాన్నే గుర్తించలేరు.
కానీ, డీహైడ్రేషన్ స్వల్పంగా ఉన్నప్పుడు కూడా మన మానసిక స్థితి, ఎనర్జీ స్థాయిలపై ప్రభావం పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
డీహైడ్రేషన్‌ను ఎలా అర్థం చేసుకోవాలి?
డీహైడ్రేషన్ అంటే మీరు తీసుకున్న నీటి కంటే ఎక్కువగా ద్రవాలను మీరు కోల్పోయారని అర్థం.
మూత్రం ముదురు పసుపు పచ్చగా రావడం, అలసటగా అనిపించడం, నోరు, పెదాలు, కళ్లు ఎండిపోవడం, రోజుకు నాలుగు సార్ల కంటే తక్కువగా మూత్రానికి వెళ్లడం వంటివి డీహైడ్రేషన్ లక్షణాలని బ్రిటన్ నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ చెప్పింది.
కానీ, ఎక్కువగా కనిపించే లక్షణం తరచూ దాహం వేయడమని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కువ నీరు తాగొచ్చా?
రోజుకు 8 గ్లాసుల నీరు తీసుకోవాలనుకోవడం కూడా మనకు మనం ఏదైనా హాని చేసుకోవడమా? అన్నది తెలుసుకోవాలి.
మనం శరీరం ఇచ్చే సంకేతాలకు మించిన నీటిని తీసుకోవడం కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు.
ఎక్కువగా ద్రవాలను తీసుకోవడం ప్రమాదకరం అవ్వొచ్చు. రక్తంలోని సోడియం పలుచబడిపోయి తగ్గిపోయేందుకు ఇది కారణం కావొచ్చు.
అయితే, ఒక క్రీడా కార్యక్రమంలో 15 మంది క్రీడాకారులు తీవ్ర హుమిడిటీ కారణంతో మరణించారు.
అప్పటి నుంచి కిప్స్ క్రీడాకారులకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. ఈ ఘటన సగం దాహమేస్తుందనే మన భావనను నమ్మకపోవడం వల్లనే జరిగిందంటారు కిప్స్.
డీహైడ్రేషన్‌ను తప్పించుకునేందుకు మన శరీరం అడిగిన దానికంటే ఎక్కువగా నీటిని తీసుకునేటప్పుడు ఆలోచించాలని కిప్స్ సూచిస్తున్నారు.
‘‘హాస్పిటల్ నర్సులు, డాక్టర్లు తీవ్ర డీహైడ్రేట్‌కు గురైన రోగులకు చికిత్స అందిస్తుంటారు. వీరు రోజుల తరబడి నీరు తాగకపోవడం వల్ల అలా జరిగి ఉంటుంది. కానీ, మారథాన్ సమయంలో డీహైడ్రేషన్‌కు గురవుతామని ఆందోళన చెందే ప్రజలతో పోలిస్తే ఇది భిన్నమైంది’’ అని చెప్పారు.
రికార్డు స్థాయిలో వేడి వాతావరణం ఉన్నప్పుడు జోహానా పకెన్హామ్ 2018లో లండన్‌లోని ఒక మారథాన్‌లో పాల్గొన్నారు.
రేసు సమయంలో ఎక్కువగా నీరు తీసుకున్నారు. దీని వల్ల ఓవర్‌హైడ్రేషన్‌కు గురయ్యారు. దీన్నే హైపోనట్రేమియా అని అంటారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.
‘‘నేను డీహైడ్రేట్ అయ్యాయని నా స్నేహితులు, భాగస్వామి భావించారు. ఒక పెద్ద గ్లాసులో నీరు ఇచ్చారు. నీరు తాగిన వెంటనే ఒక్కసారిగా కూలబడిపోయాను. నా గుండె ఆగిపోయింది. మూడు రోజుల పాటు నేను స్పృహలోనే లేను’’ అని చెప్పారు.
సరిపడా నీరు తాగాలని స్నేహితులు, మారథాన్ పోస్టర్లు సూచిస్తుంటాయని జోహానా చెప్పారు.
‘‘కానీ, కొన్ని ఎలక్ట్రోలైట్ టాబ్లెట్లను తీసుకుని, రక్తంలో సోడియం స్థాయిలో పెంచుకోవడమే నేను చేయాల్సింది. అంతకుముందు నేను కొన్ని మారథాన్లు చేశాను. ఇలా జరగలేదు. చిన్న విషయం ఎంత ప్రమాదకరమో ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను’’ అని జోహానా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత నీరు అవసరం?
చాలా మంది హైడ్రేటెడ్‌గా ఉండేందుకు, శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ నీరు తీసుకునేందుకు ఎల్లప్పుడూ వారితో ఒక బాటిల్ తీసుకెళ్తుంటారు.
వయసు పెరుగుతున్న కొద్ది సహజంగా దాహమేస్తుందనే సూచనలు ఇచ్చే మెకానిజాలు తక్కువ సెన్సిటివ్‌గా మారతాయి.
దీని వల్ల యువత కంటే ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని బ్రెండ డేవీ అన్నారు. అందుకే, హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ద్రవాలను తీసుకోవడంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందని తెలిపారు.
బస్సు, మెట్రో లేదా కారు 15 నుంచి 20 నిమిషాలు జర్నీ చేసేవారు అర లీటరు వాటర్ బాటిల్‌ను తీసుకెళ్తుంటారు. అయితే, ఈ జర్నీలో వారికంతా నీరు అవసరం పడకపోవచ్చు.
టీ, కాఫీ, పాలు, షుగర్ లేని డ్రింకులతో కలుపుకుని రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకోవాలని బ్రిటన్ వైద్య విభాగం సూచిస్తుంది.
అయితే, ఎంత నీరు తాగాలన్నది ఒక వ్యక్తి వయసు, వారి శరీరం, జెండర్, వాతావరణ పరిస్థితులు, వారు చేసే శారీరక వ్యాయామాల మీద ఆధారపడి ఉంటుందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు.
మనిషికి రోజుకు ఒకటిన్నర నుంచి ఒక లీటరు మధ్యలో లేదా 800 మిల్లీలీటర్ల వరకు నీరు అవసరం ఉంటుందని 2022లో అబెర్డీన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు.
2 లీటర్లు లేదా 8 గ్లాసుల నీటిని వారు ప్రతిపాదించడం లేదు.
ప్రజలు హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నీరు ఎంత అవసరమనే దానిపై 23 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి అధ్యయనం చేపట్టారు.
దీనిలో వేడి, తేమ వాతావరణాలు, ఎత్తయిన ప్రదేశాలలో నివసించే వారు, గర్భిణీలు, క్రీడాకారులు, పాలిచ్చే తల్లులు ఇతరులతో పోలిస్తే ఎక్కువగా నీరు తీసుకోవాలని పరిశోధకులు గుర్తించారు. ఒకే మొత్తంలో నీరు తీసుకోవాలనే విధానం అందరికీ సరైంది కాదన్నారు.
ఎలాగైతే ఆకలేసినప్పుడు లేదా అలసటకు గురైనప్పుడు మనకు తెలుస్తుందో, అలాగే దాహమేసినప్పుడు కూడా మన శరీరం సంకేతాలు ఇస్తుంది.
కావాల్సిన దాని కంటే ఎక్కువసార్లు నీరు తాగడం వల్ల కేవలం మీరు ఎక్కువగా మూత్రానికి వెళ్లడం తప్ప, అంతకుమించిన ప్రయోజనం ఉండదు.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














