ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే...

బ్లడ్ మనీ

ఫొటో సోర్స్, INDIA TODAY

ఫొటో క్యాప్షన్, అబ్దుల్ రహీమ్ పాత చిత్రం. ఇప్పడాయన వయసు 41 ఏళ్ళు

‘ది కేరళ స్టోరీ’ సినిమా ఇటీవల దూరదర్శన్‌లో ప్రసారమైంది. ఈ సినిమా ప్రసారంపై వివాదం చెలరేగింది. ఇది మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశం ఉందని కొందరు చెప్పారు.

ఈ వివాదాలు, అభిప్రాయాల సంగతి ఎలా ఉన్నా కేరళలో మాత్రం సోషల్ మీడియాలో ‘ ది రియల్ కేరళ స్టోరీ’ పేరుతో ఓ రెండు వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ రెండింటిలో ఒకటి కేరళలోని లౌకికవాదం గురించి చెబితే , మరొకటి మానవత్వానికి ఓ గొప్ప తార్కాణంగా చెబుతున్నారు.

‘ది రియల్ కేరళ స్టోరీ’ పేరుతో కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన సోషల్ మీడియా పోస్టుతో చర్చ మొదలవ్వగా, ‘ సౌదీ అరేబియాలో మరణ శిక్షపడిన ఓ వ్యక్తిని విడిపించేందుకు 34 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన వార్త ‘ది రియల్ కేరళ స్టోరీ’ పేరుతోనే వైరల్ అయింది.

‘ది కేరళ స్టోరీ’ వివాదం ఏంటి?

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ విడుదలకు ముందునుంచే వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 5వ తేదీన దూదర్శన్‌లో మరోసారి ప్రసారమైంది.

ఈ సినిమా కథ కేరళకు చెందిన నలుగురు అమ్మాయిలది. మతమార్పడి నేపథ్యంగా తెరకెక్కిన సినిమా. దీంతో ఈ సినిమా విడుదలకు ముందునుంచే వివాదాల్లో నిలిచింది. సినిమా విడుదలై చాలా రోజులైనా దీనికి సంబంధించిన వివాదం మాత్రం సద్దుమణగలేదు.

అయితే, ఈ చిత్రాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించినప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సోషల్ మీడియాలో ‘ఎక్స్’ వేదికగా వ్యతిరేకించారు.

‘‘జాతీయ టెలివిజన్ బీజేపీ ప్రచారాస్త్రంగా మారకూడదు. ఈ సినిమా ప్రదర్శన ఎన్నికల ముందు మత కల్లోలాలకు కారణమయ్యే అవకాశం ఉంది’’ అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

‘ది రియల్ కేరళ స్టోరీ’

ఓ పక్క ‘ది కేరళ స్టోరీ’ గురించిన వివాదం నడుస్తుండగానే మరోపక్క ‘ది రియల్ కేరళ స్టోరీ’ పేరుతో ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘ది రియల్ కేరళ స్టోరీ’కి సంబంధించి శశిథరూర్ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. కేరళలోని 400 ఏళ్ళనాటి పురాతన దుర్గామాత ఆలయం గురించి అందులో పేర్కొన్నారు. ‘‘ ఇది రియల్ కేరళస్టోరీకి మరో ఉదాహరణ. 400 ఏళ్ళ నాటి ఈ దుర్గామాత ఆలయాన్ని హిందువులు, ముస్లింలు సమష్టిగా అందంగా పునర్‌నిర్మించారు’’ అని తన ట్వీట్‌లో రాశారు.

ఈ ట్వీట్‌ను లక్షమందికిపైగా చూశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

అబ్దుల్ రహీమ్ కోసం ప్రచారం

‘ది రియల్ కేరళ స్టోరీ’ పేరుతో సోషల్ మీడియాలో అనేక అంశాలు కనిపించినా శనివారం నాడు వచ్చిన కథనాన్ని అనేకమంది అసలైన ‘ ది రియల్ కేరళ స్టోరీ’గా పిలుస్తున్నారు.

అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తిని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేరళీయులంరూ కలిసి కేవలం 40 రోజులలోనే 34 కోట్ల రూపాయలు పోగు చేయడం గురించిన కథనం అది.

అబ్దుల్ రహీమ్ ప్రాణాలు కాపాడటానికి ప్రారంభించిన ప్రచారాన్ని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అభినందించారు.

‘‘కొందరు ద్వేషాన్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వేళ మానవత్వాన్ని చాటడం ద్వారా కేరళ ప్రజలు తమ అస్తిత్వాన్ని మరింత విశాలం చేసుకున్నారు. సౌదీ అరేబియాలో మరణ శిక్షను ఎదుర్కొంటున్న కోళికోడ్ వాసి అబ్దుల్ రహీమ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేరళీయులందరూ కలిసి 34 కోట్ల రూపాయలు పోగు చేశారు’’ అని విజయన్ పేర్కొన్నారు.

‘‘ఒకరి ప్రాణాన్ని కాపాడి, ఓ కుటుంబం కన్నీళ్ళు తుడిచే విషయంలో కేరళ ఓ గొప్ప ఉదాహరణ ఇచ్చింది. ఇది మతోన్మాదం ధ్వంసం చేయలేని కోట లాంటి కేరళీలయు సోదర భావం. ఇది నిజమైన కేరళ కథ ( ది రియల్ కేరళ స్టోరీ)’’

కేరళ కాంగ్రెస్ పార్టీ కూడా అబ్దుల్ రహీమ్ కథను ‘ఎక్స్’లో పోస్టులో చేసింది. దానిని ‘ది రియల్ కేరళ స్టోరీ’ అని రాసింది.

‘‘ఇది కేరళ అసలైన చిత్రం. ద్వేషం చిమ్మేందుకు నిరంతరం సాగుతున్న ప్రచారానికి తిప్పికొట్టేలా మళయాళీల తిరుగులేని చైతన్యం, సహానుభూతి వారిని అగ్రస్థానంలో నిలుపుతోంది’’ అని కాంగ్రెస్ పార్టీ రాసుకొచ్చింది.

‘‘అబ్డుల్ రహీమ్ విడుదల కోసం 34 కోట్ల రూపాయలు పోగు చేశారు. రహీమ్ రియాద్ లో 18ఏళ్ళుగా జైలు శిక్షను అనుభవిస్తూ మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. కొడుకు జీవితాన్ని కాపాడుకునేందుకు తల్లి చేస్తున్న ప్రయత్నానికి వేలాదిమంది ప్రజలు మందుకు వచ్చి చేయూతనందించారు. ఈ మానవీయ ప్రయత్నానికి చేయూతనిచ్చిన అందరికీ కృతజ్ఞతలు’’.

ఎవరీ అబ్దుల్ రహీమ్?

కోల్‌కతా నుంచి వెలువడే ఆంగ్ల దినపత్రిక ‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం 41 ఏళ్ళ అబ్దుల్ రహీమ్ కోళికోడ్ వాసి. గతంలో ఆయన ఆటో రిక్షా నడుపుకునేవారు. 2006లో ఆయన రియాద్ వెళ్ళినట్టు ఇండియా టుడే వెబ్‌సైట్ లో ఉంది. హౌస్ డ్రైవింగ్ వీసాపై అక్కడకు వెళ్ళారు. దీంతోపాటుగా ఆయనకు ఓ దివ్యాంగ బాలుడిని చూసుకునే మరో ఉద్యోగం కూడా లభించింది.

ఒకరోజు ఆ బాలుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి ఆయన 18 ఏళ్ళుగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. 2012లో సౌదీ న్యాయస్థానం రహీమ్‌కు మరణశిక్ష విధించింది.

ఈలోగా మళయాళీ కమ్యూనిటీ ఆయనకు న్యాయ సహాయం అందించడానికి ప్రయత్నించింది. అలాగే, ఆయనను శిక్షనుంచి తప్పించేందుకు ‘బ్లడ్‌ మనీ’ ఇవ్వడానికి ఆ బాలుడి కుటుంబాన్ని కూడా ఒప్పించింది. మరణశిక్ష పడిన వ్యక్తి ఆ శిక్షనుంచి విముక్తి పొందడానికి బాధిత కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని బ్లడ్ మనీ అంటారు.

అంతకుముందు, అబ్దుల్ రహీమ్ మరణశిక్ష మీద అప్పీల్ చేశారు. కానీ, విచారణ కోర్టు ఆయనకు విధించిన మరణశిక్షను సమర్థించింది. (2107, 2022)

‘ది టెలిగ్రాఫ్’ రిపోర్ట్ ప్రకారం బాలుడి కుటుంబం చాలా కాలంపాటు రహీమ్ క్షమాపణలను తిరస్కరించింది. ఎట్టకేలకు 2023లో ‘బ్లడ్ మనీ’కి అంగీకరించడంతో రహీమ్ ను కాపాడేందుకు సౌదీ అరేబియాలో నివసించే కేరళ వ్యాపారి అష్రాఫ్ వెంకట్ ముందుకొచ్చారు.

‘‘బాలుడి కుటుంబం బ్లడ్ మనీని అంగీకరించి, క్షమాభిక్ష ప్రసాదించేందుకు అక్టోబర్ 16, 2023న అంగీకరించింది. ఈ లిఖితపూర్వక వాగ్దానం వల్ల రహీమ్ మరణ శిక్ష ఆరునెలలు వాయిదా పడింది’

‘ది హిందుస్తాన్ టైమ్స్’ కథనం ప్రకారం అబ్దుల్ రహీమ్ ను విడుదలచేయించడానికి 2021లో అబ్దుల్ రహీమ్ లీగల్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది.

కేరళ

ఫొటో సోర్స్, @PINARAYIVIJAYAN/X

ఫొటో క్యాప్షన్, నిర్ణీత మొత్తం కంటే వసూలైన డబ్బును మంచి పనులకు వినియోగిస్తామని కమిటీ చెప్పింది

ప్రచారం అలా మొదలైంది

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు అనుబంధంగా సౌదీలో ఉన్న ‘కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్’ కార్యదర్శి అష్రాఫ్ వెంకట్ ఇటీవల కోళికోడ్ చేరుకున్నారు. రహీమ్‌ను కాపాడేందుకు ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కేరళలో బీజేపీ సహా అన్ని రాజకీయ పక్షాల సహాయం తీసుకున్నారు.

‘సేవ్ రహీమ్ లైఫ్’ పేరుతో కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో బీజేపీ సహా అన్ని రాజకీయపక్షాలు , హిందూ, ముస్లింలు సభ్యులుగా ఉన్నారు’’ అని వెంకట్ చెప్పారు.

‘‘రహీమ్ విడుదల కోసం కావాల్సిన 34 కోట్లరూపాయల లక్ష్యాన్ని చేరుకున్నాం’’ అని శుక్రవారం వెంకట్ తెలిపారు. ఇకపై ఎవరూ డబ్బు పంపొద్దు అని కోరారు. ‘‘మేం 34.45 కోట్లు పోగు చేశాం. అవసరానికి మించిన మొత్తాన్ని ఆడిట్ చేయించి మంచి పనులకు ఉపయోగిస్తాం’’ అని చెప్పారు.

రియాద్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి రహీమ్ విడుదలకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని తెలిపారు.

‘‘డబ్బులు డిపాజిట్ చేయడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు ఉంది. అబ్దుల్ రహీమ్‌ను క్షమించేందుకు ‘బ్లడ్ మనీ’ రూపంలో ఈ డబ్బును బాధిత కుటుంబానికి అందచేస్తాం’ అని వెంకట్ చెప్పారు.

అబ్దుల్ రహీమ్ తన యజమాని కుమారుడైన 15 ఏళ్ళ బాలుడి మరణానికి సంబంధించి దోషిగా తేలాడు. అబ్దుల్ రహీమ్ ఈ కుర్రవాడిని చూసుకోవడం, అతనిని కారులో తిప్పడానికి నియమితులయ్యారు. కానీ రహీమ్ పొరపాటున ఆ బాలుడి కి శ్వాస అందించేందుకు మెడకు అమర్చిన వైద్యపరికరాన్ని కిందపడవేశారు. దీంతో ఊపిరి ఆడక ఆ బాలుడు మృతి చెందాడు.

బ్లడ్ మనీ

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, ఓ సోషల్ మీడియా యూజర్ రహీమ్ తల్లి ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఇప్పుడు ప్రశాంతంగా నిద్ర పోగలరని పేర్కొన్నారు.

‘మాటలు రావడం లేదు’

అబ్డుల్ రహీమ్‌ను కాపాడే విషయంలో సౌదీలోని కేరళ రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ముఖ్యపాత్ర పోషించింది. సురేష్ అనే వ్యక్తి కూడా చాలా సాయపడ్డారు. లీగల్ ఎయిడ్ కమిటీకి సురేష్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన కోళికోడ్‌లో మార్చి 3న ‘సేవ్ అబ్డుల్ రహీమ్’ అనే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.

ఈ ప్రచారంలో వ్యాపారవేత్తలు, బ్లాగర్లు కూడా చేరడంతో మొత్తం మీద 34 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి.

తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదంటూ రహీమ్ తల్లి పతుమ్మ చెప్పినట్టు ‘ది టెలిగ్రాఫ్’ కథనం పేర్కొంది.

‘‘ఇక్కడి ప్రజలు సహాయం వల్లనే అంత పెద్ద మొత్తాన్ని ఇంత త్వరగా వసూలు చేయగలిగారు. ఇందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’ అని ఆమె జర్నలిస్టులకు చెప్పారు.

దీనిపై అష్రాఫ్ వెంకట్ మాట్లాడుతూ రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి డబ్బు పంపే పని మొదలైందని చెప్పారు. ఈ డబ్బు వక్ఫ్, కోర్టు పర్యవేక్షణలోని బ్యాంకు ఖాతాకు పంపుతారని తెలిపారు.

ఈ డబ్బు చేరిన తరువాత అబ్డుల్ రహీమ్ విడుదల అవుతారని ఆశిస్తున్నామని, కానీ అందుకు ఎంతకాలం పడుతుందో తెలియదని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)