ఫేక్ న్యూస్: కరణ్ థాపర్ ఇంటర్వ్యూ కథనం నిజం కాదు...ప్రకటించిన బీబీసీ

బీబీసీ న్యూస్ వెబ్‌పేజ్‌లో ప్రచురితమైన కథనంలా కనిపిస్తూ, ఇటీవల ఇంటర్నెట్‌లో ప్రచారమవుతున్న ఒక ఫేక్‌న్యూస్‌పై బీబీసీ స్పందించింది.
"ఇది బీబీసీ కంటెంట్ కాదని మేము స్పష్టం చేస్తున్నాము. ఇలాంటి వార్తలను నమ్మే ముందు అవి విశ్వసనీయమైన సోర్సుల నుంచి వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి లింక్‌లు, యూఆర్ఎల్(URL)లను నిత్యం చెక్ చేసుకోవాలని మేం ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం’’ అని బీబీసీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను కరణ్ థాపర్ ప్రచారం చేస్తున్నట్లు ఈ వెబ్‌పేజ్ కథనంలో చెప్పారు.

ఈ పేజీకి సంబంధించి కరణ్ థాపర్ ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ వార్త తప్పుడు వార్త అని కరణ్ థాపర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘‘నా ప్రతిష్టకు భంగం కలిగించే ఈ పోస్ట్‌ను సదరు వెబ్‌పేజ్ నుంచి తొలగించాలి’’ అని ఆయన పోలీస్ కంప్లయింట్‌లో కోరారు.
‘‘నాకూ, సన్ టీవీకి చెందిన యాంకర్ పూజిత దేవరాజుకు మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఈ ఇంటర్వ్యూ octequiti.com అనే వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది. ‘వన్ క్లిక్ బెట్’ అనే పేరుతో డబ్బులు సంపాదించే స్కామ్ వెబ్‌సైట్‌కు మేం ఇందులో ప్రచారం చేస్తున్నట్లుగా చెప్పారు’’ అని కరణ్ థాపర్ అన్నారు.

ఫొటో సోర్స్, pujitha_devaraju/Insta
‘‘సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ కంటెంట్ తప్పుడు కంటెంట్’’ అని థాపర్ ప్రకటించారు.
‘బాధ్యతాయుతమైన పౌరుడిగా ప్రజలకు నిజాలు చెప్పడం నా బాధ్యత’ అని థాపర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నకిలీ వార్తలను ఖండిస్తున్నానని, ఇలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని థాపర్ కోరారు.
‘‘నేను ఇప్పటికే ఈ కంటెంట్‌పై ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశాను. దానితోపాటు బీబీసీ ఇండియా, సన్ టీవీకి కూడా వివరించాను. ఇలాంటి కంటెంట్‌ను తొలగించాలని ఫేస్‌బుక్‌ను కోరాను.’’ అని కరణ్ థాపర్ వెల్లడించారు.
ఇలాంటి వార్తలను చదివి నమ్మే ముందు అవి సరైనవో కావో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
బీబీసీ వెబ్‌పేజ్‌పై వార్తలా కనిపించే ఈ వార్తా కథనాన్ని ఆ వెబ్‌సైట్‌లో బ్లాక్ చేశారు.
కరణ్ థాపర్ ప్రస్తుతం ‘ది వైర్’ అనే వెబ్‌సైట్ ప్రచురించే ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
- మేడిగడ్డ బరాజ్: మొత్తం కూల్చేసి మళ్లీ కట్టాలని ప్రతిపక్షాలు ఎందుకు అంటున్నాయి, డ్యామ్ సేఫ్టీ నివేదికలో ఏముంది?
- బిగ్‌బాస్ విన్నర్, యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్... రేవ్ పార్టీలకు పాము విషాన్ని సప్లయ్ చేశారా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














