చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. మూడేళ్లలో వరుసగా రెండు ప్రపంచకప్‌లు సొంతం చేసుకున్న ‘క్రికెట్ పుట్టిల్లు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వరరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకుంది.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 5వికెట్ల తేడాతో ఓడించింది.
1992లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కూడా పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు తలపడగా.. అప్పుడు పాకిస్తాన్ జట్టు గెలుపొందింది. అప్పుడు కూడా లీగ్ దశలో భారత్, జింబాబ్వేలపై ఓడిపోయి, ఫైనల్ వరకూ వెళ్లిన పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్ చేసి, ఇంగ్లండ్‌ను కట్టడి చేసి కప్పు గెలుచుకోవడంతో.. ఇప్పుడు కూడా అదే ఫలితం రిపీట్ అవుతుందేమోనని చాలామంది అనుకున్నారు.
కానీ, ఇంగ్లండ్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించింది.
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.
పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్ 38, బాబర్ ఆజమ్ 32, షదాబ్ ఖాన్ 20, మొహమ్మద్ రిజ్వాన్ 15 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడాల్సి వచ్చింది.
ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కర్రన్ 3, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
మరొకసారి ఇంగ్లండ్‌ను కాపాడిన బెన్ స్టోక్స్

ఫొటో సోర్స్, Getty Images
138 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఏడు పరుగులకే ఓపెనర్ అలెక్స్ హేల్స్ వికెట్ కోల్పోయింది. 32 పరుగుల వద్ద ఫిల్ సాల్ట్ వికెట్, 45 పరుగుల వద్ద కెప్టెన్ జోస్ బట్లర్ వికెట్లు కోల్పోయింది.
పవర్ ప్లే 6 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ఆ తర్వాత కుదురుగా బ్యాటింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ కూడా ఔటయ్యాడు.
రన్‌రేట్ పడిపోవడంతో ఇంగ్లండ్‌కు మిగిలిన బంతులకంటే చేయాల్సిన పరుగులు ఎక్కువ అయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
2019లో ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్ ఒకపక్క తన జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుండగా.. పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్‌షా ఆఫ్రిదీ కాలి కండరాలు పట్టేయడంతో ఇబ్బందులు పడ్డాడు. ఒక దశలో బౌలింగ్ చేయడానికి కూడా ఇబ్బందులు పడి, 16వ ఓవర్‌లో ఒక బంతి మాత్రమే వేసి బాధతో పెవిలియన్ చేరాడు.
ఆ ఓవర్‌లో స్పిన్నర్ ఇఫ్తికార్ అహ్మద్ ఐదు బంతులు వేయగా.. స్టోక్స్ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టడంతో ఇంగ్లండ్ మొత్తంగా 13 పరుగులు సాధించింది.
మొహమ్మద్ వసీమ్ వేసిన 17వ ఓవర్‌లో మొయీన్ అలీ మూడు ఫోర్లు కొట్టడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి.
హరీస్ రౌఫ్ వేసిన 18వ ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
మొహమ్మద్ వసీమ్ వేసిన 19వ ఓవర్ రెండో బంతికి మొయీన్ అలీ ఔట్ అయ్యాడు.
అయితే, నాలుగో బంతికి ఫోర్ కొట్టి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్ స్టోక్స్.. చివరి బంతికి విజయలక్ష్యాన్ని పూర్తి చేశాడు.
ఇంగ్లండ్ జట్టు మరో 6 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 52 పరుగులు సాధించగా.. జోస్ బట్లర్ 26 పరుగులు, బ్రూక్ 20 పరుగులు, మొయీన్ అలీ 19 పరుగులు చేశారు.
పాక్ బౌలర్లలో రవూఫ్ 2 వికెట్లు తీయగా,, ఆఫ్రిదీ, షాదాబ్ ఖాన్, మొహమమ్మద్ వసీమ్ తలొక వికెట్ తీశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఫైనల్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును, టోర్నమెంట్‌లో 13 వికెట్లు తీసినందుకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఇంగ్లండ్ బౌలర్ శామ్ కర్రన్ అందుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇంగ్లండ్ వద్దే వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్..
క్రికెట్ పుట్టిల్లుగా భావించే ఇంగ్లండ్ దశాబ్దాల పాటు ప్రపంచకప్ గెలవలేకపోయింది. కానీ, మూడేళ్ల తేడాతో రెండు ప్రపంచకప్‌లు గెలుచుకుంది.
వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ రెండూ ఇప్పుడు ఇంగ్లండ్ వద్దే ఉన్నాయి.
2019లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ గెల్చుకున్న ఇంగ్లండ్ ఇప్పుడు టీ20 ప్రపంచకప్ కూడా ఇంటికి తీసుకెళ్తోంది.
ఇలా రెండు ప్రపంచకప్‌లను ఒకేసారి తనవద్ద పెట్టుకున్న తొలిదేశం ఇంగ్లండ్.
వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెల్చుకుని వెస్టిండీస్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో దేశంగా కూడా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది.
కాగా, ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ గెలవడం ఇది రెండోసారి. 2010లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను కూడా ఇంగ్లండ్ గెలిచింది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం ఇంగ్లండ్‌కు ఇది మూడోసారి. 2016లో భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా ఇంగ్లండ్ చేరింది. అయితే, కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
టీ20 ప్రపంచకప్ 2018లో ఎందుకు జరగలేదు?
టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటుంది.
2016లో భారత్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ తర్వాత.. ఐదేళ్లకు 2021లో యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరిగింది. మళ్లీ ఒక ఏడాది తేడాతో ఆస్ట్రేలియాలో ఇప్పుడు మరో టీ20 ప్రపంచకప్ జరిగింది.
ఎందుకంటే..
వాస్తవానికి 2018లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది.
కానీ, 2017లో చాంపియన్స్ ట్రోఫీ జరగడం, 2019లో వన్డే ప్రపంచకప్ ఉండటంతో 2018లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2020కి ఐసీసీ వాయిదా వేసింది.
కానీ, టీ20 ప్రపంచకప్ నిర్వహిద్దామనుకునే సమయానికి కరోనా మహమ్మారి వ్యాపించింది.
దీంతో మరొకసారి ఈ టోర్నీని వాయిదా వేసింది.
వెంటవెంటనే 2021లో యూఏఈ వేదికగా, 2022లో ఆస్ట్రేలియా వేదికగా రెండు టీ20 ప్రపంచకప్‌లను ఐసీసీ నిర్వహించింది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: ‘అల్లాహు అక్బర్’ అనాలంటూ తనపై దాడి చేశారని రాష్ట్రపతికి ‘లా’ కాలేజీ విద్యార్థి ఫిర్యాదు - అయిదుగురు విద్యార్థులు అరెస్ట్
- అమ్మకానికి ఊరు.. ధర రూ.2 కోట్లు.. స్పెయిన్‌లో బంపర్ ఆఫర్
- కేరళలో 32,000 మంది మహిళలు మతం మారి, ఇస్లామిక్ టెర్రరిస్టులు అయ్యారా? అదా శర్మ సినిమాపై వివాదం ఎందుకు?
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం
- విమానాశ్రయంలోనే 18 ఏళ్లు జీవించిన వ్యక్తి మృతి.. స్టీఫెన్ స్పీల్బర్గ్ ‘ది టెర్మినల్’ సినిమాకు అతడే స్ఫూర్తి
- ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలతో పర్యావరణానికి హాని ఎంత, భారీ లిథియం గనులున్న ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది?
- 650 రూపాయల ట్విటర్ బ్లూ టిక్.. ఒక కంపెనీకి ఒక్క రోజులో రూ.1.22 లక్షల కోట్లు నష్టం తెచ్చింది.. ఎలాగంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














