PAK vs ZIM-Mr.Bean: పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ తర్వాత మిస్టర్ బీన్ పేరు ఎందుకు ట్రెండ్ అవుతోంది?

ఫొటో సోర్స్, Twitter/mhanduwe0718061
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.
ఈ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా 'మిస్టర్ బీన్' పేరు ట్రెండ్ అయింది.
సోషల్ మీడియాను వాడే సామాన్య పౌరులే కాకుండా దేశాధ్యక్షులు కూడా మిస్టర్ బీన్‌పై చర్చలో భాగమయ్యారు.
పాకిస్తాన్‌ను ఓడించిన తమ జట్టును జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డెంబుజో అభినందించారు. వచ్చేసారి తమ దేశానికి నిజమైన మిస్టర్ బీన్‌ను పంపించాలని పాక్‌ను కోరుతూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ట్వీట్‌కు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ స్పందించారు.
''మా వద్ద నిజమైన మిస్టర్ బీన్ లేకపోవచ్చు. కానీ, మా క్రీడాస్ఫూర్తి నిజమైనది. మా పాకిస్తానీలకు తిరిగి నిలదొక్కుకునే ఆసక్తికరమైన అలవాటు ఒకటి ఉంది. మిస్టర్ ప్రెసిడెంట్ కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు మీ జట్టు బాగా ఆడింది'' అని ఎమర్సన్ ట్వీట్‌కు షరీఫ్ బదులు ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పాక్ ఓటమి తర్వాత మిస్టర్ బీన్ పేరు ట్రెండ్ అవ్వడానికి కారణం ఒక పాత వివాదం.
పాకిస్తాన్‌కు చెందిన ఆసిఫ్ మహమ్మద్ అనే కమెడియన్ 'మిస్టర్ బీన్' రూపంలో నటిస్తూ ఒకసారి జింబాబ్వేకు వెళ్లారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం, జింబాబ్వేకు 'మిస్టర్ బీన్' వేషంలో వెళ్లిన ఆసిఫ్ తానే నిజమైన మిస్టర్ బీన్ అంటూ అందరితో పరిచయం చేసుకున్నారు.
తర్వాత ఆయన నిజమైన మిస్టర్ బీన్ కాదని తెలియడంతో అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను 'పాకిస్తాన్ క్రికెట్' ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ట్వీట్‌కు గుగి చసురా అనే జింబాబ్వే అభిమాని స్పందించారు.
''జింబాబ్వే మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. మీరొకసారి రోవన్ అట్కిన్సన్‌కు బదులుగా ఫేక్ పాకిస్తానీ మిస్టర్ బీన్‌ను మా వద్దకు పంపించారు. రేపటి మ్యాచ్‌లో దీనికి బదులు తీర్చుకుంటాం. ఓటమి నుంచి తప్పించుకోవడానికి వర్షం కురవాలని మీరు ప్రార్థనలు చేసుకోండి'' అని చసురా ట్వీట్ చేశారు.
చసురా చెప్పినట్లే పాకిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం సాధించడంతో మిస్టర్ బీన్ పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయింది.
అసలేం జరిగిందో చెప్పాలంటూ ఒక పాకిస్తానీ అభిమాని చసురాను కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''నిజమైన మిస్టర్ బీన్‌కు బదులుగా పాక్ బీన్‌ను వారు మాకు ఇచ్చారు. మా వద్ద జరిగిన అగ్రికల్చర్ షో అనే స్థానిక కార్యక్రమంలో పాక్ బీన్ పాల్గొన్నారు'' అని చసురా సమాధానం ఇచ్చారు.
సెలెబ్రిటిగా భావించి ఆయనకు పటిష్ట పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు.
ఆ కార్యక్రమంలో మిస్టర్ బీన్ రూపంలో ఆసిఫ్ పాల్గొన్న ఫొటోలను కూడా ట్విటర్‌లో షేర్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్లు కూడా పాక్ బీన్ గురించి, జింబాబ్వే విజయం గురించి ట్వీట్ చేశారు.
భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చసురా ట్వీట్‌కు బదులు ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
''సోదరా... పాక్ బీన్ విషయంలో మీ జట్టు భలే పగ తీర్చుకుంది. గొప్ప ప్రతీకారం'' అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
మ్యాచ్‌లో పాకిస్తాన్ పరిస్థితిని ఆపాదిస్తూ నిజమైన మిస్టర్ బీన్, పాక్ బీన్ ఫొటోను ఆయన షేర్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ కూడా పాక్ బీన్ ఫొటోను షేర్ చేస్తూ జింబాబ్వేను అభినందించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించాడు.
పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీమ్ 4 వికెట్లు తీయగా, షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
అనంతరం పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులే చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.
షాన్ మసూద్ 44 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా 3 వికెట్లు దక్కించుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- విడాకుల సమయంలో భరణం తర్వాత మెయింటెనెన్స్ కూడా చెల్లించాలా? హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఈ దేశంలో వంట నూనె కూడా ‘డ్రగ్స్‌లాగా రహస్యంగా దాచిపెట్టి’ అమ్ముతున్నారు.. ఎందుకంటే..
- ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడులు’ - ఖర్జూరం పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)