విరాట్ కోహ్లీ‌పై ఫేక్ ఫీల్డింగ్ ఆరోపణలు, 5 పరుగులు పెనాల్టీగా ఇస్తే బంగ్లాదేశ్ ఇండియాపై గెలిచేదా

కోహ్లీ

ఫొటో సోర్స్, MARK BRAKE-ICC

ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ ముగిసి రెండు రోజులవుతున్నా ఇంకా వార్తల్లోనే ఉంది.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ ఒక దశలో బలమైన స్థితిలో కనిపించినా వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడిన తరువాత పరిస్థితులు మారిపోయాయి.

వర్షం తరువాత డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం 16 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు.

బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

అయితే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై చర్చ జరుగుతోంది.

బంగ్లాదేశ్ ఆటగాడు నూరుల్ హసన్ చేసిన ఆరోపణలే దీనికి కారణం.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ 24 బంతుల్లో 56 పరుగులు చేయగా నూరుల్ హసన్ కూడా 25 పరుగులు చేశాడు.

మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన నూరుల్... కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఎవరైనా ఆటగాడు ఫేక్ ఫీల్డింగ్ చేస్తే అందుకు పెనాల్టీగా ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఇవ్వొచ్చని అన్నాడు.

'వర్షం తరువాత ఫీల్డ్ తడిగా మారింది. దాంతో పాటు ఫేక్ త్రో కూడా మాకు నష్టం చేసింది. ఫేక్ త్రో వల్ల మాకు పెనాల్టీగా 5 పరుగులు వచ్చి ఉంటే ప్రయోజనం ఉండేది. కానీ, అలా జరగలేదు' అన్నాడు నూరుల్.

బంగ్లాదేశ్ బ్యాటర్

ఫొటో సోర్స్, SURJEET YADAV

ఇంతకీ ఏం జరిగింది?

నూరుల్ చెప్పిన ఈ ఘటన మ్యాచ్ ఏడో ఓవర్‌లో జరిగింది. ఆ ఓవర్‌ను అక్షర్ పటేల్ వేశాడు.

ఆ ఓవర్ రెండో బంతికి లిటన్ దాస్ షాట్ కొట్టి ఒక పరుగు పూర్తి చేసుకుని, రెండో పరుగు తీస్తున్నప్పుడు ఫీల్డర్ అర్షదీప్ బంతిని వికెట్ కీపర్ వైపు విసిరాడు. కానీ, మధ్యలో ఉన్న కోహ్లీ బంతి తనను సమీపించినప్పుడు దాన్ని అందుకోకుండానే నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరినట్లుగా ఖాళీ చేయి విసిరాడు.

అయితే, దీనివల్ల బ్యాట్స్‌మన్‌లలో ఎవరూ నష్టపోనప్పటికీ బ్యాట్స్‌మన్ దృష్టి మళ్లించినట్లయిందని నూరుల్ ఆరోపిస్తున్నాడు.

హర్ష భోగ్లే

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఫేక్ ఫీల్డింగ్ ఆరోపణలపై చర్చలోకి క్రీడా వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా ఎంటరయ్యారు.

'ఫేక్ ఫీల్డింగ్ విషయంలో వాస్తవం ఏంటంటే... దాన్ని ఎవరూ చూడలేదన్ని వాస్తవం. అంపైర్లు చూడలేదు, బ్యాటర్లు చూడలేదు, మేం చూడలేదు. ఐసీసీ నిబంధనలలోని 41.5 రూల్ ప్రకారం ఫేక్ ఫీల్డింగ్‌కు పెనాల్టీ రన్‌లు ఇవ్వొచ్చు. అయితే, అంపైర్లు దాన్ని చూసి తేల్చాలి. కానీ, ఈ ఘటనను ఎవరూ చూడలేదు. కాబట్టి ఏం చేస్తారు'' అంటూ హర్ష భోగ్లే ట్వీట్ చేశారు.

''ఫీల్డ్ తడిగా ఉందని ఎవరైనా ఫిర్యాదు చేస్తారా... పిచ్ తడిగా ఉండడం బ్యాటర్లకు అనుకూలిస్తుందని షకీబ్ చెప్పడం నిజమే. పిచ్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు మ్యాచ్ కొనసాగించడానికే అంపైర్లు, క్యురేటర్లు ప్రయత్నిస్తారు. వాళ్లు ఈ మ్యాచ్‌లో కూడా సరిగానే చేశారు. సమయమేమీ వృథాకాలేదు'' అని భోగ్లే అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఫీల్డ్ తడిగా ఉండడం, ఫేక్ ఫీల్డింగ్ వంటివి ఓటమికి కారణాలుగా చెప్పొద్దని హర్ష భోగ్లే బంగ్లాదేశ్‌కు సూచించారు.

ఎవరైనా ఒక బ్యాటర్ కుదురుకుని ఆడి ఉంటే బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచేదని ఆయన అన్నారు.

'ఇండియా గెలిచినప్పుడల్లా పొరుగువారు, మరికొందరు తమ అసంతృప్తిని చల్లార్చుకోవడానికి ఏదో ఒక కారణం వెతుకుతుంటారు. నిజానికి మైదానం తడిగా మారితే ఫీల్డింగ్ జట్టుకు కష్టం' అని ఆయన అన్నారు.

హర్ష భోగ్లే ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

బీసీసీఐ

ఫొటో సోర్స్, Mint

మరోవైపు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ఆ దేశ క్రీడాభిమానులు కూడా భారత జట్టును, బీసీసీఐని, అంపైర్లను లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేస్తున్నారు.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నుంచి ఈ దాడి మొదలైంది. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓటమి పాలైంది.

ఆ మ్యాచ్ చివరి ఓవర్లు నో బాల్ విషయం కూడా చర్చనీయమైంది.

ఆ తరువాత భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలవడంపైనా పాక్ క్రీడాభిమానులు, మాజీ ఆటగాళ్లు విమర్శలు చేశారు. పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను దెబ్బతీయడానికే భారత్ ఆ మ్యాచ్‌లో ఓటమి పాలైందన్నది వారి ఆరోపణ.

మ్యాచుల్లో అంపైర్ల పాత్రపైనా పాకిస్తాన్‌లో ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీసీసీఐ పరపతి, ఐసీసీలో బీసీసీఐకి ఉన్న పట్టు కారణంగా ఏదైనా సాధ్యమే అన్నట్లుగా పాకిస్తాన్ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

హర్ష భోగ్లీ ట్వీట్లు, వ్యాఖ్యలపైనా పాకిస్తాన్‌లో విమర్శలు వినిపిస్తున్నాయి. 'బీసీసీఐ అన్నిటినీ నియంత్రిస్తుంది.. బ్రాడ్‌కాస్టర్లను, కామెంటేటర్లను కూడా ప్రభావితం చేయగలదు' అని పాకిస్తాన్ జర్నలిస్ట్ కమ్రాన్ యూసఫ్ అన్నారు.

'అందుకే ఇండియాకు ఇబ్బంది పెట్టే ఇలాంటివాటిని బ్రాడ్‌కాస్టర్లు చూపించరు' అన్నారాయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

దీనికి హర్ష భోగ్లే సమాధానం ఇస్తూ 'మీ అజ్ఞానాన్ని నేను అర్థం చేసుకోగలను' అని ట్వీట్ చేశారు.

హ్రస్వ దృష్టి, భ్రమలతో కమ్రాన్ బాధపడుతున్నారని హర్ష భోగ్లే సమాధానమిచ్చారు. 'అదృష్టవశాత్తు పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇలాంటి ఆలోచనలు లేకపోవడం గొప్ప విషయం' అని హర్ష భోగ్లే అన్నారు.

మొత్తానికి ఈ వ్యవహారంలో కోహ్లీపై ప్రజల నుంచి రెండు రకాల అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయ.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

నజ్మస్ సాజిద్ అనే ఓ యూజర్ కోహ్లీ చేసిన పని బాగులేదని అంటూ బంగ్లాదేశ్‌కు 5 పరుగులు ఇవ్వాల్సి ఉందన్నారు.

'ది హిందూ' మాజీ చీఫ్ ఎడిటర్ ఎన్.రామ్ కూడా దీనిపై స్పందించారు. కోహ్లీ ఇలా చేయడాన్ని ఎవరైనా చూశారా లేదా అనేది ముఖ్యం కాదు. బ్యాటర్లను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రయత్నేం జరిగిందా లేదా అనేదే ప్రధానం. ఈ విషయంలో అంపైర్లు విఫలమైనట్లుగా అనిపిస్తోంది' అంటూ ట్వీట్ చేశారాయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

మరోవైపు పాకిస్తాన్ పత్రిక డాన్ దీనిపై స్పందిస్తూ వచ్చేవారం జరగనున్న ఐసీసీ బోర్డు మీటింగులో బంగ్లాదేశ్ ఈ అంశాన్ని ప్రస్తావించాలన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)