t20 world cup semi final teams 2022 : పాయింట్ల పట్టికలో టీం ఇండియా టాప్

బౌలర్ అర్షదీప్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ మీద గెలుపుతో టీం ఇండియా పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది.

గ్రూపు-2లో 4 మ్యాచుల్లో మూడు గెలిచిన టీం ఇండియా 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్ +0.730గా ఉంది. తద్వారా సెమీ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది.

ఇక దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దాని నెట్ రన్ రేట్ +2.772గా ఉంది.

భారత్ చేతిలో ఓడిపోయిన బంగ్లాదేశ్ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

ఇప్పుడు ఇండియా జట్టు జింబాబ్వే మీద గెలవడంతోపాటు పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ గెలిస్తే భారత్‌కు సెమీ ఫైనల్‌ బెర్త్ దాదాపుగా ఖాయం అవుతుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

5 పరుగుల తేడాతో టీం ఇండియా గెలుపు

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో టీం ఇండియా 5 పరుగుల తేడాతో గెలిచింది.

చివరి ఓవర్లలో బంగ్లాదేశ్ పోరాడినా గెలవ లేక పోయింది. అర్షదీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది.

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. లిట్టన్ దాస్ భారత బౌలర్ల మీద విరుచుకు పడ్డారు. 6 ఓవర్లకు ఆ జట్టు 60 పరుగులు చేసింది.

అయితే 7వ ఓవర్ వద్ద వాన రావడంతో మ్యాచ్ తాత్కాలికంగా ఆగిపోయింది. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లకు 151కి కుదించారు.

మ్యాచ్ మళ్లీ మొదలైన తరువాత బంగ్లాదేశ్ ఆ జోరును కొనసాగించలేక పోయింది.

8వ ఓవర్ రెండో బంతికే రన్ అవుట్ రూపంలో లిట్టన్ దాస్ వెను తిరిగాడు.

ఆ తరువాత బంగ్లాదేశ్ ఆట నెమ్మదించింది. భారత్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పోయారు.

24 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా 2 వికెట్ల చొప్పున తీశారు.

చివరకు 16 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే బంగ్లాదేశ్ చేయగలిగింది.

క్రికెటర్ విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ రికార్డ్

ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు.

పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే రికార్డును బద్ధలు కొట్టాడు.

మొత్తానికి ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఒక సిక్సు ఉన్నాయి.

ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీకి ఇది మూడో అర్ధ సెంచరీ.

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ

టీ20 వరల్డ్ కప్‌లో ఇంత వరకు ఓపెనర్లు పెద్దగా రాణించలేదు. కేఎల్ రాహుల్ కానీ రోహిత్ శర్మ కానీ భారీ స్కోర్లు చేయలేదు. కానీ ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ చేశాడు.

32 బంతుల్లో 50 పరుగులు చేసిన రాహుల్... 4 సిక్సులు, 3 ఫోర్లు కొట్టాడు.

కేఎల్ రాహుల్ ఫామ్ మీద విమర్శలు వినిపిస్తున్న తరుణంలో ఈ అర్ధ సెంచరీ అతనికి ఊరట కలిగించేదే.

మరొక ఓపెనర్ రోహిత్ శర్మ మరొకసారి విఫలమయ్యాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ మిస్

క్రీజులో కొద్దిసేపే ఉన్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ బంగ్లాదేశ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు.

16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి ఉంటే హ్యాట్రిక్ అయి ఉండేది. గత రెండు మ్యాచుల్లో వరుసగా సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు చేశాడు.

వీడియో క్యాప్షన్, కాకినాడ సమీపంలో లారీ డ్రైవర్ల గ్రామం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)