ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

టుటంకామన్

ఫొటో సోర్స్, Reuters

1. టుటంకామన్: 3 వేల ఏళ్ల కిందటి ఈ యువరాజు సమాధి తవ్విన పరిశోధకుడు ఎందుకు చనిపోయారు

"అన్నిచోట్లా బంగారపు మెరుపు."

మిరుమిట్లుగొలిపే నిధి నిక్షేపాలతో నిండి ఉన్న టుటంకామన్ సమాధిని మొదటిసారి చూసిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్ చెప్పిన మాటలవి.

1922 నవంబర్ 26న హోవార్డ్ కార్టర్ 3000 సంవత్సరాలుగా మూతబడి ఉన్న సమాధి తలుపు సందుల్లోంచి కొవ్వొత్తి ఎత్తి పట్టుకుని కళ్లు చిట్లించి చూశారు. పక్కనే ఆయన సహ పరిశోధకుడు లార్డ్ కార్నార్వాన్‌ ఆతృతగా నిలబడి ఉన్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Zombie: 50,000 ఏళ్ల కిందట సమాధైన ఈ వైరస్‌ మళ్లీ ఇప్పుడెలా ఉనికిలోకి వచ్చింది?

ఫొటో సోర్స్, Getty Images

2. Zombie: 50,000 ఏళ్ల కిందట సమాధైన ఈ వైరస్‌ మళ్లీ ఇప్పుడెలా ఉనికిలోకి వచ్చింది?

వేల ఏళ్ల కిందట, ఆధునిక మానవులు ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోని కాలం నాటి ప్రాచీన వైరస్‌లు కొన్ని ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటికే కరోనావైరస్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇంకా తేరుకోని మానవాళిని.. కొత్తగా బయట పడుతున్న పురాతన వైరస్‌లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

వాతావరణ మార్పు వల్ల ప్రాచీన మంచు ఫలకాలు (పెర్మాఫ్రాస్ట్) కరిగిపోతుండటం మానవాళికి సరికొత్త ముప్పుగా పరిణమించగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?

3. వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?

30 ఏళ్ల క్రితం ప్రాణాంతక హెచ్ఐవీ తమ దేశంలోనూ వ్యాపిస్తోందని భారత్ గుర్తించింది. ఆరుగురి రక్త నమూనాలను పరీక్షించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చింది.

అయితే, ఈ పరీక్షల వెనుక ఒక మహిళా శాస్త్రవేత్త ఉన్నారు. ఆమె గురించి నేటికీ పెద్దగా ఎవరికీ తెలియదు.

అది 1985 చివరి సమయం. 32 ఏళ్ల మైక్రోబయాలజిస్టు నిర్మల సెలప్పన్.. చెన్నై మెడికల్ కాలేజీలో పరిశోధన చేపట్టేందుకు ఒక అంశం కోసం చూస్తున్నారు.

అప్పుడే తన మెంటర్, ప్రొఫెసర్ సునిధి సోలోమన్ ఒక ఐడియా ఇచ్చారు. 1982లోనే అమెరికాలో హెచ్ఐవీ కేసులను ట్రాక్ చేయడం మొదలైంది.

అయితే, భారత్‌లో అధికారులు మాత్రం ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఇక్కడికి రాలేదని భావించేవారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఓడ కింది భాగంలో ఉన్న చిన్న ప్రదేశంలో ముగ్గురు కూర్చొని 11 రోజుల పాటు సముద్ర ప్రయాణం చేశారు

ఫొటో సోర్స్, SALVAMENTO MARÍTIMO DE ESPAÑA

4. బతకడం కోసం నడి సముద్రంలో మృత్యువు ముంగిట 11 రోజుల ప్రయాణం, చివరకు ఎలా బయటకు వచ్చారు?

పై ఫొటో వలసదారుల పరిస్థితికి అద్దం పడుతుంది. ముగ్గురు వ్యక్తులు, నైజీరియా నుంచి స్పెయిన్ వలస వెళ్లడానికి సముద్రంలో 11 రోజుల పాటు ఆయిల్ ట్యాంకర్ చక్రం మీద కూర్చొని ప్రమాదకర స్థితిలో ఇలా ప్రయాణించారు.

స్పెయిన్ సముద్రతీర రక్షణ శాఖ (మారిటైమ్ రెస్క్యూ) ఈ ఫొటోను విడుదల చేసింది. గ్రాన్ కనారియా ద్వీపంలోని లాస్ పల్మాస్ నౌకాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆ ముగ్గురికి సముద్ర తీర రక్షణ శాఖ సిబ్బంది సహాయం చేశారు.

ఆఫ్రికా మూలాలకు చెందిన ముగ్గురు వలసదారులు నౌక దిగువ భాగంలో ఉన్నట్లు గుర్తించిన తర్వాత వారిని రక్షించినట్లు సాల్వమెంటో, ఈఎఫ్‌ఈ ఏజెన్సీ తెలిపింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Digital Rupee

ఫొటో సోర్స్, Getty Images

5. డిజిటల్ రూపీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

డిజిటల్ రూపాయిని (ఈ-రూపీ) డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది.

మొదట రిటైల్ డిజిటల్ రూపీని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు తెలిపింది. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీ డినామినేషన్లలోనే దీన్ని కూడా జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో డిజిటల్ రూపాయి అంటే ఏంటి? అది ఎలా ఉంటుందో చూద్దాం? పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)