క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు సెప్టెంబర్ 19వ తేదీన

ఫొటో సోర్స్, PA Media
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2కు సెప్టెంబర్ 19వ తేదీ సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో అంత్యక్రియలు జరుగుతాయని బకింగ్‌హమ్ ప్యాలెస్ నిర్థరించింది.
అంత్యక్రియలకు ముందు నాలుగు రోజుల పాటు రాణి పార్థివ దేహాన్ని అంతిమ దర్శనార్థం వెస్ట్‌మినిస్టర్ హాలులో ఉంచుతారు.
బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి బుధవారం ఆమెను వెస్ట్‌మినిస్టర్ హాలుకు తీసుకెళతారు. అక్కడ ఎత్తైన వేదికపై ఆమె శవపేటికను ఉంచుతారు. ఈ వేదికను కెటాపాల్క్ అంటారు.
వెస్ట్‌మినిస్టర్ హాలులో ఆమె శవపేటికపై రాయల్ స్టాండర్డ్ జెండాను కప్పుతారు. అలాగే, ఇంపీరియల్ స్టేట్ క్రౌన్, ఆర్బ్, సెప్టర్‌లను కూడా శవపేటికతోపాటు ఉంచుతారు.
అక్కడ ప్రజలు రాణికి నివాళులు అర్పిస్తారు.
వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లోని అత్యంత పురాతన గది ఈ వెస్ట్‌మినిస్టర్ హాల్.
ఈ హాల్‌లో చివరిసారిగా 2002 రాజ కుటుంబానికి చెందిన క్వీన్ తల్లి శవపేటికను ఉంచారు. అప్పుడు 2 లక్షల మందికి పైగా ప్రజలు ఆమెకు నివాళులు అర్పించారు.

ఫొటో సోర్స్, Getty Images
అంత్యక్రియల సందర్భంగా బ్యాంకులకు సెలవుదినం
క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల సందర్భంగా సెప్టెంబర్ 19న అంటే సోమవారం బ్యాంకులను సెలవును ప్రకటించారు.
బ్రిటన్‌ను సుదీర్ఘ కాలం పాటు పాలించిన రాణి గౌరవార్థం బ్యాంకులకు సెలవును కింగ్ చార్లెస్ 3 ఆమోదించారు.
అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు
మొదట చెప్పినట్లుగా క్వీన్ అంత్యక్రియలు వెస్ట్‌మినిస్టర్ అబేలో జరుగుతాయి.
చారిత్రక ప్రాధాన్యమున్న ఈ చర్చిలోనే బ్రిటన్ రాజులు, రాణులకు పట్టాభిషేకం చేస్తారు. క్వీన్ ఎలిజబెత్ 2 వివాహం కూడా ఇదే చర్చిలో జరిగింది.
అంత్యక్రియల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలకు ఆహ్వానాలు పంపుతారు.
యూకే సీనియర్ రాజకీయవేత్తలు, మాజీ ప్రధానులు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం టీవీలో ప్రసారం అవుతుంది.
వెస్ట్‌మినిస్టర్ డీన్ డేవిడ్ హోలే ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కాంబెర్‌బరీ ఆర్చ్‌బిషప్ జస్టిన్ వెల్బీ సంతాప ప్రసంగం చేస్తారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్రకటన.. తొలిసారి టీవీల్లో ప్రసారమైన చారిత్రక కార్యక్రమం
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: రాజు చార్లెస్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించే వారసులు ఎవరు?
- రాయల్ బ్రాండింగ్: రాణి మరణంతో బ్రిటన్ కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు, పాస్‌పోర్టుల్లో వచ్చే మార్పులేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













