Man vs Horse: 29 గంటలపాటు నిద్ర లేకపోయినా.. గుర్రాల కంటే వేగంగా పరిగెత్తి రేసులో గెలిచాడు..

రికీ లైట్‌ఫూట్

ఫొటో సోర్స్, Peter Barnett/Man Versus Horse

గుర్రాల కంటే వేగంగా పరిగెత్తి ఓ రన్నర్ రేసులో విజేతగా నిలిచాడు. ‘‘మ్యాన్ వర్సెస్ హార్స్’’ పేరుతో బ్రిటన్‌లో ఈ రేసు నిర్వహించారు.

ఈ రేసులో పాల్గొనేందుకు అట్లాంటిక్ దీవులైన టెన్‌ఫైర్ నుంచి 37 ఏళ్ల రికీ లైట్‌ఫూట్ వచ్చారు. ప్రయాణం వల్ల 29 గంటలపాటు ఆయన నిద్ర పోలేదు కూడా.

1980ల నుంచీ ఏటా ఈ రేసు నిర్వహిస్తున్నారు. అయితే, గుర్రాలను ఓడించి ఇలా గెలిచిన వారిలో రికీ మూడో వ్యక్తి.

బ్రిటన్ కాల మానం ప్రకారం, శనివారం ఉదయం నాలుగు గంటలకు ఆయన వేల్స్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పోవైస్‌కు 9 గంటలకు చేరుకున్నారు. 11 గంటలకు ఈ రేసు మొదలైంది.

గీత దాటిన తర్వాత ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తుండే ఆయనకు గెలిచానో లేదో తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనుషులకు వేరే, గుర్రాలకు వేరే మార్గాలున్నాయి.

రికీ లైట్‌ఫూట్

ఫొటో సోర్స్, EquinePix Photography

ఫొటో క్యాప్షన్, రికీ లైట్‌ఫూట్

22.5 మైళ్ల(36 కి.మీ.) రేసులో వెయ్యి మంది రన్నర్లు, 50 మంది గుర్రాలపై 2.22.23. గంటలపాటు పరిగెత్తి ఆయన విజయం సాధించారు. దీంతో 3,500 పౌండ్లు (రూ.3.32 లక్షలు) నగదును ఆయన గెలిచి ఇంటికి తీసుకెళ్లారు.

‘‘ఈ రేసులో గుర్రాలపై గెలవడం చాలా గొప్పగా అనిపిస్తోంది’’ అని రేసులో గెలిచిన అనంతరం ఆయన చెప్పారు.

రికీ లైట్‌ఫూట్ (ఎడమ), కోచ్ డీన్ పెప్పెర్

ఫొటో సోర్స్, Ricky Lightfoot

ఫొటో క్యాప్షన్, రికీ లైట్‌ఫూట్ (ఎడమ), కోచ్ డీన్ పెప్పెర్

‘‘గెలిచిన వెంటనే మా పార్ట్‌నర్‌కు ఫోన్ చేశాను. గుర్రాలతో పోటీలో గెలిచానని చెప్పాను. దీంతో నువ్వు జోక్ చేస్తున్నావా? అని తను అడిగింది. లేదు.. లేదు.. అని నిజంగానే గెలిచానని చెప్పడంతో.. ఓరి దేవుడా అని తను అంది’’ అని ఆయన వివరించారు.

ఈ రేసులో గెలుస్తానని మొదట్నుంచీ తనపై తనకు నమ్మకముందని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, చీర కట్టుకుని స్కై డైవింగ్!

‘‘గుర్రానికి గట్టి పోటీ ఇవ్వగలనని మొదట్నుంచీ అనిపించింది’’ అని ఆయన చెప్పారు.

‘‘నా జీవితంలో ఎప్పుడూ గుర్రంపై స్వారీ చేయలేదు. ఒకసారి బ్లాక్‌పూల్‌లో గాడిదపైకి ఎక్కాను’’ అని ఆయన వివరించారు. ఆయన ఫైర్‌ఫైటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు.

వీడియో క్యాప్షన్, వైరల్ వీడియో: ఫుట్‌బాల్ ఆడుతున్న ఎలుగుబంట్లు

ఈ రేసులో హాయిగా రికీ విజయం సాధించారని రేస్ డైరెక్ట్ మైక్ థామస్ చెప్పారు.

2007లో చివరిసారిగా ఈ రేసులో ఒక వ్యక్తి విజయం సాధించారు. 2004లో తొలిసారి గుర్రంపై ఒక వ్యక్తి పైచేయి సాధించారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ గత రెండేళ్లపాటు ఈ రేసు నిర్వహించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.