ఏడుస్తున్నాడని పసిబిడ్డ తలను సోఫాకేసి కొట్టిచంపిన తల్లి.. అసలేం జరిగింది?

లీలాండ్స్ జేమ్స్
    • రచయిత, డంకన్ లెదర్‌డెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెంచుకుంటానని ఇంటికి తీసుకెళ్లిన 13 నెలల బాబును కిరాతకంగా హత్యచేసిన మహిళకు కోర్టు 18ఏళ్ల జైలు శిక్ష విధించింది.

13నెలల లీలాండ్స్ జేమ్స్ కోర్కిల్‌ను బ్రిటన్‌లోని కంబ్రియాకు చెందిన లారా కేజిల్ జనవరి 2021లో దత్తత తీసుకున్నారు.

ఆ పిల్లాడిని హత్య చేసినట్లు ప్రెట్సన్ క్రౌన్ కోర్టులో లారా అంగీకరించారు. బాలుడి హత్యతో లారా భర్త స్కాట్‌కు సంబంధంలేదని కోర్టు నిర్ధారించింది.

ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో నల్ల రంగు బట్టలు వేసుకున్న లారా గట్టిగా ఏడుస్తూ కనిపించారు.

లారా కేజిల్

ఫొటో సోర్స్, Cumbria Police

ఫొటో క్యాప్షన్, లారా కేజిల్

ఎందుకు హత్య చేశారు?

ఇంగ్లండ్‌లోని కాంబ్రియాలో లీలాండ్స్ జేమ్స్ జన్మించాడు. అయితే, కేర్ హోమ్‌లో జన్మించిన అతడిని పెంచేందుకు ఓ కుటుంబం ముందుకు వచ్చింది. అప్పటినుంచే అతడిని చట్టపరంగా దత్తత తీసుకునే అమ్మానాన్నలను వెతకడం మొదలుపెట్టారు.

‘‘పుట్టినప్పుడు జేమ్స్ చాలా సంతోషంగా ఉండేవాడు’’అని అతడిని మొదటి ఎనిమిది నెలలు పెంచిన షార్లెట్ డే చెప్పారు.

‘‘సరదాగా ఆడుకునేవాడు. పాటలు కూడా వినేవాడు. చుట్టూ పాక్కుంటూ ఆడుకునేవాడు’’అని షార్లెట్ వివరించారు.

‘‘కార్ సీట్‌లో పడుకోబెట్టినప్పుడు మాత్రం ఏడ్చేవాడు. ముఖ్యంగా తన భోజనానికి సమయం దగ్గరపడినప్పుడు ఏడ్చేవాడు. ఎప్పుడు ఆహారం తీసుకోవాలో తనకు బాగా తెలుసు’’అని ఆమె అన్నారు.

అయితే, క్రమంగా జేమ్స్ ఏడుపు విపరీతంగా పెరిగింది. అతడు బరువు కూడా తగ్గిపోయాడు. అతడికి పైలోరిక్ స్టెనోసిస్ వ్యాధి సోకింది. ఈ వ్యాధి సోకినవారికి చిన్న పేగు సన్నగా అవుతుంది. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాదు. తిండి తినడం కూడా కష్టం అవుతుంది.

ప్రెట్సన్ క్రౌన్ కోర్టు

ఫొటో సోర్స్, Google

ఫొటో క్యాప్షన్, ప్రెట్సన్ క్రౌన్ కోర్టు

అయితే, శస్త్రచికిత్స తర్వాత మళ్లీ అతడి ఆరోగ్యం కుదుటపడింది. అతడి ఎదుగుదలలోనూ ఎలాంటి లోపాలు లేవని షార్లెట్ వివరించారు.

మే 2020లో అతడిని దత్తత తీసుకునేందుకు ఒక కుటుంబం అంగీకరించింది.

నిజానికి 2005లో క్రిస్మస్‌నాడు కలుసుకున్నప్పుడే స్కాట్, లారా.. పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు.

కానీ, సంతాన లేమి సమస్యతో వారిని పిల్లలు పుట్టలేదు. దీంతో లారాకు కుంగుబాటు వచ్చింది. ఆమె ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితం అయ్యారు.

2019లో వీరు పిల్లలను దత్తత తీసుకోవాలని భావించారు. చాలా ప్రయత్నాల తర్వాత లీలాండ్ జేమ్స్ వీరికి కనిపించాడు.

దత్తత ప్రక్రియల్లో భాగంగా వీరు చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. శిక్షణ కూడా తీసుకున్నారు. వీరి స్నేహితులతోనూ అధికారులు మాట్లాడారు.

అదే ఏడాది జులైలో బాబును చూసేందుకు లారా దంపతులు వచ్చినప్పుడు షార్లెట్ కూడా చాలా సంతోఫడ్డారు. నెల రోజుల తర్వాత బాబును లారాకు అప్పగించారు. అప్పటికీ అతడి వయసు ఎనిమిది నెలలు మాత్రమే.

లీలాండ్స్ జేమ్స్

ఫొటో సోర్స్, CPS

‘‘దెయ్యం పిల్లాడు’’

కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత జేమ్స్ ఎక్కువగా ఏడ్చేవాడని లారా కోర్టులో చెప్పారు. అతడితో బంధం ఏర్పరుచుకునేందుకు చాలా ప్రయత్నించానని ఆమె చెప్పారు.

‘‘అతడికి మేం నచ్చలేదని అనుకుంటా’’అని స్కాట్ కోర్టులో చెప్పారు.

బాబును చూసుకునే బాధ్యత లారాపై పడింది. మరోవైపు స్కాట్ నైట్ షిఫ్టులు చేసేవారు. అయితే, పిల్లాడిపై ఫిర్యాదులు చేస్తూ భర్తకు ఆమె మెసేజ్‌లు పెట్టేవారు. ‘‘నేను వాడిని కొట్టకుండా చాలా అదుపు చేసుకుంటున్నాను. కానీ ఏదో ఒకరోజు నేను ఇక ఆపుకోలేని పరిస్థితి వస్తుంది’’అని ఆమె మేసేజ్‌లు పెట్టేవారు.

‘‘పిల్లడి చేతులు లేదా వీపుపై మేం నెమ్మదిగా కొట్టేవాళ్లం. అతడిని గాయపరచాలని మేం అనుకోలేదు. కేవలం అతడికి భయం చెప్పాలని మాత్రమే మేం భావించేవాళ్లం’’అని ఈ దంపతులు కోర్టులో చెప్పారు.

మరోవైపు బాబును ఒక రోజు దెయ్యం పిల్లాడు అని కూడా వ్యాఖ్యానించిందని స్కాట్ వివరించారు.

లారా కేజిల్

ఫొటో సోర్స్, CUMBRIA POLICE

ఈ దత్తతను పర్యవేక్షిస్తున్న సిబ్బంది కూడా పిల్లాడు, తల్లిదండ్రులు ఇమడలేకపోతున్నారని భావించేవారు.

లారాకు అసలు ఆ పిల్లాడంటే ఇష్టంలేదని ఒక యాక్టివిస్టు కోర్టులో చెప్పారు. అసలు ఆ పిల్లాడు ఏం చేసినా వారికి ఇష్టముండేది కాదని మరో యాక్టివిస్టు వివరించారు.

అయితే, బాబు మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు క్రిస్మస్ ఫోటోల్లోనూ అంతా బావున్నట్లే కనిపించారు. కానీ, పిల్లాడిపై లారా తన భర్తకు ఫిర్యాదు చేస్తూనే ఉండేది.

2021 జనవరి 6న ఆఫీస్ నుంచి వచ్చిన స్కాట్ నిద్ర పోయేందుకు ప్రయత్నించారు. అప్పటికి లారా, బాబు నిద్రపోతున్నట్లు కనిపించారు. దీంతో స్కాట్ కూడా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నిద్రలోకి జారుకున్నారు.

రెండు గంటల తర్వాత లారా ఆయన్ను నిద్ర లేపింది. ఆమె చేతుల్లో అపస్మారక స్థితిలో జేమ్స్ కనిపించాడు.

బాబు సోఫా నుంచి పడిపోయాడని, అతడు ఊపిరి తీసుకోలేకపోతున్నాడని ఆమె చెప్పింది. ఇదే విషయాన్ని ఆమె ఫర్నెస్ జనరల్ ఆసుపత్రిల్లోని డాక్టర్లకు కూడా వివరించారు. కానీ, డాక్టర్లు ఆమె చెప్పేది నమ్మలేదు. బాబు ‘‘షేకెన్ బేబీ సిండ్రోమ్’’కు గురైనట్లు వైద్యులు భావించారు. పిల్లలను బలవంతంగా, గట్టిగా ఊపినప్పుడు ఈ రుగ్మత సోకుతుంది.

వీడియో క్యాప్షన్, పాప చనిపోయిందని ఖననం చేశారు, కానీ తవ్వి చూస్తే ప్రాణంతో ఉంది

స్కానింగ్‌లో..

లారా చెప్పేదానితో సంతృప్తి చెందని వైద్యులు బాబుకు స్కానింగ్ నిర్వహించారు. దీంతో బాబు మెదడుకు గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఏడో తేదీన బాబు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

పోలీసులకు కూడా ఇదే కథను లారా చెప్పారు. అయితే, బాబు ఒక కన్నులో రక్తం గడ్డకట్టడం, వెన్నుపూస, మెడకు గాయాలైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

దీంతో అంత చిన్న బాబుకు ఇన్ని గాయాలు మామూలుగా ఊపడం వల్ల అయ్యుండకపోవచ్చని పోలీసులు భావించారు. గట్టిగా కొట్టడం వల్లే అతడు మరణించి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.

అయితే, ఈ కేసు విచారణ మొదలుకాకముందే, అనుకోకుండా బాబును గాయపరిచినట్లు లారా అంగీకరించారు. తాను కావాలని లేదా ఉద్దేశపూర్వకంగా బాబు హత్య చేయలేదని ఆమె అన్నారు.

‘‘ఎంత సేపటికీ బాబు ఏడుపు ఆపలేదు. దీంతో కోపంతో అతడి తలను సోఫాకేసి కొట్టాను’’అని ఆమె చెప్పారు.

అయితే, ఆ శబ్దం తమకు కూడా వినిపించిందని ఆమె ఇంటి పొరుగునున్న వ్యక్తులు కోర్టులో చెప్పారు.

కోర్టులో ఆమె ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేయలేదని ఆమె తరఫున న్యాయవాదులు వాదించారు. కానీ, కోర్టు వారు చెప్పినదానికి అంగీకరించలేదు. ఈ హత్యతో ఆమె భర్తకు సంబంధంలేదని కోర్టు తేల్చింది.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో ఆ జిల్లా ప్రైవేటు ఆసుపత్రుల్లో వెయ్యికి 928 మందికి సిజేరియన్లే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)