యాసిన్ మలిక్‌కు జీవితఖైదు విధించడంపై పాకిస్తాన్ ఎలా స్పందించింది

ఫొటో సోర్స్, Reuters
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మలిక్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మిలిటెంట్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చారనే ఆరోపణలపై బుధవారం కోర్టు తీర్పు వెల్లడించింది.
ఈ ఆరోపణలపై మే 19నే యాసిన్ మాలిక్‌ను కోర్టు దోషిగా నిర్ధరించిన, కోర్టు మే 25న శిక్ష ఖరారు చేస్తామని తెలిపింది.
దేశంలో తిరుగుబాటు లేవనెత్తడం, నేరపూరిత కుట్ర, మిలిటెంట్లకు నిధులు సమకూర్చడం తదితర ఆరోపణలను మలిక్‌పై మోపారు. ఈ ఆరోపణలను మాలిక్ అంగీకరించారు.
అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని భిన్న సెక్షన్ల కింద మలిక్‌ను కోర్టు దోషిగా నిర్ధరించింది. 1990ల్లో తాను ఆయుధాలు వదిలిపెట్టినట్లు మలిక్ కోర్టుకు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
యాసిన్ మలిక్‌కు రెండు వేర్వేరు కేసుల్లో జీవిత ఖైదు విధించారని ఆయన న్యాయవాది ఉమేశ్ శర్మ చెప్పారు.
దానితోపాటూ పది కేసుల్లో పదేళ్ల చొప్పున శిక్ష వేశారని, ఈ శిక్షలన్నీ కలిపే అమలు చేస్తారని తెలిపారు.
ఇవికాకుండా యాసిన్ మలిక్‌కు రూ.10 లక్షల జరిమానా కూడా విధించారని చెప్పారు.
వివిధ సెక్షన్ల కింద ఆయనకు ఈ శిక్షలు విధించారు. యాసిన్ తన శిక్ష గురించి పైకోర్టుకు అపీల్ చేసుకోవచ్చు. కానీ, తనపై నేరారోపణలపై ఆయన పైకోర్టుకు వెళ్లలేరు.
కశ్మీర్ వేర్పాటు వాద నాయకుడు యాసిన్ మలిక్‌కు జీవిత ఖైదు విధించడాన్ని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఖండించారు.
దీనిని భారత ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థకు చీకటి రోజుగా వర్ణించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘ఈరోజు భారత ప్రజాస్వామ్యం, దేశ న్యాయ వ్యవస్థకు చీకటి రోజు. యాసిన్ మలిక్‌ను భారత్ శారీరకంగా జైల్లో పెట్టవచ్చు. కానీ, ఆయన స్వాతంత్ర్య భావాలను ఎవరూ నిర్బంధించలేరు. ఒక స్వాతంత్ర్య సమరయోధుడికి జీవితఖైదు విధించడం కశ్మీరీల స్వయం నిర్ణయాధికారానికి కొత్త ప్రేరణను అందిస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Ani
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో కూడా యాసిన్ మలిక్‌కు జీవిత ఖైదు విధించడాన్ని వ్యతిరేకించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"హురియత్ నేత యాసిన్ మలిక్‌కు అన్యాయంగా శిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం కోసం కశ్మీరీల గళాన్ని భారత్ ఎప్పుడూ నొక్కేయలేదు. కశ్మీర్ సోదర, సోదరీమణులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుంది. వారి ఈ పోరాటానికి వీలైనంతవరకూ అన్ని రకాల సాయం అందిస్తుంది" అన్నారు.
దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కూడా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై గళమెత్తే వారి నోళ్లు మూయించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. యాసీన్ మలిక్‌పై మోపిన అబద్ధపు ఆరోపణలు కశ్మీర్ స్వతంత్ర పోరాటాన్ని అడ్డుకోలేవు. కశ్మీర్ నేతలకు వ్యతిరేకంగా ఈ అన్యాయమైన, అక్రమ విచారణలపై దృష్టి పెట్టాలని నేను ఐక్యరాజ్యసమితి కోరుతున్నాను" అన్నారు.
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ కూడా దీనిని తీవ్రంగా ఖండించారు. భారత్ ఆడించినట్టు ఆడే కోర్టు ఆధారాలు, సాక్ష్యాలు లేకుండానే యాసిన్ మలిక్‌కు శిక్ష విధించి, న్యాయం గొంతు నొక్కుతోందంటూ ఆరోపించారు. యాసిన్ మలిక్‌కు పాకిస్తాన్ ప్రజలందరూ అండగా నిలుస్తారని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
యాసిన్ మలిక్ కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ ఒక రోజు ముందు అంటే మంగళవారం పాక్ నేషనల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది.
యాసిన్ మలిక్‌పై భారత్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించింది.
యాసిన్ మలిక్ సహా కశ్మీర్‌లోని మిగతా రాజకీయ పార్టీల నేతలందరిపైనా భారత్‌లో నమోదైన తప్పుడు ఆరోపణలను కొట్టివేయాలని, వారికి తగిన భద్రత కల్పించేలా చూడాలని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు... అసలేం జరుగుతోంది?
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలతో పాటు 21 మంది మృతి
- వరల్డ్ థైరాయిడ్ డే: ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు, కారణాలేంటి?
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)