‘క్రిప్టో కరెన్సీ క్వీన్’: వెయ్యి కోట్లు కొల్లగొట్టింది.. కళ్లముందే ఆస్తులన్నీ అమ్మేసి పరారైంది.. ఒక్క కేసూ నమోదు చేయలేకపోయిన లండన్ పోలీసులు

ఫొటో సోర్స్, SHUTTERSTOCK / PAUL HAMPARTSOUMIAN
క్రిప్టోకరెన్సీ స్కామర్ డాక్టర్ రుజా ఇగ్నాటోవా లండన్‌లో కొనుగోలు చేసిన లగ్జరీ పెంట్హౌజ్పై జర్మనీలో జరుగుతున్న మనీ లాండరింగ్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
‘ది మిస్సింగ్ క్రిప్టోక్వీ’న్ పోడ్‌కాస్ట్‌లో జామీ బార్ట్‌లెట్, రాబ్ బైర్న్‌లు బ్రిటన్‌లోని లాయర్లు, వెల్త్ మేనేజర్‌లను డాక్టర్ రుజా ఇగ్నాటోవా తన కార్యకలాపాలకు ఎలా ఉపయోగించిందో వివరించారు. ఆమె అదృశ్యమైన తర్వాత కూడా వారి సేవలను కొనసాగించారని తెలిపారు.
కెన్సింగ్టన్‌లోని అబాట్స్ హౌజ్ అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో ఇంతకు ముందు పోర్టర్‌గా పని చేసిన జేమ్స్( అసలు పేరు కాదు) 2016లో షాపింగ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చినప్పుడు డాక్టర్ రుజా ఇగ్నాటోవాను చూసినట్టు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రుజా వెంట బల్గేరియన్ బాడీ గార్డులు ఉన్నారని చెప్పారు.
"ఈ ఇద్దరు బాడీగార్డులలో ఒక్కొక్కరి వద్ద దాదాపుగా 20 వరకు షాపింగ్ బ్యాగులు ఉండి ఉంటాయి" అని జేమ్స్ తెలిపారు.
ఖర్చుకు వెనకాడకుండా డిజైనర్ కంపెనీలు అయిన జిమ్మీ చూ, ప్రాడో, కాల్విన్ క్లైన్‌లకు చెందిన వస్తువులను డాక్టర్ రుజా ఎడాపెడా కొనేసేవారు. ఆమె నివసించే ఇల్లు నాలుగు పడకగదుల పెంట్ హౌస్ ఫ్లాట్ అని, అందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందని జేమ్స్ వివరించారు.
"ఆమె అల్మారాలో ప్రఖ్యాత ఆండీ వార్హోల్‌కు చెందిన పెయింటింగ్ కనిపించింది. కళలతో అనుబంధం ఉన్నవాడిని కావడంతో దాన్ని చూడగానే నా హృదయం చలించిపోయింది" అని జేమ్స్ తెలిపారు.
అది నటి ఎలిజబెత్ టేలర్‌కు చెందిన ఆర్ట్. రెడ్ లెనిన్‌కు చెందిన మరొక ఆర్ట్ ఫైర్ ప్లేస్ పైన వేలాడదీసి ఉంది. మైఖేల్ మోబియన్ గీసిన క్వీన్ బబుల్‌గమ్ ఆర్ట్, సోఫాకు ఎడమ వైపున ఉన్న మరొక రిసెప్షన్ రూమ్‌లో ఉంది. అందులో క్వీన్ ఎలిజబెత్ బబుల్‌గమ్‌ను ఊదుతూ ఉంటుంది.
ఈ పెంట్‌హౌజ్ ఫ్లాట్‌లో 5 లక్షల పౌండ్లు (దాదాపు 5 కోట్ల రూపాయలు) విలువ చేసే కళాఖండాలు ఉన్నాయని ప్రైవేట్ ఐ మేగజీన్ అంచనా వేసింది. వీటిని లండన్‌లోని హల్సియోన్ గ్యాలరీ నుండి కొనుగోలు చేశారు.
డాక్టర్ ఇగ్నాటోవా తన అక్రమ సంపాదనను ఎవరూ స్వాధీనం చేసుకోకుండా ఉండటానికి, ఉద్దేశపూర్వకంగానే సులభంగా తరలించగలిగే ఆస్తులుగా మారుస్తోందా అని జేమ్స్ అనుమానించారు.

సెప్టెంబర్ 17న డాక్టర్ రుజాకు సంబంధించిన జర్మన్ న్యాయవాది మార్టిన్ బ్రీడెన్‌బాచ్ మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై మున్‌స్టర్‌లో విచారణకు హాజరయ్యారు.
విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేయడానికి లండన్‌లోని ఓ సంస్థకు రెండు కోట్ల యూరోలను బదిలీ చేసిన మనీ ల్యాండరింగ్ కేసులో మార్టిన్ బ్రీడెన్‌బాచ్ నిందితులుగా ఉన్నారు.
అసలు ఉనికిలోనే లేని వన్‌కాయిన్ అనే క్రిప్టోకరెన్సీని విక్రయించిన డాక్టర్ రుజా 4 బిలియన్ యూరోల (దాదాపు 33 వేల కోట్ల రూపాయల) స్కామ్‌కు పాల్పడ్డారు. ఇందులో మరో ఇద్దరు కూడా మిలియన్ల కొద్దీ యూరోలను స్వాహా చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
2016 ఆగస్టులో యూరప్‌లోని ఓ దేశానికి చెందిన ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు వన్ కాయిన్ గురించి హెచ్చరికను జారీ చేశారు. ఇది జరగడానికి కొన్ని నెలల ముందే, 2011లో డాక్టర్ రుజాకు చెందిన ఓ మెటల్ ఫ్యాక్టరీ కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు జర్మన్ కోర్టులో నేరాన్ని అంగీకరించారు. ఈ ఫ్యాక్టరీ దివాలా తీయడంతో 150 మంది ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు.
కానీ, ఈ సంఘటన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
అమెరికా న్యాయ సంస్థ లాకే లార్డ్‌కు లండన్‌లో ఒక కార్యాలయం ఉంది. ఇందులోని లాయర్లు 2 కోట్ల యూరోల (దాదాపు 160 కోట్ల రూపాయల) బదిలీపై ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా కోర్టు కేసులో అనంతరం వెల్లడైన అంతర్గత ఈ-మెయిల్స్‌తో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
కానీ, డాక్టర్ రుజా కంపెనీలు లాకే లార్డ్ తనిఖీల్లో పాస్ అయ్యాయి. కాబట్టి, వారు ఆస్తి కొనుగోలుతోపాటూ, అక్విటైన్ గ్రూప్‌తో కలిపి కొనుగోలు చేశారు. ఇది ఒక గ్వెర్నీసే దీవిలోని కంపెనీ. సంపన్న క్లయింట్‌లకు పన్ను సంబంధిత సేవలను అందిస్తుంది.

ఫొటో సోర్స్, Google
లగ్జరీ ప్రాపర్టీ డెవలపర్లు కాండీ అండ్ కాండీ అగ్నిప్రమాదం తర్వాత ఈ పెంట్ హౌస్‌ను పునరుద్ధరించింది. అంతకుముందు ఇందులో సింగర్ డఫీ నివసించేవారు. ఈ ఎస్టేట్‌కు ఏజెంట్ నైట్ ఫ్రాంక్. అయితే, బ్రిటీష్ టాక్స్ హెవెన్ గోప్యత కారణంగా ఫ్లాట్‌ను ఎవరు కొనుగోలు చేశారన్నది బయటి ప్రపంచానికి అస్పష్టంగానే ఉంది.
ఆస్తి దస్తావేజు ప్రకారం దాని యజమాని అబాట్స్ హౌజ్ పెంట్‌హౌజ్ లిమిటెడ్.
ఇది ఓ అనామక గ్వెర్నీసే షెల్ కంపెనీ. ఇంగ్లండ్, వేల్స్‌లో ఆస్తులున్న 12 వేల కంపెనీలలో ఇది ఒకటి. అంటే డాక్టర్ రుజా పేరు యూకే డీడ్‌లో లేదా చానల్ ఐలాండ్‌లోని పబ్లిక్ రికార్డులలో కనిపించదు.
గ్వెర్నీసేలో ఇతర సంస్థలకు డైరెక్టర్ల నియామకం జరగగా, అక్విటైన్‌ను గ్వెర్నీసేలో కంపెనీ "రెసిడెంట్ ఏజెంట్"గా నమోదు చేయడానికి డాక్టర్ రుజా చేసిన దరఖాస్తుకు రెండు నెలల తర్వాత ఆమోదం వచ్చింది. రిజిస్ట్రీ పత్రాలపై పెంట్‌హౌజ్ ల్యాండ్, లాకే లార్డ్ లండన్ చిరునామా కనిపించింది.
దీంతో డాక్టర్ రుజా ఆస్తిని కొనుగోలు చేసినట్టు పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. తదనంతరం "యూకేలో వన్ కాయిన్ ఆస్తులను గుర్తించలేకపోయాం" అని మోసపోయిన పెట్టుబడిదారులకు సెప్టెంబర్ 2019లో లండన్ సిటీ పోలీసులు చెప్పారు.
అసలు నిజం రెండు నెలల తర్వాత అమెరికాలో జరిగిన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా, మాజీ లాక్ లార్డ్ ఉద్యోగి మార్క్ స్కాట్‌కు చెందిన ఈమెయిల్స్‌ను చదవడం వల్ల బయటపడింది.

ఈ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు రుజాను గుర్తుంచుకున్నారు. ఆమె 2016లో కొద్దిరోజులు మాత్రమే అక్కడ ఉన్నారని మాకు తెలిసింది.
ఆ సంవత్సరం ఆమె లండన్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఆమె 1 నైట్స్‌బ్రిడ్జ్ భవనంలో తన కార్యాలయాన్ని ప్రారంభించారు.
విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియంలో విలాసవంతమైన పార్టీతో తన 36వ పుట్టినరోజు వేడుకను కూడా జరుపుకున్నారు. యూకేలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో తన కుమార్తెను చేర్పించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, ONECOIN
కాండీ అండ్ కాండీ వివరించినట్లుగా 7 వేల చదరపు అడుగుల "అల్టిమేట్ పెంట్‌హౌస్"లో చాలా మేరకు ఖాళీగా ఉంది. డాక్టర్ రుజా 2017లో తన కెన్సింగ్టన్ పెంట్‌హౌజ్‌కి అస్సలు రాలేదు. అదే ఏడాది అక్టోబర్ 25న సోఫియా నుండి ఏథెన్స్‌కు ర్యాన్ ఎయిర్ విమానం ఎక్కారు. అనంతరం ఆమె కనిపించకుండా పోయారు.
ఫ్లాట్‌ను వెంటిలేట్ చేయడానికి ప్రతిరోజూ జేమ్స్ వెళ్లేవారు. "అదో గ్రీన్ హౌజ్‌లా ఉంది" అని ఆయన చెప్పారు. వేసవి వేడికి వెలుతురు నేరుగా పడటంతో ఖరీదైన కళాకృతులు మసకబారేలా చేశాయి. కొన్నిసార్లు సందుల్లోంచి లోపలికి వచ్చిన పావురాలను ఆయన కష్టపడి బయటకు తరిమేవారు.
అప్పుడప్పుడు వన్ కాయిన్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు అక్కడ ఉండడానికి వస్తారు. జూలై 2018లో డాక్టర్ రుజా సోదరుడు కాన్స్‌టాంటిన్ పెంట్‌హౌస్ లోపల తీసిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ఆమె అదృశ్యమైన కొన్ని నెలల తర్వాత వన్‌కాయిన్‌కు అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.

ఫొటో సోర్స్, KONSTANTIN IGNATOV
కాన్స్‌టాంటిన్ స్నేహితులు కూడా పెంట్‌హౌజ్‌కి వచ్చేవారని జేమ్స్ తెలిపారు. డాక్టర్ రుజా సెక్యూరిటీ హెడ్ ఫ్రాంక్ ష్నైడర్, ఆమె అదృశ్యమైన తర్వాత అక్కడ గడిపిన మరొక అతిథి.
కాన్స్‌టాంటిన్‌ను లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2019 మార్చి 6న అరెస్టు చేశారు. మోసానికి కుట్ర పన్నారనే అభియోగం మోపారు.
డాక్టర్ రుజా సెక్యురిటీ హెడ్, లక్సెంబర్గ్ గూఢచార సంస్థ మాజీ అధిపతి ష్నైడర్‌ను అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫ్రాన్స్‌లో నిర్బంధించారు. ఆయన అప్పగింతపై ఈ నెలలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
పెంట్‌హౌస్ అమ్మకానికి ఏర్పాట్లు చేయడానికి ష్నైడర్ ప్రయత్నిస్తున్నారని, అయితే దానిని అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోందని జేమ్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, KNIGHT FRANK
2019లో అద్దెకు ఇవ్వడానికి పెట్టిన ఫోటోల్లో, నైట్ ఫ్రాంక్‌తో పాటు, రెడ్ లెనిన్ ఆర్ట్ ఫైర్ ప్లేస్‌పైన కనిపించాయి. లిజ్ పోర్ట్రెయిట్ వాటిలో కనిపించలేదు. కానీ, తన కంపెనీలకు చెందిన టాప్ ప్రమోటర్లలో ఒకరు ఓ ప్రత్యేక ప్లేటు మీద రుజా ముఖాన్ని ముద్రించి బహుమతిగా అందజేశారు. అదంటే ఆమెకు ఆమెకు అంతగా ఇష్టం లేదు.
ఫ్లాట్ అద్దెకు ఇవ్వడానికి సిద్ధమవుతుండగా, అక్విటైన్ ప్రతినిధులు వచ్చి వెళ్లారు. ఒకరు తాళాలు మార్చారు. మరొకరు విలాసవంతమైన వస్తువులను మోసుకెళ్లారని డాక్టర్ రుజా మాజీ ఉద్యోగి మాకు చెప్పారు.
డాక్టర్ రుజా కనిపించకుండా పోయిన చాలా కాలం తర్వాత కూడా న్యాయ సంస్థ లాక్ లార్డ్ ఆమెకు సేవలను అందించింది.
2018 జూలై 12న లాకే లార్డ్ భాగస్వామి అయిన జేమ్స్ చన్నో, మాజీ ఉద్యోగి మార్క్ స్కాట్‌కు రాసిన లేఖలో డాక్టర్ రుజాకు సంబంధించి యూకేలో ఉన్న ఆస్తులను వివరించారు. ఈ లేఖను యూఎస్ ట్రయల్ కోర్టు సాక్ష్యంగా గుర్తించింది.
"యూకేలో మీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై మేము పునఃసమీక్షించుకోవడం చాలా ముఖ్యమని విశ్వసిస్తున్నాము" అని ఆయన రాశారు.
సోఫియా అడ్రస్‌లో ఉన్న డాక్టర్ రుజాను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. కానీ, డాక్టర్ రుజా ఆకస్మికంగా అదృశ్యమైన తొమ్మిది నెలల తర్వాత ఈ లేఖ రాశారు. లేఖ రాయడానికి 22 నెలల ముందే యూకే ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ పెట్టుబడులపై లండన్ పోలీసులు ఇప్పటికే వన్‌కాయిన్‌పై విచారణ చేస్తున్నట్టు హెచ్చరించారు.
గంటకు 600 పౌండ్ల (దాదాపు 60వేల రూపాయల) చొప్పున ఆయన చేయాలనుకుంటున్న పని పరిధిని నిర్దేశిస్తూ, చాన్నో, కాన్స్‌టాంటిన్, ఫ్రాంక్ ష్నైడర్‌లకు ఈ-మెయిల్ వెర్షన్‌లను కూడా పంపారు. అయితే, ఈ-మెయిల్ కమ్యూనికేషన్ "పూర్తిగా సురక్షితం కాదు" అని పేర్కొన్నారు.
లేఖలో యూకే ప్రాపర్టీలకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు లేవు. అయితే యూకే ఆస్తిని తిరిగి వాల్యూవేషన్ చేయాల్సిన అవసరం గురించి చన్నో డాక్టర్ రుజాను హెచ్చరించారు.

ఫొటో సోర్స్, AFP
లాకే లార్డ్, జేమ్స్ చన్నో చేసిన ఒక ప్రకటనలో, రుజాకు రాసిన లేఖ ప్రామాణిక రూపంలో న్యాయ సేవలను అందించే ఆఫర్ అని, లాకే లార్డ్ అమెరికన్ ప్రాసిక్యూటర్‌లకు వెల్లడించారని, ఫలితంగా డాక్టర్ రుజాకు ఎటువంటి పని జరగలేదని పేర్కొంది.
లేఖలోని ఒక ఆసక్తికరమైన లైన్ మా మూలాధారాలు మాకు ఏం చెబుతున్నాయో ధృవీకరించింది. ఇది డాక్టర్ రుజా యూకేలో కొనుగోలు చేసిన పెంట్‌హౌస్ మాత్రమే కాదు. అబాట్స్ హౌస్‌లోని అయిదో అంతస్తులో తక్కువ ఫాన్సీ టూ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ ఉందని, అక్కడ డాక్టర్ రుజా బాడీగార్డ్‌లు ఉంటారని మాజీ పోర్టర్ జేమ్స్ మాకు చెప్పారు.
యూకే రికార్డులు 11 అబాట్స్ హౌస్ యజమాని కూడా గ్వెర్నీసే షెల్ కంపెనీ అబాట్స్ ప్రాపర్టీ లిమిటెడ్ యజమాని అని, అది కూడా అక్విటైన్ చిరునామాలో నమోదైందని చూపిస్తుంది.
ఈ చిన్న ఫ్లాట్‌ను 19 లక్షల పౌండ్ల(దాదాపు 19 కోట్ల రూపాయల)కు 2016లో కొనుగోలు చేశారు. అయితే పేపర్లలో ఆమె పేరు లేదు. కానీ మాకు అందిన సమాచారం ప్రకారం ఆ కొనుగోలు వెనుక డాక్టర్ రుజా ఉంది.
డాక్టర్ రుజాతో నడిపిన వ్యవహారాల గురించి బీబీసీ అడిగిన ప్రశ్నకు, అక్విటైన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

ఆమె అదృశ్యమైన తర్వాత, 11 అబాట్స్ హౌజ్‌లో ఇతర కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఇంటిని ఒక సీక్రెట్ స్టోరేజ్‌లా వినియోగించినట్టు కనిపిస్తోంది. మాకు అందిన సమాచారం ప్రకారం.. ఒకానొక సమయంలో ఇక్కడ రెండు భారీ సీక్రెట్ స్టోరేజ్‌లు ఉపయోగించారు.
పెంట్‌హౌజ్‌ను అద్దెకు ఇవ్వకముందు, అక్విటైన్ ఉద్యోగి సాయంతో ఆమె సిబ్బంది పెంట్‌హౌజ్ నుండి హడావిడిగా విలువైన వస్తువులకు ఇక్కడి నుంచి తొలగించారని మాకు తెలిసింది.
డాక్టర్ రుజా విలాసవంతమైన బట్టలు, ఆభరణాలు, బూట్లు, ఆమె కళాఖండాలు ఎక్కడికి వెళ్లాయి అనేది మిస్టరీగా మిగిలిపోయింది.
ఒక మాజీ ఉద్యోగి ఆమె లౌబౌటిన్ బూట్లు బహుశా ఒక స్వచ్ఛంద సంస్థకు వెళ్లి ఉండవచ్చని, కానీ, ఆమె ఆస్తులన్నింటిని లెక్కించలేదని మాకు చెప్పారు. గ్వెర్నీసేలో మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.
వన్‌కాయిన్ స్కామ్‌లో లక్షలాది మంది బాధితులకు లండన్‌లోని ఆస్తుల ఉనికి అనేది అత్యంత ఆసక్తికరమైన వార్త. వారు డాక్టర్ రుజా ఆస్తులను విక్రయించాలని, పెట్టుబడిదారులకు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
అయినప్పటికీ, సంక్లిష్ట యాజమాన్య నిర్మాణాలు-గ్వెర్నీసే షెల్ కంపెనీలు ప్రారంభం మాత్రమే కావచ్చు. వీటికి డాక్టర్ రుజా చట్టపరమైన యజమాని అని నిరూపించడం కష్టం.
పాండోరా పత్రాల నేపథ్యంలో, ఆఫ్‌షోర్ ఆస్తులు కలిగివున్న యజమానులతో రిజిస్ట్రేషన్ చేయించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనిపై యూకే ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ విఫలమైంది.
ఎంపీల ఒత్తిడి తర్వాత, 2019లో గ్వెర్నీసే, ఇతర క్రౌన్ డిపెండెన్సీలు తమ అధికార పరిధిలోని కంపెనీల యజమానులను పబ్లిక్ చేయడానికి కట్టుబడ్డాయి. కానీ 2023 వరకూ ఈ నిర్ణయం అమల్లోకి రాదు.
డాక్టర్ రుజా లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు బ్రిటీష్‌కు చెందిన న్యాయవాదులు, ఆఫ్‌షోర్ వెల్త్ మేనేజర్లు, ఎస్టేట్ ఏజెంట్లు ప్రమేయం ఉందనే వార్తలు రావడంతో తమ కోపం కట్టలు తెంచుకుందని బాధితుల ప్రచారకర్త జెన్ మెక్‌ఆడమ్ చెప్పారు.
"కచ్చితంగా వన్ కాయిన్ బాధితుల డబ్బుతో ఈ ఆస్తులను కొనుగోలు చేశారు. గత ఐదేళ్లుగా ఊహించలేని మానసిక వేదన, అపారమైన ఆర్థిక నష్టాన్ని బాధితులు ఎదుర్కొంటున్నారు" అని ఆమె చెప్పారు.
"కంపెనీలు తమ ప్రమేయం గురించి మౌనంగా ఉండటానికి ఇది సమయం కాదు. ఇప్పుడు ఓపెన్‌గా, పారదర్శకంగా, నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. మాకు సమాధానాలు కావాలి".
ఒక్క యూకేలోనే పెట్టుబడిదారులు 10 కోట్ల పౌండ్ల (దాదాపు 1000 కోట్ల రూపాయల) కంటే ఎక్కువ నష్టపోయారని బీబీసీ అంచనా వేసింది.
2019 సెప్టెంబర్‌లో ఎలాంటి కేసులు పెట్టకుండానే వన్ కాయిన్‌పై దర్యాప్తును ముగించినందుకు లండన్ పోలీసులపై జెన్ మెక్ ఆడమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"విదేశీ విచారణ అధికారులకు, వారి పరిశోధనలకు సంబంధించి మా వంతు సాయం కొనసాగుతుంది. మాతో మాట్లాడిన పెట్టుబడిదారులకు సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించమని మేం సూచించాం" అని ఓ పోలీసు ప్రతినిధి అన్నారు.
కాన్స్‌టాంటిన్ ప్రాపర్టీలను కొనుగోలు చేయడానికి రుజాకు సహకరించిన జేమ్స్ చన్నో, లాక్ లార్డ్ తరఫు న్యాయవాదులు వన్ కాయిన్ తన క్లయింట్స్‌లో ఎన్నడూ లేదని చెప్పారు.
వన్ కాయిన్ కోసం పని చేసిన మార్క్ స్కాట్, లాక్ లార్డ్ తరపున పని చేయలేదని, అతను కంపెనీని విడిచిపెట్టిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మనీలాండరింగ్ అభియోగాలు మోపే వరకు కంపెనీకి దాని గురించి తెలియదని పేర్కొంది.
"ఆర్థిక లావాదేవీలను నిర్వహించేటప్పుడు ఎప్పుడూ చట్టానికి కట్టుబడి బాధ్యతతో ఉంటాము. అవసరమైనచోట సంబంధిత అధికారులను సంప్రదిస్తాము" అని ఎస్టేట్ ఏజెంట్ నైట్ ఫ్రాంక్ బీబీసీతో అన్నారు.
డాక్టర్ రుజా జర్మన్ న్యాయవాది మార్టిన్ బ్రీడెన్‌బాచ్ మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలను ఖండించారు. అతనిపై విచారణ మే నాటికి ముగుస్తుందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, KNIGHT FRANK
ఇవి కూడా చదవండి:
- కాలుష్యం, పెట్రోల్ ధరల వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయా?
- ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్, నవీన్ పట్నాయక్ ఏం చర్చించారంటే..
- వారణాసి: మోక్షానికే కాదు, శాకాహార భోజన ప్రియులకు కూడా స్వర్గధామంగా మారిన ప్రాచీన నగరం
- స్వస్తిక: హిట్లర్ హిందూ మత చిహ్నాన్ని తన పార్టీ గుర్తుగా ఎందుకు ఎంచుకున్నారు?
- పద్మశ్రీ హరెకల హజబ్బ: పండ్లు అమ్ముకునే నిరక్షరాస్యుడు.. స్కూలు నిర్మించి, విద్యను అందిస్తున్నాడు
- వరి పండించడం వల్ల పర్యావరణానికి ప్రమాదమా
- చైనా ఎడారిలో అమెరికా యుద్ధనౌకలను పోలిన నిర్మాణాలు, ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













