పద్మశ్రీ హరెకల హజబ్బ: పండ్లు అమ్ముకునే నిరక్షరాస్యుడు.. స్కూలు నిర్మించి, విద్యను అందిస్తున్నాడు

ఫొటో సోర్స్, pib
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డులతో సత్కరించారు.
2020 సంవత్సరానికి 119 మంది ప్రముఖులు పద్మ పురస్కారాలు అందుకున్నారు. వీరిలో ఏడుగురికి పద్మవిభూషణ్, పది మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ లభించాయి.
పద్మ అవార్డుల వేడుక ఈసారీ రెండు రోజులపాటు జరుగుతోంది. మంగళవారం 2021 సంవత్సరానికి గాను 141 మందికి పద్మ పురస్కారాలు ఇచ్చారు.
గణతంత్రదినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా జనవరి 25న పద్మ అవార్డులు ప్రకటిస్తారు. వీటిని ఏప్రిల్లో ఇస్తారు.
కానీ, కరోనా మహమ్మారి వల్ల 2020, 2021లో పద్మ పురస్కారాలను సకాలంలో అందించడం కుదరలేదు. అందుకే, 2020, 2021 రెండేళ్ల పద్మ అవార్డు గ్రహీతలకు ఈసారి రెండు రోజులపాటు ఈ పురస్కారాలను అందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సోమవారం 2020 సంవత్సరానికి పద్మ అవార్డులు అందుకున్న వారిలో చాలా మంది నిరాడంబర నేపథ్యం ఉన్నావారే.
కానీ, వారి ధైర్యం, చేసిన కృషి వారిని అసాధారణ వ్యక్తుల వరుసలో నిలిపాయి. అలాంటివారిలో పద్మశ్రీ అందుకున్న కర్ణాటకకు చెందిన హరెకల హజబ్బ ఒకరు.
నిరక్షరాస్యుడైనా, విద్య ప్రాముఖ్యం తెలుసుకున్న హరెకల హజబ్బ తను జమ చేసిన మొత్తంతో బెంగళూరు సమీపంలోని తమ గ్రామంలో 2000 సంవత్సరంలో ఒక స్కూల్ ప్రారంభించారు.
పద్మశ్రీ అందుకున్న తర్వాత, సోమవారం సోషల్ మీడియాలో ఆయన గురించి జోరుగా చర్చ జరిగింది. ఆయన గొప్ప ఆలోచనలు, కృషి గురించి.. తమ ఊళ్లో పిల్లలు చదువుకోడానికి ఆయన చేసిన పోరాటాన్ని ప్రశంసించారు.
‘కాళ్లకు చెప్పుల్లేవు, ముఖంలో భావోద్వేగాల్లేవు.. కానీ, చేతిలో పద్మశ్రీ ఉంది’ అని అభినవ్ పాండే అనే ఒక యూజర్ ట్వీట్ చేశారు.
పండ్లు అమ్ముకుని జీవించే హరెకల హజబ్బ స్కూల్ నిర్మించి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడంపై 9 ఏళ్ల క్రితమే బీబీసీ హిందీ ఈ కింది కథనం ప్రచురించింది.

ఫొటో సోర్స్, AHMED ANWAR
పండ్లు అమ్ముతూ ఎంతోమందికి విద్యాదానం
కర్ణాటకలో ఒక పేద నిరక్షరాస్యుడు, పండ్లు అమ్ముకుంటూ జీవించే హరెకల హజబ్బ తన దగ్గర ఉన్న పరిమిత వనరులతోనే చేసిన కృషిని, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నో సంస్థలు కలిసి కూడా చేయలేకపోయాయి.
హరెకల హజబ్బ పండ్లు అమ్మే తన చిన్న దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతో తమ గ్రామంలో పిల్లల కోసం ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రారంభించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలోని న్యూపాడ్పు గ్రామంలో రోడ్లు ఘోరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా బురద కనిపిస్తోంది. కానీ స్కూలుకు వెళ్లడానికి సిద్ధమైన 130 మంది పిల్లలకు అది పెద్ద సమస్యగా అనిపించడం లేదు.
2000 వరకూ ఈ గ్రామంలో ఒక్క స్కూల్ కూడా లేదు. కానీ, రోజుకు 150 రూపాయలు సంపాదించే హరెకల హజబ్బ తను పోగు చేసిన మొత్తంతో తమ ఊళ్లో మొదటి స్కూల్ నిర్మించారు. దీన్ని ప్రస్తుతం దక్షిణ కన్నడ జిల్లా పరిషత్ హైస్కూల్ పేరుతో పిలుస్తున్నారు.
స్కూల్ తెరవడానికి ప్రేరణ
అసలు స్కూల్ ప్రారంభించాలని ఆయనకు ప్రేరణ ఎక్కడ నుంచి లభించింది అనే ప్రశ్నకు హజబ్బే సమాధానం ఇచ్చారు.
"ఒకసారి ఒక విదేశీయుడు నన్ను ఒక పండును ఇంగ్లిష్‌లో అడిగాడు. అప్పుడే నేను నిరక్షరాస్యుడిని అని నాకు అర్థమైంది. ఆయన అడిగిన దానికి అర్థమేంటో నాకు తెలీలేదు. దాంతో, మన ఊళ్లో పిల్లలకు నాలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకుండా ఉండాలంటే, మన గ్రామంలో కూడా ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలని నేను అనుకున్నాను" అని 55(ఇప్పుడు 64) ఏళ్ల హజబ్బ చెప్పారు.
హజబ్బ ప్రయత్నానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. కానీ, ఆయన వాటికి పొంగిపోకుండా తను ప్రారంభించిన దానిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అనుకున్నారు.
2000లో హజబ్బ ఈ స్కూల్ ప్రారంభించినప్పుడు.. ఆయనకు ఎలాంటి సహకారం లభించలేదు. అయినా, ఆయన వెనక్కు తగ్గకుండా స్థానిక మసీదు పక్కనే ఉన్న ఒక మదరసాలో స్కూల్ ప్రారంభించారు. 28 మంది పిల్లలకు చదువు చెప్పించే ప్రయత్నం చేశారు.

ఫొటో సోర్స్, padmaawards.gov.in
ప్రభుత్వ సాయం
మొదట స్థానిక మసీదు పక్కన మదరసాలో ప్రారంభమైన స్కూలు కోసం మెల్లగా ఒక భవనం నిర్మించారు.
స్కూల్లో పిల్లల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆయనకు మరింత స్థలం అవసరం అనిపించింది. దాంతో ఆయన రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తను పోగు చేసిన డబ్బుతోనే స్కూల్ భవనం నిర్మాణం ప్రారంభించారు. హజబ్బ ప్రయత్నం చూసిన చాలా మంది ఆయనకు సాయం అందించారు. అండగా నిలిచారు.
భారత గణాంకాల ప్రకారం దేశంలో 25 శాతం జనాభా నిరక్షరాస్యులే. చాలా మంది పిల్లలు తమ గ్రామాల్లో స్కూలు లేకపోవడం వల్ల చదువుకోలేకపోతున్నారు.
ఒక స్థానిక పత్రికలో హజబ్బ ప్రయత్నాల గురించి వార్త రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు లక్ష రూపాయల సాయం అందించింది.
"నాకు ప్రభుత్వం తరఫున ఒక అవార్డు ఇచ్చారు. లక్ష రూపాయల నగదు ఇచ్చారు. ఆ తర్వాత జనం కూడా నాకు డబ్బు పంపించడం మొదలుపెట్టారు" అని హజబ్బ చెప్పారు.
అప్పటి నుంచి ఆయనకు ఎంతోమంది సాయం అందించారు. ఆయనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అందరూ ఇప్పుడు ఆయన్ను సమాజంలో ఒక హీరోలా చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సవ్యసాచి: ‘ఇది కండోమ్ ప్రకటనా? నగల ప్రకటనా?’- ఈ బ్రాండ్‌ను ఎందుకు నిషేధించమంటున్నారు
- వాట్సాప్ స్కాములతో జాగ్రత్త
- ‘పాతాళానికి ద్వారాలు’.. భారతదేశంలో మెట్ల బావులు
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పళ్లు ఎంతసేపు తోముకోవాలి? రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సముద్రం మింగేస్తుందా
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










