స్కూల్‌లో విద్యార్థులు తగ్గారు.. 15 గొర్రెల్ని విద్యార్థులుగా చేర్చారు

గొర్రెలు

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పాఠశాలలను మూసివేస్తామని ప్రభుత్వాలు హెచ్చరించడం, మూసేయడం తెలుగు రాష్ట్రాల్లో చాలాసార్లు జరిగింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరసనలు, ఆందోళనలు చేస్తుంటారు.

అయితే, ఇలా పాఠశాలలు మూసివేయడం భారత్‌లోనే కాదు, ఫ్రాన్స్‌లోనూ ఉంది.

ఇక్కడి ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో ఉన్న 'క్రెట్స్ ఎన్ బెల్లెడొన్నే' అనే పట్టణంలోని పాఠశాలలో ఇంతకు ముందు 11వ తరగతిలో 266 మంది విద్యార్థులు ఉండగా, ఇటీవల ఆ సంఖ్య 261కి తగ్గింది.

విద్యార్థుల సంఖ్య పడిపోయిందంటూ ఆ పాఠశాలలో 11వ తరగతిని ఎత్తివేస్తామని అధికారులు తాజాగా చెప్పారు.

అందుకు నిరసన వ్యక్తం చేస్తూ మైఖేల్ గిరెర్డ్ అనే రైతు తన 15 గొర్రెలను తోలుకెళ్లి ఆ పాఠశాలలో చేర్పించారు.

వాటికి బా-బెటె, డాల్లీ, షావున్... లాంటి పేర్లు పెట్టి స్కూలు రికార్డుల్లో నమోదు చేయించారు.

Presentational grey line
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

Presentational grey line

ఈ గొర్రెల అడ్మిషన్‌ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దానికి 200 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు స్థానిక మేయర్ కూడా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ గొర్రెలకు జనన ధ్రువీకరణ పత్రాలు కూడా ఇచ్చి మేయర్ ప్రభుత్వానికి తన నిరసనను తెలియజేశారు.

క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను, సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం విద్యార్థుల సంఖ్యను సాకుగా చూపించి తరగతులను ఎత్తేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని మేయర్ గాయెల్లే లావల్ అన్నారు.

"మేము గొర్రెలం కాదు" అంటూ ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నినదించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)