ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశంలో వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్ ఏం చర్చించారంటే.. - BBC Newsreel

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒడిశాలో పర్యటించారు. భువనేశ్వర్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటి అయ్యారు. దానికి ముందు భువనేశ్వర్ లోని తెలుగు అసోసియేషన్ ప్రతినిధుల బృందంసీఎం జగన్‌ని కలిసింది.
ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం కొనసాగించేందుకు ఉమ్మడిగా కృషిచేయాలని ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయించారు. దానికి అనుగుణంగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కీలక సమస్యల మీద చర్చించినట్టు ఈ ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల ఉమ్మడి సమస్యల సాధనకు ఆంధ్రా, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో సరిహద్దుల్లో కొటియా గ్రామాల సమస్య, నేరడి బ్యారేజ్, జంఝావతి రిజర్వాయర్ తోపాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించారు.
బహుదా నదికి నీటి విడుదలతో పాటుగా ఎగువ సీలేరు, బలిమెల వద్ద విద్యుత్ ఉత్పాదనకి అనుమతుల విషయం కూడా చర్చకు వచ్చింది. సామరస్యపూర్వక సమావేశంలో ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
శ్రీకాకుళంలోని అంబేద్కర్ యూనివర్సిటీ, బరంపురంలోని యూనివర్సిటీల్లో తెలుగు,ఒడియా భాషల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సరిహద్దు జిల్లాల్లో రెండు భాషల బోధనలో సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
అలాగే, సరిహద్దుల్లో మావోయిస్టుల సమస్య గురించి కూడా చర్చించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
విజయవాడ నుంచి తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వెళ్లిన సీఎం జగన్ అక్కడ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కి హాజరయ్యారు.
ఆ తర్వాత విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ వెళ్లారు. నవీన్ పట్నాయక్‌తో భేటి తర్వాత ఆయన తిరిగి విజయవాడ పయనమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ నేత మురళీధరరావు : నా ఒక జేబులో బ్రాహ్మణులు, మరో జేబులో బనియాలు ఉన్నారు
బీజేపీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్ పి.మురళీధరరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ బ్రాహ్మణులు, బనియాలు తన జేబులో ఉన్నారన్నారు.
ఆయన అలాంటి ప్రకటన చేసినందుకు, వారిని క్షమాపణ కోరాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కానీ, మురళీధరరావు మాత్రం తన వ్యాఖ్యలను వక్రీకరించారని అంటున్నారు.
ఓటు బ్యాంకు కోసం కాకుండా విద్య, ఉపాధి విషయంలో తమ ప్రభుత్వం దళితులు, ఆదివాసీల మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని భోపాల్‌లో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మురళీధరరావు అన్నారు.
"బీజేపీని బ్రాహ్మణ-బనియా పార్టీ అంటారు, మీ పార్టీ నినాదం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అయినప్పుడు, ఆ దిశగా ఎంత అభివృద్ధి జరిగింది అనేదానిపై చర్చ జరగాలి. అయితే మీరు మాత్రం ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేక దృష్టి పెడతాం అంటున్నారు" అని ఒక విలేఖరి ప్రశ్నించినపుడు ఆయన ఈ సమాధానం చెప్పారు.
తన కుర్తా జేబు వైపు చూపించిన మురళీధరరావు "బ్రాహ్మణులు, బనియాలు నా జేబులో ఉన్నారు. మా కార్యకర్తల్లో, ఓటు బ్యాంకులో ఆ వర్గాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు(మీడియా) మమ్మల్ని బ్రాహ్మణ, బనియా పార్టీ అంటున్నారు" అన్నారు.
"సమాజంలోని అన్ని వర్గాల విశ్వాసం గెలుచుకునే దిశగా బీజేపీ పనిచేస్తోంది" అని ఆయన అన్నారు.
మురళీధరరావు ఈ ప్రకటనపై కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ట్వీట్ చేశారు. బ్రాహ్మణ, బనియా వర్గాలను ఆయన క్షమాపణలు అడగాలని డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంతో పనిచేసే బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్ మా ఒక జేబులో బనియాలు, మరో జేబులో బ్రాహ్మణులు ఉన్నారని అన్నారు. ఇది ఆ వర్గాలవారిని ఘోరంగా అవమానించినట్లే. ఈ వర్గాలు తమ సొంతం అన్నట్లు, తన జేబులో ఉన్నట్టు బీజేపీ చెబుతోంది" అన్నారు.
"ఏ వర్గాల నేతలు బీజేపీని నిలబెట్టడానికి కీలక పాత్ర పోషించారో, అలాంటి వారికి ఏం గౌరవం ఇస్తున్నారు. బీజేపీ నేతలు అధికారం మత్తులో, అహంకారంలో చిక్కుకుపోయారు. ఇది మొత్తం బనియా, బ్రాహ్మణ వర్గాలనే అవమానం. బీజేపీ నాయకత్వం తక్షణం ఈ వర్గాలకు క్షమాపణ చెప్పాలి" అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Ani
భోపాల్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నలుగురు శిశువులు మృతి
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు శిశువులు మృతిచెందారు.
ఆ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ దీనిని ధ్రువీకరించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆస్పత్రి మూడో అంతస్తులో ఐసీయూలు ఉన్న ప్రాంతంలో మంటలు అంటుకున్నట్లు ఒక అధికారి చెప్పారు.
ఆస్పత్రిలో పొగ నిండిపోవడంతో తల్లిదండ్రులు తమ శిశువులను కాపాడుకోడానికి పరుగులు తీయడం కనిపించింది.
ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటో ఇంకా తెలీలేదని, అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగుండవచ్చని అధికారులు చెబుతున్నారు.
సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో ఆస్పత్రి అంతా చీకట్లు అలుముకున్నాయి.
ఐసీయూలో ఉన్న తమ పిల్లల్ని కాపాడుకోడానికి వెళ్లకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వారితో గొడవపడడం కూడా దృశ్యాల్లో కనిపిస్తోంది.
మూడు గంటలు శ్రమించిన అగ్ని మాపక శాఖ సిబ్బంది ఈ మంటలు అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్‌తో వల్ల మంటలు చెలరేగడం వల్ల స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌లోని నలుగురు శిశువులు చనిపోయారని మంత్రి విశ్వాస్ సారంగ్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"అగ్ని ప్రమాదం గురించి తెలీగానే మేం వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. వార్డులో చాలా చీకటిగా ఉంది. అక్కడి శిశువులను వేరే వార్డులోకి షిఫ్ట్ చేశాం. వార్డులో మొత్తం 40 మంది శిశువుల్లో 36 మంది సురక్షితంగా ఉన్నారు. చనిపోయిన శిశువుల ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం" అని తెలిపారు.
ఈ ఘటన చాలా విషాదకరమని, దీనికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత కమల్‌నాథ్ డిమాండ్ చేశారు.
ఆస్పత్రుల్లో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
కొన్ని రోజుల క్రితమే మహారాష్ట్రలోని ఒక ఆస్పత్రిలో కోవిడ్ ఐసీయూలో మంటలు చెలరేగడంతో 11 మంది రోగులు మృతి చెందారు.
ఇవి కూడా చదవండి:
- సవ్యసాచి: ‘ఇది కండోమ్ ప్రకటనా? నగల ప్రకటనా?’- ఈ బ్రాండ్‌ను ఎందుకు నిషేధించమంటున్నారు
- వాట్సాప్ స్కాములతో జాగ్రత్త
- ‘పాతాళానికి ద్వారాలు’.. భారతదేశంలో మెట్ల బావులు
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పళ్లు ఎంతసేపు తోముకోవాలి? రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సముద్రం మింగేస్తుందా
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








