టీ20 వరల్డ్ కప్ NZvsAFG: అఫ్గానిస్తాన్‌పై న్యూజీలాండ్ విజయం, భారత్ సెమీస్ ఆశలు గల్లంతు

కేన్ విలియమ్సన్

ఫొటో సోర్స్, Francois Nel/getty images

ఫొటో క్యాప్షన్, కేన్ విలియమ్సన్

టీ20 వరల్డ్ కప్‌లో న్యూజీలాండ్ అఫ్గానిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అఫ్గాన్ విజయం సాధిస్తే నమీబియాపై మెరుగైన రన్ రేటుతో గెలిచి టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరాలనుకున్న భారత్ కలలు కల్లలయ్యాయి.

న్యూజీలాండ్‌పై అఫ్గానిస్తాన్ విజయం సాధించాలని కోరుకున్న భారత అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి.

అఫ్గానిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజీలాండ్ నేరుగా సెమీ ఫైనల్లో స్థానం సంపాదించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే ఇద్దరూ మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం అందించారు.

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కేన్ విలియమ్సన్ 40, డెవాన్ కాన్వే 32 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన న్యూజీలాండ్ 1.162 రన్ రేట్‌తో గ్రూప్-2లో టాప్‌కు చేరింది.

ఈ ఓటమితో అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగగా, రేపు(నవంబర్ 8న) భారత్-నమీబియా మధ్య జరగబోయే గ్రూప్ మ్యాచ్ నామమాత్రమే అయ్యింది. ఇందులో భారత్ భారీ విజయం సాధించినా ప్రయోజనం ఉండదు.

నజీబుల్లా జద్రన్ హాఫ్ సెంచరీ చేశాడు

ఫొటో సోర్స్, Francois Nel/getty images

ఫొటో క్యాప్షన్, 73 పరుగులు చేసిన నజీబుల్లా జద్రన్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 2లో సెమీస్ చేరడానికి కీలకంగా మారిన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ న్యూజీలాండ్‌ ముందు 125 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది.

125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ దూకుడుగా ఆడుతోంది.

ఆరు ఓవర్లలో పవర్ ప్లే ముగిసేసరికి కివీస్ 1 వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది.

26 పరుగుల దగ్గర స్పిన్నర్ ముజీబుర్ రహమాన్ న్యూజీలాండ్ తొలి వికెట్ తీశాడు.

నాలుగో ఓవర్ మొదటి బంతికి డెరిల్ మిచెల్(17) కీపర్ మహమ్మద్ షహజాద్‌కు క్యాచ్ ఇచ్చాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

57 పరుగుల దగ్గర తొమ్మిదో ఓవర్లో న్యూజీలాండ్ రెండో వికెట్ కోల్పోయింది.

స్పిన్నర్ రషీద్ ఖాన్‌ మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. గప్తిల్ 23 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేశాడు.

న్యూజీలాండ్ 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

దూకుడుగా ఆడి 73 పరుగులు చేసిన నజీబుల్లా జద్రన్ అఫ్గానిస్తాన్‌కు పోరాడే స్కోర్ అందించాడు.

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన అఫ్గానిస్తాన్ 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

ఆడం మిల్నే వేసిన మూడో ఓవర్‌లో ఓపెనర్ మొహమ్మద్ షహజాద్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ కాన్వే అద్భుతంగా పట్టుకున్నాడు. పైకి ఎగిరి బంతిని ఆపిన కాన్వే మూడో ప్రయత్నంలో దాన్ని పట్టుకోగలిగాడు.

తర్వాత ఓవర్‌కే అఫ్గానిస్తాన్ మరో ఓపెనర్ హజ్రతుల్లా వికెట్ కూడా కోల్పోయింది. ఈ వికెట్ ట్రెంట్ బౌల్ట్‌కు దక్కింది.

అప్పుడు స్కోరు 12 పరుగులు. తర్వాత మరో ఆరు పరుగులకే అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. టిమ్ సౌథీ బౌలింగ్‌లో రహ్మతుల్లా గుల్బదిన్ వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఆరు ఓవర్లలో పవర్ ప్లే ముగిసేసరికి అఫ్గానిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.

తర్వాత గుల్బదిన్ నయిబ్, నజీబుల్లా జద్రన్‌తో కలిసి స్కోరును 50 పరుగులు దాటించాడు. ఇద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న సమయంలో ఇష్ సోధీ ఈ జంటను విడదీశాడు.

సోధీ వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడిన గుల్బదిన్ నయీబ్(15) పెవిలియన్ చేరాడు.

తర్వాత నజీబుల్లా జద్రన్, కెప్టెన్ మహమ్మద్ నబీ మరో క్రీజులో నిలదొక్కుకోడానికే ప్రయత్నించారు. నబీ ఒకవైపు ఆచితూచి ఆడుతుంటే మరోవైపు నజీబుల్లా చెలరేగిపోయాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

అఫ్గానిస్తాన్-న్యూజీలాండ్ మ్యాచ్‌ను చూస్తున్నానని అఫ్గానిస్తాన్ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని అశ్విన్ ట్వీట్ చేశాడు.

14వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన నజీబుల్లా తర్వాత ఓవర్లోనే తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.

33 బంతుల్లోనే 50 పరుగులు చేసిన నజీబుల్లా ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. 17వ ఓవర్లో అఫ్గానిస్తాన్ వంద పరుగులు పూర్తి చేసుకుంది. ఇదే ఓవర్లో ఇద్దరి 50 పరుగుల భాగస్వామ్యం కూడా పూర్తైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

కానీ క్రీజులో నిలదొక్కుకున్నఈ జంట వెంటవెంటనే అవుటవడంతో అఫ్గానిస్తాన్ జోరుకు కళ్లెం పడింది.

టిమ్ సౌథీ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ మొహమ్మద్ నబీ(14) అతడికే క్యాచ్ ఇచ్చాడు.

ట్రెంట్ బౌల్ట్ ఆ తర్వాత ఓవర్లోనే దూకుడుగా ఆడుతున్న నజీబుల్లాతోపాటూ కరీమ్ జానత్‌ను పెవిలియన్‌కు పంపాడు.

భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి నజీబుల్లా ఇచ్చిన క్యాచ్‌ను జేమ్స్ నీషమ్ అద్భుతంగా అందుకున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

అదే ఓవర్లో నాలుగో బంతికి కరీమ్ జానత్ ఇష్ సోధీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో అఫ్గానిస్తాన్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.

48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేసిన నజీబుల్లా జద్రన్ అఫ్గానిస్తాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

నజీబుల్లా అవుటైన తర్వాత చివరి రెండు ఓవర్లలో అఫ్గానిస్తాన్ 9 పరుగులే చేయగలిగింది. 19వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి ఆరు పరుగులు చేసిన జట్టు, చివరి ఓవర్లో 2 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.

20వ ఓవర్ చివరి బంతికి అఫ్గానిస్తాన్ 8వ వికెట్ కూడా కోల్పోయింది. చివరి బంతికి షాట్ ప్రయత్నించిన రషీద్ ఖాన్ క్యాచ్‌ను జేమ్స్ నీషం అందుకున్నాడు.

దీంతో 20 ఓవర్లలో అఫ్గానిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది.

న్యూజీలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా, టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషం, ఇష్ సోధీ తలో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ గెలిస్తే భారత్‌కు సెమీస్ వెళ్లే అవకాశాలు ఉండడంతో అందరి కళ్లూ ఈ మ్యాచ్ ఫలితం మీదే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)