ఈ గబ్బిలం 2,018 కిలోమీటర్ల రికార్డు దూరం ప్రయాణించి, పిల్లి చేతిలో చనిపోయింది

ఫొటో సోర్స్, Getty Images
లండన్ నుంచి రష్యా వరకు 2,018 కి.మీ దూరం ప్రయాణించిన ఓ బుల్లి గబ్బిలం కొత్త రికార్డు నెలకొల్పింది. కానీ, కాసేపట్లోనే ఒక పిల్లి దాన్ని చంపేసింది.
బ్రిటన్ నుంచి యూరప్ వరకు ఒక గబ్బిలం ప్రయాణించిన అత్యధిక దూరం ఇదే కావడం విశేషం. ఇది బ్రిటన్‌లో ఇప్పటివరకూ నమోదైన గబ్బిలాల రికార్డులను బ్రేక్ చేసింది.
మన బొటనవేలు సైజుండే ఒక నాథుసియాసిస్ పిపిట్రెల్ జాతి ఆడ గబ్బిలాన్ని రష్యాలోని కోవ్ రీజియన్‌లో గుర్తించారు.
అప్పటికే, పిల్లి దాడికి గురైన దానిని గబ్బిలాలకు పునరావాసం కల్పించే ఒక బృందం కాపాడ్డానికి ప్రయత్నించింది. కానీ అది తర్వాత చనిపోయింది.
ఆ గబ్బిలం రెక్కపై ఉన్న 'లండన్ జూ' ముద్రను ఈ బృందం గుర్తించింది.
8 గ్రాముల బరువున్న ఈ పిపిట్రెల్ జాతి గబ్బిలాన్ని మొదట మోల్జినో గ్రామంలోని లపీనాలో గుర్తించారు. తర్వాత దీని గురించి యూకేలోని 'బ్యాట్ కన్జర్వేషన్ ట్రస్ట్'కు సమాచారమిచ్చారు.
"ఇది చాలా గొప్ప ప్రయాణం. బ్రిటన్ నుంచి యూరప్‌కు ప్రయాణించిన గబ్బిలాల విషయానికి వస్తే అన్నిటికంటే ఎక్కువ దూరం ప్రయాణించింది ఇదే. ఇదొక ఒలింపియన్ గబ్బిలం. బ్రిటన్‌లోని నాథుసియాస్ పిపిట్రెల్ గబ్బిలాల కదలికలు అంతుపట్టవు. ఇప్పుడు దీని ప్రయాణం శాస్త్రీయ పరిశోధనలకు సాయం చేయడంతోపాటూ గబ్బిలాల వలస గురించి తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది" అని బ్యాట్ కన్జర్వేషన్ ట్రస్ట్ సంరక్షణ సేవల హెడ్ లీసా వర్లెడ్జ్ అన్నారు.
2016లో ఈ గబ్బిలాన్ని లండన్ జూలో చేర్చిన సమయంలో గబ్బిలాల పరిశోధకుడు బ్రియాన్ బ్రిగ్స్ దాని రెక్కలపై జూ ముద్ర వేశారు.
'ఇది చాలా ఉత్సాహం కలిగిస్తోంది. ఈ అసాధారణమైన జీవుల పరిరక్షణ, వాటి మనుగడకు సంబంధించిన అధ్యయనంలో అంతర్జాతీయ సంరక్షణ సంస్థతో కలిసి పనిచేయడం బాగుంది' అని బ్రిగ్స్ అన్నారు.
యూరప్‌లో గతంలో కూడా ఇలాంటి రికార్డ్ నమోదైంది. 2019లో లాత్వియా నుంచి స్పెయిన్‌కు ప్రయాణించిన పిపిట్రెల్ జాతి గబ్బిలం మొత్తం 2,224 కి.మీ దూరం ప్రయాణించింది.
ఇప్పటివరకూ ఈ జాతి గబ్బిలాల్లో అత్యధిక దూరం ప్రయాణం రికార్డు ఇదే.
వాతావరణ మార్పులకు అనుగుణంగా ఈ పిపిట్రెల్ జాతి గబ్బిలాలు వలస వెళ్తుంటాయి. భవిష్యత్‌లో వచ్చే వాతావరణ మార్పులు ఈ జీవులపై ప్రభావం చూపిస్తాయని అంచనా వేస్తున్నారు.
2014లో నేషనల్ నాథుసియాసిస్ పిపిట్రెల్ ప్రాజెక్టు ప్రారంభమైన నాటినుంచి యూకేలో 2,600లకు పైగా పిపిట్రెల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ జాతి గబ్బిలాల సంతానం, విస్తరణ, వలసల తీరుపై అధ్యయనం కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
బ్రిటన్‌లోని కెంట్, నార్తుంబర్లాండ్, సర్రే, గ్రేటర్ లండన్‌లు ఈ గబ్బిలాల సంతానోత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో సిఐఏకు సాయపడ్డ డాక్టర్ షకీల్ అఫ్రిది... అమెరికాలో హీరో, పాకిస్తాన్లో ద్రోహి
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









