బ్రెజిల్: కరోనా సంక్షోభానికి దేశాధ్యక్షుడే కారణమంటూ నిరసనలు, బొల్సొనారో రాజీనామా చేయాలని డిమాండ్ - News Reel

బ్రెజిల్ నిరసనలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్‌లో నిరసనలు

కోవిడ్-19 సంక్షోభాన్ని పరిష్కరించడంలో దేశాధ్యక్షుడు జైర్ బొల్సొనారో ప్రభుత్వం విఫలమైందని బ్రెజిల్‌లో ప్రజలు నిరసనలు చేపడుతున్నారు.

రాజధాని బ్రసీలియాలోని కాంగ్రెస్ భవనం ఎదుట వేల సంఖ్యలో నిరసనకారులు గుమిగూడారు.

బొల్సొనారో రాజీనామా చేయాలని, మరిన్ని వ్యాక్సీన్లను ప్రజలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

బ్రెజిల్

ఫొటో సోర్స్, EPA

రియో డీ జెనీరో సహా పలు ప్రధాన నగరాల్లోనూ ఈ నిరసనలు జరిగాయి.

బ్రెజిల్

ఫొటో సోర్స్, EPA

బ్రెజిల్‌లో ఇప్పటివరకు దాదాపు 4లక్షల 61వేల మంది కరోనాతో చనిపోయారు.

మృతుల్లో అమెరికా తర్వాతి స్థానం బ్రెజిల్‌దే.

కేసుల విషయంలో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది.

ఇక్కడ 1.6 కోట్లకుపైగా కేసులు నమోదయ్యాయి.

బ్రెజిల్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా సంక్షోభ పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, నెమ్మదిగా కొనసాగుతున్న వ్యాక్సీన్ల ప్రక్రియపై సెనేట్ విచారణకు ఆదేశించడంతో బొల్సొనారోపై ఒత్తిడి పెరిగింది.

తాజా నిరసనలతో ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది.

బ్రెజిల్

ఫొటో సోర్స్, EPA

కరోనావైరస్ కట్టడికి చర్యలు, వ్యాక్సీన్ కార్యక్రమాలు నెమ్మదిగా కొనసాగడానికి బొల్సొనారోనే కారణమని విపక్షాలు, కార్మిక సంఘాలు, సామాజిక ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

కోవిడ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఇక్కడ ఆరోగ్య వ్యవస్థ దాదాపుగా కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)