ఆస్ట్రేలియా నేవీ వేడుకలో పొట్టి నిక్కర్లతో అమ్మాయిల డ్యాన్స్

ఆస్ట్రేలియా నేవీ అమ్మాయిల డాన్స్

ఫొటో సోర్స్, @ALEXBRUCESMITH/TWITTER

    • రచయిత, ఫ్రాన్సిస్ మావో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాలో ఒక మిలటరీ వేడుక సందర్భంగా కొందరు డాన్సర్లు పొట్టి దుస్తులు వేసుకుని 'ట్వెర్కింగ్' డాన్స్ చేసిన వీడియో ఆ దేశంలో దుమారం లేపింది.

బుధవారం ఆ డాన్స్ వీడియో క్లిప్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

పిరుదులు ఊపుతూ చేసిన ఆ డాన్స్‌పై సంప్రదాయవాదులు విరుచుకుపడ్డారు.

మిలటరీ ప్రమాణాలను విమర్శిస్తూ కొందరు పోస్టులు పెట్టారు. ఆ డాన్స్ చేసినవారిని అవమానపరుస్తూ మరికొందరు లైంగికపరమైన కామెంట్లు చేశారు.

కాగా, ఇలాంటి కామెంట్లు చేసేవారిని మరికొందరు విమర్శించారు. మహిళల శరీరాల పట్ల, డాన్స్ పట్ల వెకిలి కామెంట్లు చేస్తున్నారంటూ ఆగ్రహించారు.

వీడియోలో కనిపిస్తున్న డాన్స్ బృందం '101 డాల్ స్క్వాడ్రన్'.. తమ డాన్స్‌పై మీడియాలో వచ్చిన కవరేజ్ మీద ఫిర్యాదు చేసింది.

ఆస్ట్రేలియా జాతీయ వార్తా సంస్థ ఏబీసీ తమ డాన్స్ క్లిప్‌ను తప్పుగా ఎడిట్ చేసిందని ఆరోపించింది.

ఇంతకూ ఈ "నేవీ ట్వెర్కింగ్" డాన్స్ వివాదం ఎక్కడ, ఎలా మొదలైంది?

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అసలేం జరిగింది?

గత శనివారం కొత్త నౌక 'హెచ్ఎంఏఎస్ సప్లయ్' ప్రారంభోత్సవ సందర్భంగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ 101 డాల్ స్క్వాడ్రన్ బృందం నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసింది.

అయితే, ఈ ప్రదర్శనలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి ఏబీసీ రిపోర్టర్ ట్విట్టర్‌లో విడుదల చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.

ఆ వీడియోతో పాటూ ఆ రిపోర్టర్ తన ట్వీట్‌లో.. రక్షణ శాఖ విలువల పతనానికి విచారిస్తూ ఒక ప్రభుత్వ ఎంపీ చేసిన వ్యాఖ్యలను కూడా జత చేయడంతో ఈ డాన్స్ వీడియో వైరలైంది.

అయితే, తరువాత ఆ ట్వీట్‌ను తొలగించారు.

కాగా, ఆ డాన్స్ వీడియోను తప్పుగా ఎడిట్ చేశారని ఆరోపణలు రావడంతో, ఏబీసీ వార్తా సంస్థ క్షమాపణలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.

మరో పక్క, ఆస్ట్రేలియన్ నావికాదళ ప్రముఖులుగానీ, అధికారులుగానీ ఆ డాన్స్ చూడలేదని, వారు అక్కడకు చేరుకోక ముందే ఆ నృత్య ప్రదర్శన ముగిసిందని నేవీ తెలిపింది.

ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్.. "విలువలు పడిపోయాయాయని" అని వ్యాఖ్యానిస్తూనే ఏబీసీ రిపోర్టింగ్‌ను తప్పుబట్టారు.

నేవీ ఈ నృత్య ప్రదర్శనను ఎందుకు ఏర్పాటు చేసిందో వివరణ ఇవ్వలేదు.

ఇది తప్ప, మిగతా వేడుక అంతా నిదానంగా సంప్రదాయ నేవీ పద్ధతుల్లోనే జరిగింది.

నేవీ ఈవెంట్

ఫొటో సోర్స్, COMMANDER AUSTRALIAN FLEET/TWITTER

పొట్టి దుస్తులు వేసుకోవడంపై విమర్శలు

పొట్టి బట్టలు వేసుకుని మిలటరీ వేడుకలో డాన్స్ చేయడం తగని పని అంటూ సంప్రదాయవాదులు విమర్శించారు.

ఇలాంటి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం షాక్‌కు గురి చేసిందని, అది నేవీ వేడుకలా కాక, సూపర్ బౌల్‌లా కనిపించిందనీ ఇండిపెండెంట్ సెనేటర్, సీనియర్ సైనిక అధికారి జాక్వీ లాంబీ వ్యాఖ్యానించారు.

"అక్కడకు వెళ్లి ప్రదర్శన ఇవ్వడం ఆ అమ్మాయిలకు మంచిదేగానీ యుద్ధనౌక పైభాగంలో సగం బట్టలేసుకుని డాన్స్ చేయడం మంచి పద్ధతి కాదు" అని ఆమె అన్నారు.

మిలటరీ ఇలాంటి ప్రదర్శనను ఎంచుకోవడంపై అనేకమంది విమర్శలు గుప్పించారు.

అయితే, ఈ విమర్శలు పెచ్చు మీరి ఆ డాన్స్ బృందంలోని అమ్మాయిలపై లైంగిక వ్యాఖ్యలు చేసే స్థాయికి చేరాయి.

ది డైలీ టెలెగ్రాఫ్ పత్రిక ఆ అమ్మాయిల డాన్స్ భంగిమలతో ముందు పేజీ నింపేసింది.

ఆ డాన్స్ కొరియోగ్రఫీ మహిళల గౌరవాన్ని తగ్గించేదిగా ఉందని పలువురు విమర్శించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రాజకీయ చర్చల్లో చోటు చేసుకుంటున్న లింగ అసమానతలకు ముడిపెట్టి విశ్లేషించారు.

అయితే, ఈ మొత్తం వ్యవహారం పట్ల ఆ డాన్స్ బృందంలోనిఅమ్మాయిల ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి అభిప్రాయం ఏమిటి అనేది పట్టించుకున్నవారు అతి కొద్ది మంది మాత్రమే.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

'మీరు మమ్మల్ని సెక్సువలైజ్ చేశారు'

101 డాల్ స్క్వాడ్రన్ బృందంలో అధికంగా స్థానికులు, భిన్నమైన జాతి నేపథ్యాల నుంచి వచ్చినవారు ఉన్నారు.

వీరి బృందం ఆధునిక నృత్య రీతులకు ప్రసిద్ధి చెందింది. సాధారణంగా పార్టీల్లోనూ, వేడుకల్లోనూ వీళ్ల డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తూ ఉంటారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియా వక్రదృష్టితో చిత్రీకరించిందని 101 డాల్ స్క్వాడ్రన్ బృందం ఆరోపించింది.

ఏబీసీ వార్తా సంస్థ వీడియోను తప్పుగా ఎడిట్ చేసి మొత్తం సంఘటనను తప్పుదోవ పట్టించిందని ఆరోపించింది.

"ఏబీసీ రిపోర్టర్ వారి అవసరాల కోసం మా నృత్య కదలికలను సెక్సువలైజ్ చేశారని" ఈ బృందం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఆన్‌లైన్‌లో వారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, వారిపై అసభ్యకరమైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

"మమ్మల్ని బెదిరింపులకు, దోపిడీకి గురి చేస్తున్నారని" వాపోయారు.

అయితే, ఈ విమర్శలన్నీ నిజంగా ఆ అమ్మాయిల డాన్స్‌కు, డాన్స్ స్టైల్‌కే పరిమితమా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.

అనవసరంగా ఆ అమ్మాయిలపై విమర్శలు గుప్పిస్తూ వారిని అవమానాలపాలు చేస్తున్నారని కొందరు అభిప్రాయపడ్దారు.

"రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ ఈ మొత్తం వ్యవహారాన్ని వింత గొలిపేట్టు చేసింది. ఆ డాన్స్ బృందం కళారూపాన్ని ఎగతాళి చేసింది. ఆ అమ్మాయిలు వాళ్ల పని వారు చేశారు" అంటూ ఆస్ట్రేలియన్ ఉమెన్స్ వెబ్సైట్ 'మామామియా' ఒక వ్యాసాన్ని ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)