దుబాయ్‌లో న్యూడ్ ఫొటోషూట్.. 11 మంది మహిళల అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
దుబాయిలో 11 మంది అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొంతమంది అమ్మాయిలు బాల్కనీలో నగ్నంగా ఫొటోలు దిగి వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.
వీరిలో యుక్రెయిన్‌కు చెందిన 11 మంది అమ్మాయిలు ఉన్నట్లు యుక్రెయిన్ కాన్సులేట్ బీబీసీకి చెప్పింది.
పోలీసుల అదుపులో రష్యాకు చెందిన మరొకరు కూడా ఉన్నట్లు రష్యా మీడియా తెలిపింది.
దుబాయ్‌లోని మరినా జిల్లాలో ఒక ఇంటిలో ఇలా నగ్నంగా ఫొటోలు దిగారు.
ఇలా బహిరంగంగా అశ్లీలంగా ప్రవర్తించారనే అభియోగంపై ఆ అమ్మాయిలను పోలీసులు అరెస్టు చేశారు.
దుబాయిలో బహిరంగంగా అశ్లీలంగా ప్రవర్తించడం నేరం.
ఈ నేరానికి 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు 99,671 రూపాయిల జరిమానా విధిస్తారు.
యూఎఈ లో చాలా వరకు చట్టాలన్ని షరియా చట్టం ఆధారంగానే ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో ప్రేమను, స్వలింగ సంబంధాలను బహిరంగంగా వ్యక్తం చేసినందుకు కొంతమందికి జైలు శిక్షలు కూడా పడ్డాయి.
ఈ ఫోటో షూట్ నిర్వహించిన రష్యాకి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రియా వార్తా సంస్థ పేర్కొంది.
ఈ నేరానికి ఆయనకు 18 నెలల జైలు శిక్ష విధిస్తారని ఏజెన్సీ తెలిపింది.
పోర్నోగ్రఫీ లేదా ప్రజల నైతిక విలువలకు వ్యతిరేకంగా ఉండే ఎటువంటి సమాచారాన్ని ప్రచురించినా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని దుబాయి పోలీసులు హెచ్చరించారు.
ఇలాంటి అభ్యంతరకరమైన ప్రవర్తన ఎమిరేట్ సమాజం విలువలను ప్రతిబింబించదని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
యూఎఈలో నివసించేవారు, దేశానికి వచ్చేవారు కూడా ఆ దేశ చట్టాలకు కట్టుబడి ఉండాలని, పర్యటకులకు వీటి నుంచి ఎటువంటి మినహాయింపు లేదని తెలిపారు.
దుబాయిలో గతంలో పర్యటకులు అరెస్టు అయిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి.
బ్రిటన్‌కి చెందిన ఒక మహిళ వివాహం కాకుండా ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్నందుకు 2017లో ఆమెకు ఒక సంవత్సర కాలం పాటు జైలు శిక్ష విధించారు.
ఆ వ్యక్తి ఆమెకు బెదిరింపు సందేశాలు పంపుతున్నారని ఫిర్యాదు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








